Devaa Deevinchu Mippudu Deena Janaalin Lyrics in Telugu & English
Chorus
దేవా దీవించు మిప్పుడు దీన జనాళిన్ గావ రా రమ్మెల్లప్పుడు నీ
వరగద్దెచుట్టు నిజ దాసు లిటులఁ గూడి పావన సంస్కారమును బంచి
పాలొందుచుండ
||దేవా||
Devaa Deevinchu Mippudu Deena Janaalin Gaava Raa Rammellappudu Nee
Varagaddechuttu Nija Daasu Litulan Goodi Paavana Sanskaaramunu Banchi
Paalonduchunda
||Devaa||
Verse 1
మముఁ గావ నైదు గాయముల్ బొందిన దేవ సముఁడా నీ రక్త
కాయముల్ విమలింపు భక్తి ద్వారా వీక్షించి మనసులందు అమిత దుః
ఖ మొందుటచే నలిగిన భక్త జనులన్
||దేవా||
Mamun Gaava Naidu Gaayamul Bondina Deva Samundaa Nee Rakta
Kaayamul Vimalimpu Bhakti Dvaaraa Veekshinchi Manasulandu Amita Duh
Kha Mondutache Naligina Bhakta Janulan
||Devaa||
Verse 2
నీ రాజ్యమునకు మముఁ జేర్ప నిజము మా పాప ఘోర శాపమ్ములన్
దీర్ప నోరిమిచే మా కొరకు దారుణముగ నొందిన క్రూర మరణమును
దలఁచి కుములుచున్న హృదయులను
||దేవా||
Nee Raajyamunaku Mamun Jerpa Nijamu Maa Paapa Ghora Shaapammulan
Deerpa Norimiche Maa Koraku Daarunamuga Nondina Kroora Maranamunu
Dalanchi Kumuluchunna Hrudayulanu
||Devaa||
Verse 3
కోరి నినుఁ గొలుచు భక్తుల కోరిక లభివృద్ది గా రాజిలఁజేయు శక్తుల
ధారాళముగ నొసంగు ధనాత్ముండ నీ దివ్యా కార మందుండి యీ సం
స్కార సమయమున మమ్ము
||దేవా||
Kori Ninun Goluchu Bhaktula Korika Labhivruddi Gaa Raajilanjeyu Shaktula
Dhaaraalamuga Nosangu Dhanaatmunda Nee Divyaa Kaara Mandundi Yee Sam
Skaara Samayamuna Mammu
||Devaa||
Verse 4
మా దారిద్ర్యములు బాపనే పాపభారంపు మ్రాను నీ దివ్య మూపుననే
గాదిలిచే భరియించి గడి దొంగ లిరువురిలో బాధ లొందితి వనుచు
బహుగా దుఃఖించు మమ్ము
||దేవా||
Maa Daaridryamulu Baapane Paapabhaarampu Mraanu Nee Divya Moopunane
Gaadiliche Bhariyinchi Gadi Donga Liruvurilo Baadha Londiti Vanuchu
Bahugaa Duhkhinchu Mammu
||Devaa||
Verse 5
నీ వీ విధంపు మరణముచే నిజముగా మమ్ము జీవింపఁజేసి నిల్పుటచే
పావనదేవ మే మీ ప్రభు సంస్కారమ్ము మా మా జీవాత్మ లాదరణకై
జే మనముగఁ గైకొనను
||దేవా||
Nee Vee Vidhampu Maranamuche Nijamugaa Mammu Jeevimpanjesi Nilputache
Paavanadeva Me Mee Prabhu Sanskaarammu Maa Maa Jeevaatma Laadaranakai
Je Manamugan Gaikonanu
||Devaa||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.