Skip to content
ThuthiThuthiThuthi

Maranamun Jayinchi Lechenu Mana Prabhuvu Nendu Song Lyricsమరణమున్ జయించి లేచెను మన ప్రభువు నేఁడు

Maranamun Jayinchi Lechenu Mana Prabhuvu Nendu Lyrics in Telugu & English

Present

Chorus

మరణమున్ జయించి లేచెను మన ప్రభువు నేఁడు మహిమ దేహ

మొనరఁ దాల్చెను ధర సమాధి బంధములను ధన్యముగను త్రెంచి లేచి

కొఱత లన్ని తీర్చి జీవ వరము లియ్య వసుధపైని

||మరణమున్||

Maranamun Jayinchi Lechenu Mana Prabhuvu Nendu Mahima Deha

Monaran Daalchenu Dhara Samaadhi Bandhamulanu Dhanyamuganu Trenchi Lechi

Korata Lanni Teerchi Jeeva Varamu Liyya Vasudhapaini

||Maranamun||

Verse 1

మరియయును సలోమి మొదలగు మగువలు సబాతు మరు

దినోదయమునఁ బ్రియ మగు గురుని దేహమునకుఁ బూయఁ బరిమళంపుఁ

దైలములను సరగఁ దీసికొని సమాధి కరుగుదెంచి కనులఁజూడ

||మరణమున్||

Mariyayunu Salomi Modalagu Maguvalu Sabaatu Maru

Dinodayamunan Briya Magu Guruni Dehamunakun Booyan Barimalampun

Dailamulanu Saragan Deesikoni Samaadhi Karugudenchi Kanulanjooda

||Maranamun||

Verse 2

నేఁడు ప్రభుసమాధి ముఖముపై నున్న రాయి నెవఁడు దీయు కరుణను

మనకై చేడియ లిట్లనుచు వేగఁ జేరి యా సమాధి మూఁత వీడి యుంటఁ

జూచి మిగుల విస్మయమ్ము నంది రపుడు

||మరణమున్||

Nendu Prabhusamaadhi Mukhamupai Nunna Raayi Nevandu Deeyu Karunanu

Manakai Chediya Litlanuchu Vegan Jeri Yaa Samaadhi Moonta Veedi Yuntan

Joochi Migula Vismayammu Nandi Rapudu

||Maranamun||

Verse 3

వారు తెల్ల నిలువుటంగిఁతో గూర్చున్న పడుచు వానిఁ జూచి మిగుల

భయముతోఁ జేరరాక నిలిచియున్న వారి నతడుగాంచి యమ్మ లార

భయపడకు డటంచు నూరడించె నుచితముగను

||మరణమున్||

Vaaru Tella Niluvutanginto Goorchunna Paduchu Vaanin Joochi Migula

Bhayamuton Jeraraaka Nilichiyunna Vaari Natadugaanchi Yamma Laara

Bhayapadaku Datanchu Nooradinche Nuchitamuganu

||Maranamun||

Verse 4

కొరత పైని మరణ మొందిన నజరేయుఁ డేసు కొరకు మిగుల వెదకు

చుండిన తరుణులార మీ ప్రభుండు తిరిగి బ్రతికె నిక్క మిద్ది సరగపేతు

రాది శిష్య సమితితోడఁ జెప్పుడనియె

||మరణమున్||

Korata Paini Marana Mondina Najareyun Desu Koraku Migula Vedaku

Chundina Tarunulaara Mee Prabhundu Tirigi Bratike Nikka Middi Saragapetu

Raadi Shishya Samititodan Jeppudaniye

||Maranamun||

Verse 5

మానితముగ మీకిట ముందు ప్రభు వనిన యట్లు కానఁబడును

గలిలైయ మందుఁ గాన వెళ్లుడంచు భాసి తానరుండు పల్క వినుచు

దీన జనులు జడిసి మిగుల దిగులు నొంది వణకి రపుడు

||మరణమున్||

Maanitamuga Meekita Mundu Prabhu Vanina Yatlu Kaananbadunu

Galilaiya Mandun Gaana Velludanchu Bhaasi Taanarundu Palka Vinuchu

Deena Janulu Jadisi Migula Digulu Nondi Vanaki Rapudu

||Maranamun||

Verse 6

మొదట మగ్దలేనే మరియకుఁ గనఁబడె నటంచు సుదతి దెల్పె శిష్య

వరులకు కొదువలేని సంతసమునఁ గోర్కె దీరఁ బ్రభునిఁ జూడఁ

బదిలమైన యత్నములకుఁ బరఁగఁ జేసి చూచి రపుడు

||మరణమున్||

Modata Magdalene Mariyakun Gananbade Natanchu Sudati Delpe Shishya

Varulaku Koduvaleni Santasamunan Gorke Deeran Brabhunin Joodan

Badilamaina Yatnamulakun Barangan Jesi Choochi Rapudu

||Maranamun||

Verse 7

అంతఃశత్రు వైన మరణమును ప్రభువు గెల్చె సంతసించి సన్నుతింతము

వంత లేల భక్తులార వాస్తవముగ మనల నిటుల నంత్య దినము నందు

లేపు నమల దేహముల నొసంగు

||మరణమున్||

Antahshatru Vaina Maranamunu Prabhuvu Gelche Santasinchi Sannutintamu

Vanta Lela Bhaktulaara Vaastavamuga Manala Nitula Nantya Dinamu Nandu

Lepu Namala Dehamula Nosangu

||Maranamun||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with M