Skip to content
ThuthiThuthiThuthi

Mahimagala Raajaa Ninne Stutiyintumu Mahonnata Devaa Song Lyricsమహిమగల రాజా నిన్నే స్తుతియింతుము మహోన్నత దేవా

Mahimagala Raajaa Ninne Stutiyintumu Mahonnata Devaa Lyrics in Telugu & English

Present

Verse 1

మహిమగల రాజా - నిన్నే స్తుతియింతుము

మహోన్నత దేవా - నిన్నే కీర్తింతుము

యేసురాజా - రాజుల రాజా - నిన్నే స్తోత్రింతుము

యేసురాజా - రాజుల రాజా - మా సర్వం నీకిత్తుము

కష్టమైన నష్టమైన - నిన్నే కొనియాడెదం

శోధనలైన వేదనలైనా - నీకై జీవింతుము

ఎన్ని నిందలొచ్చినా - ఎన్ని బాధలొచ్చినా

నీకొరకే మేం నిలుతుము

||యేసు||

Mahimagala Raajaa - Ninne Stutiyintumu

Mahonnata Devaa - Ninne Keertintumu

Yesuraajaa - Raajula Raajaa - Ninne Stotrintumu

Yesuraajaa - Raajula Raajaa - Maa Sarvam Neekittumu

Kashtamaina Nashtamaina - Ninne Koniyaadedam

Shodhanalaina Vedanalainaa - Neekai Jeevintumu

Enni Nindalochchinaa - Enni Baadhalochchinaa

Neekorake Mem Nilutumu

||Yesu||

Verse 2

నత్తివాడైన మోషేను - నాయకుడిగా చేసెను అదృఉండ

గొల్లవాడైన దావీదును - గొప్పరాజుగా మార్చెను

బానిసైన యోసేపును - బహుగా బహుగా దీవించెను

||యేసు||

Nattivaadaina Moshenu - Naayakudigaa Chesenu Adruunda

Gollavaadaina Daaveedunu - Gopparaajugaa Maarchenu

Baanisaina Yosepunu - Bahugaa Bahugaa Deevinchenu

||Yesu||

Verse 3

పిరికివాడై పేతురును - పౌరుషముతో నింపెను

పొట్టివాడైన పౌలును - గట్టివాడిగా చేసెను

అనుమానించే తోమాను - సిలువ సాక్షిగా మార్చెను

||యేసు||

Pirikivaadai Peturunu - Paurushamuto Nimpenu

Pottivaadaina Paulunu - Gattivaadigaa Chesenu

Anumaaninche Tomaanu - Siluva Saakshigaa Maarchenu

||Yesu||

Verse 4

దుక్కిదున్నే ఏలీషాను - దీర్ఘదర్శిగా మార్చెను

బాలుడైన సమూయేలును - యాజకునిగా మార్చెను

బలహీనుడైన గిద్యోనును - బలాఢ్యునిగా మార్చెను

||యేసు||

Dukkidunne Eleeshaanu - Deerghadarshigaa Maarchenu

Baaludaina Samooyelunu - Yaajakunigaa Maarchenu

Balaheenudaina Gidyonunu - Balaadhyunigaa Maarchenu

||Yesu||

Verse 5

దిక్కులేని హదస్సాను - మహా రాణిగా చేసెను

మోడుబారిన రూతును - బోయజు భార్యగా మార్చెను

మగ్దలేని మరియను మారుమనసుతో నింపెను

||యేసు||

Dikkuleni Hadassaanu - Mahaa Raanigaa Chesenu

Modubaarina Rootunu - Boyaju Bhaaryagaa Maarchenu

Magdaleni Mariyanu Maarumanasuto Nimpenu

||Yesu||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with M