Skip to content
ThuthiThuthiThuthi

Amoolyaraktamu Dvaaraarakshanapondina Janulaaraa Song Lyricsఅమూల్యరక్తము ద్వారారక్షణపొందిన జనులారా

Amoolyaraktamu Dvaaraarakshanapondina Janulaaraa Lyrics in Telugu & English

Present

Chorus

అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా

సర్వ శక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదము

ఘనత మహిమ స్తుతులను పరిశుద్ధులారా పాడెదము

మన యవ్వన జీవితములు – శరీరాశకు లోబరచి (2)

చెడు మాటలను పలుకుచు – శాంతి లేక యుంటిమిగా (2)

||అమూల్య||

Amoolya Raktamu Dvaaraa Rakshana Pondina Janulaaraa

Sarva Shaktuni Prajalaaraa Parishuddhulaaraa Paadedamu

Ghanata Mahima Stutulanu Parishuddhulaaraa Paadedamu

Mana Yavvana Jeevitamulu – Shareeraashaku Lobarachi (2)

Chedu Maatalanu Palukuchu – Shaanti Leka Yuntimigaa (2)

||Amoolya||

Verse 1

చెడు మార్గమున పోతిమి – దాని యంతము మరణము (2)

నరక శిక్షకు లోబడుచు – పాపపు ధనము పొందితిమి (2)

||అమూల్య||

Chedu Maargamuna Potimi – Daani Yantamu Maranamu (2)

Naraka Shikshaku Lobaduchu – Paapapu Dhanamu Ponditimi (2)

||Amoolya||

Verse 2

నిత్య సత్య దేవుని – నామమున మొరలిడక (2)

స్వంత నీతి తోడనే – దేవుని రాజ్యము కోరితిమి (2)

||అమూల్య||

Nitya Satya Devuni – Naamamuna Moralidaka (2)

Svanta Neeti Todane – Devuni Raajyamu Koritimi (2)

||Amoolya||

Verse 3

కనికరముగల దేవుడు – మానవరూపము దాల్చెను (2)

ప్రాణము సిలువను బలిజేసి – మనల విమోచించెను (2)

||అమూల్య||

Kanikaramugala Devudu – Maanavaroopamu Daalchenu (2)

Praanamu Siluvanu Balijesi – Manala Vimochinchenu (2)

||Amoolya||

Verse 4

తన రక్త ధారలలో – మన పాపములను కడిగి (2)

మన కన్నులను తెరచి – మనల నింపెను జ్ఞానముతో (2)

||అమూల్య||

Tana Rakta Dhaaralalo – Mana Paapamulanu Kadigi (2)

Mana Kannulanu Terachi – Manala Nimpenu Jnyaanamuto (2)

||Amoolya||

Verse 5

పాపులమైన మన మీద – తన యాశ్చర్య ఘన ప్రేమ (2)

కుమ్మరించెను మన ప్రభువు – కృతజ్ఞత చెల్లింతుము (2)

||అమూల్య||

Paapulamaina Mana Meeda – Tana Yaashcharya Ghana Prema (2)

Kummarinchenu Mana Prabhuvu – Krutajnyata Chellintumu (2)

||Amoolya||

Verse 6

మన రక్షకుని స్తుతించెదము – మనలను జేసెను ధన్యులుగా (2)

మన దేవుని కర్పించెదము – జీవాత్మ శరీరములను (2)

||అమూల్య||

Mana Rakshakuni Stutinchedamu – Manalanu Jesenu Dhanyulugaa (2)

Mana Devuni Karpinchedamu – Jeevaatma Shareeramulanu (2)

||Amoolya||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with A