Skip to content
ThuthiThuthiThuthi

Karuna Choopinchumaa Yesayya Kanneeru Tudavagaa Song Lyricsకరుణ చూపించుమా యేసయ్య కన్నీరు తుడవగా

Karuna Choopinchumaa Yesayya Kanneeru Tudavagaa Lyrics in Telugu & English

Present

Chorus

కరుణ చూపించుమా – యేసయ్య కన్నీరు తుడవగా

మహిమ కురిపించుమా – యేసయ్య స్వస్థతలు చూపగా (2)

నీ ప్రజలము అయిన మేము – మృత్యువు కోరలో చిక్కాము

ఏ దారియు కానరాక – నశియించి పోతున్నాము (2)

కరుణగల దేవుడు నీవు

కరుణించి కాపాడుమా (2) ||కరుణ||

Karuna Choopinchumaa – Yesayya Kanneeru Tudavagaa

Mahima Kuripinchumaa – Yesayya Svasthatalu Choopagaa (2)

Nee Prajalamu Ayina Memu – Mrutyuvu Koralo Chikkaamu

E Daariyu Kaanaraaka – Nashiyinchi Potunnaamu (2)

Karunagala Devudu Neevu

Karuninchi Kaapaadumaa (2) ||Karuna||

Verse 1

ఐగుప్తులో పది తెగుల్లలో – నీ ప్రజలను కాపాడితివి

గొఱ్ఱెపిల్ల రక్తము నిచ్చి – మృత్యువాత తప్పించితివి (2)

నీ నామము మదిలో నిలిపి – ఈ ఆపదలో వేడాము

నీ మహిమను తిరిగి చూడగా – నీ సన్నిధిలో చేరాము (2)

||కరుణగల||

Aiguptulo Padi Tegullalo – Nee Prajalanu Kaapaaditivi

Gorrepilla Raktamu Nichchi – Mrutyuvaata Tappinchitivi (2)

Nee Naamamu Madilo Nilipi – Ee Aapadalo Vedaamu

Nee Mahimanu Tirigi Choodagaa – Nee Sannidhilo Cheraamu (2)

||Karunagala||

Verse 2

ఇశ్రాయేలు వారిగ మేము – నీ ఉనికిని ప్రశ్నించాము

నీ ప్రేమను రుచి చూసిననూ – మారాను కురిపించాము (2)

చెలరేగే సర్పము కాటు – మములను కబళించే వేళ

మాకు దిక్కు నీవేనంటూ – మోకరించి నిను వేడితిమి (2)

||కరుణగల||

Ishraayelu Vaariga Memu – Nee Unikini Prashninchaamu

Nee Premanu Ruchi Choosinanoo – Maaraanu Kuripinchaamu (2)

Chelarege Sarpamu Kaatu – Mamulanu Kabalinche Vela

Maaku Dikku Neevenantoo – Mokarinchi Ninu Veditimi (2)

||Karunagala||

Verse 3

మరణమునే జయించి నీవు – సజీవుడిగా నిలిచావు

నిన్ను నమ్మి వేడిన చాలు – మా తప్పులు మరిచావు (2)

నేను జీవించితి గనుక – మీరును జీవించెదరన్న

వాగ్దానము నమ్మితిమయ్యా – నెరవేర్చుము మా యేసయ్య (2)

||కరుణగల||

Maranamune Jayinchi Neevu – Sajeevudigaa Nilichaavu

Ninnu Nammi Vedina Chaalu – Maa Tappulu Marichaavu (2)

Nenu Jeevinchiti Ganuka – Meerunu Jeevinchedaranna

Vaagdaanamu Nammitimayyaa – Neraverchumu Maa Yesayya (2)

||Karunagala||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with K