Skip to content
ThuthiThuthiThuthi

Dhavalavarnudaa Naa Praana Priyudaa Varnanakandani Ati Song Lyricsధవళవర్ణుడా నా ప్రాణ ప్రియుడా వర్ణనకందని అతి

Dhavalavarnudaa Naa Praana Priyudaa Varnanakandani Ati Lyrics in Telugu & English

Present

Chorus

ధవళవర్ణుడా నా ప్రాణ ప్రియుడా వర్ణనకందని అతి శ్రేష్ఠుడా (2)

ఆరాధింతును నిను మనసారా అత్యున్నతమైన నీ కృప పొంద (2)

అతికాంక్షణీయుడు నా యేసయ్య (2)

||ధవళవర్ణుడా||

Dhavalavarnudaa Naa Praana Priyudaa Varnanakandani Ati Shreshthudaa (2)

Aaraadhintunu Ninu Manasaaraa Atyunnatamaina Nee Krupa Ponda (2)

Atikaankshaneeyudu Naa Yesayya (2)

||Dhavalavarnudaa||

Verse 1

అలజడి రేగిన నానావలో నీ శాంతి నే చూచితిని

అవమానములో అండగ నిలిచిన ఆశ్రయుడవు నీవయ్య

పరిమలింపజేసితివి నీ స్నేహ బంధంవిలువైన నీ త్యాగముతో

చేరాను నీ దరి నీ ప్రేమ కోరి నిను విడచి నేనుండలేను (2)

||ధవళవర్ణుడా||

Alajadi Regina Naanaavalo Nee Shaanti Ne Choochitini

Avamaanamulo Andaga Nilichina Aashrayudavu Neevayya

Parimalimpajesitivi Nee Sneha Bandhanviluvaina Nee Tyaagamuto

Cheraanu Nee Dari Nee Prema Kori Ninu Vidachi Nenundalenu (2)

||Dhavalavarnudaa||

Verse 2

నిలకడలేని నా హృదిలో నీ వాక్యమే స్ధిరపరచెను

నిందల పర్వములో నా తోడు నిలచిన నా ధైర్యము నీవయ్య

పదిలమైతిని నీ మదిలో నేను పరిశుద్ధుడా నా యేసయ్య

చేరాను నీ దరి నీ ప్రేమ కోరి నిను విడచి నేనుండలేను (2)

||ధవళవర్ణుడా||

Nilakadaleni Naa Hrudilo Nee Vaakyame Sdhiraparachenu

Nindala Parvamulo Naa Todu Nilachina Naa Dhairyamu Neevayya

Padilamaitini Nee Madilo Nenu Parishuddhudaa Naa Yesayya

Cheraanu Nee Dari Nee Prema Kori Ninu Vidachi Nenundalenu (2)

||Dhavalavarnudaa||

Verse 3

శిధిలముకాని సుందర నగరములో నీతో నేను జీవింతును

స్తుతి గానములతో నిను కీర్తించుటయే నా జీవిత భాగ్యము

స్థాపించియున్నావు నా కొరకే నీవు నిత్య సీయోనును

చేరాను నీ దరి నీ ప్రేమ కోరి నిను విడచి నేనుండలేను (2)

||ధవళవర్ణుడా||

Shidhilamukaani Sundara Nagaramulo Neeto Nenu Jeevintunu

Stuti Gaanamulato Ninu Keertinchutaye Naa Jeevita Bhaagyamu

Sthaapinchiyunnaavu Naa Korake Neevu Nitya Seeyonunu

Cheraanu Nee Dari Nee Prema Kori Ninu Vidachi Nenundalenu (2)

||Dhavalavarnudaa||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with D