Aanandame Aashcharyame Andaala Baaludu Janminchenu Lyrics in Telugu & English
Verse 1
ఆనందమే ఆశ్చర్యమే
అందాల బాలుడు జన్మించెను
అవనిఅంతా ఆనందమే నింగిలోన సంతోషమే
మనసంత సంతోషమే మనరాజు జన్మించెను
ఇది క్రిస్మస్ ఆనందమే
Aanandame Aashcharyame
Andaala Baaludu Janminchenu
Avaniantaa Aanandame Ningilona Santoshame
Manasanta Santoshame Manaraaju Janminchenu
Idi Krismas Aanandame
Verse 2
లోకాలనేలే రారాజు జన్మించే
దిగి వచ్చినాడు దీనులను రక్షింప
నరావతారునిగా నరరూప మెత్తినాడు
బెత్లహేము గ్రామమందు యూదా గోత్రమందు
కన్య మరియ గర్భమందు జన్మించినాడని
ఇది క్రిస్మస్ ఆనందమే
Lokaalanele Raaraaju Janminche
Digi Vachchinaadu Deenulanu Rakshimpa
Naraavataarunigaa Nararoopa Mettinaadu
Betlahemu Graamamandu Yoodaa Gotramandu
Kanya Mariya Garbhamandu Janminchinaadani
Idi Krismas Aanandame
Verse 3
పరలోక సైన్యమే పరవశించి పాడిరి
పరిశుద్ధుడైన యేసు పసి బాలుడై వచ్చెనని
జ్ఞానులంతా పూజించి కానుకలర్పించిరి
ఊరువాడ సందడాయే శ్రీ యేసు పుట్టాడని
ఇది క్రిస్మస్ ఆనందమే
Paraloka Sainyame Paravashinchi Paadiri
Parishuddhudaina Yesu Pasi Baaludai Vachchenani
Jnyaanulantaa Poojinchi Kaanukalarpinchiri
Ooruvaada Sandadaaye Shree Yesu Puttaadani
Idi Krismas Aanandame
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.