Ayyo Yidi Duhkhamu Prabhu Lyrics in Telugu & English
Chorus
అయ్యో యిది దుఃఖము ప్రభు తీర్పువేళ నయ్యో యిది యెంత
దుఃఖము చయ్యన యెహోవా సింహా సనము చుట్టు వహ్ని మండు
నయ్యెడ విశ్వాసులకు దు రాత్మల కగు నిత్య ఖేద
||అయ్యో||
Ayyo Yidi Duhkhamu Prabhu Teerpuvela Nayyo Yidi Yenta
Duhkhamu Chayyana Yehovaa Sinhaa Sanamu Chuttu Vahni Mandu
Nayyeda Vishvaasulaku Du Raatmala Kagu Nitya Kheda
||Ayyo||
Verse 1
తల్లి పిల్లలు గూడుదు రచటఁ దండ్రి తాత లచటఁ గలియుదు రెల్ల కాల
మటుల నుండ కెడబడి మరి యెపుడు చూడ
||అయ్యో||
Talli Pillalu Goodudu Rachatan Dandri Taata Lachatan Galiyudu Rella Kaala
Matula Nunda Kedabadi Mari Yepudu Chooda
||Ayyo||
Verse 2
అన్నదమ్ములచటఁ గూడుదురు రక్క సెలియలందుఁ గలియుదు రెన్నఁ
డు మరి చూడ రాని యెడఁగల స్థలములకుఁ బోదు
||అయ్యో||
Annadammulachatan Gooduduru Rakka Seliyalandun Galiyudu Rennan
Du Mari Chooda Raani Yedangala Sthalamulakun Bodu
||Ayyo||
Verse 3
భార్యాభర్తలు గూడుదురు రచట బంధు మిత్రులు కలియుదురు రందుఁ
కార్య భేదమువలన సర్వ కాలము మరి కూడఁజాల
||అయ్యో||
Bhaaryaabhartalu Gooduduru Rachata Bandhu Mitrulu Kaliyuduru Randun
Kaarya Bhedamuvalana Sarva Kaalamu Mari Koodanjaala
||Ayyo||
Verse 4
క్రీస్తు మత ప్రబోధకులు స మస్త శిష్యులు కూడుదు రచట వాస్తవ స్థితు
లెరుఁగఁబడిన వలనను విడఁబడుదు రంద
||అయ్యో||
Kreestu Mata Prabodhakulu Sa Masta Shishyulu Koodudu Rachata Vaastava Sthitu
Lerunganbadina Valananu Vidanbadudu Randa
||Ayyo||
Verse 5
శిష్టులు దుష్టులు కూడుదు రచట స్నేహవంతు లందుఁ గలియుదు
రిష్టము గాని భిన్నులగుచు నిఁక మరి యెన్నటికిఁ గూడ
||అయ్యో||
Shishtulu Dushtulu Koodudu Rachata Snehavantu Landun Galiyudu
Rishtamu Gaani Bhinnulaguchu Ninka Mari Yennatikin Gooda
||Ayyo||
Verse 6
అల పిశాచి పాపు లందరు నడుపు కర్తకు భిన్ను లగుచు పలుగొరుకుల
నిత్య నరక బాధల పాల్బడక పోరు
||అయ్యో||
Ala Pishaachi Paapu Landaru Nadupu Kartaku Bhinnu Laguchu Palugorukula
Nitya Naraka Baadhala Paalbadaka Poru
||Ayyo||
Verse 7
సాధు సజ్జనంబు లెల్ల సకల దూతలతోడఁ గూడి మోదముతో
ప్రభుని వెంట ముక్తి కేగి నిత్యులగుదు రాహా యిది యెంత విజయము
ప్రభు తీర్పు వేళ నాహా యిది యెంత విజయము
||అయ్యో||
Saadhu Sajjanambu Lella Sakala Dootalatodan Goodi Modamuto
Prabhuni Venta Mukti Kegi Nityulagudu Raahaa Yidi Yenta Vijayamu
Prabhu Teerpu Vela Naahaa Yidi Yenta Vijayamu
||Ayyo||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.