Naa Atishayamaa Stuti Kaaranamaa Stotramu Chesedanu Lyrics in Telugu & English
Chorus
నా అతిశయమా స్తుతి కారణమా స్తోత్రము చేసెదను
నా సైన్యము గా నిలిచిన దేవా ఆరాధించెదను (2)
మరువక మమతను చూపి మహిమ కిరీటము దయచేసి నావు
మహిమలో నా స్థానమును పదిలముగా దాచి ఉంచావు
ఘనత మహిమ నీకే ఏసయ్యా
బలము ప్రభావములు గల దేవా (2)
||నా అతిశయమా||
Naa Atishayamaa Stuti Kaaranamaa Stotramu Chesedanu
Naa Sainyamu Gaa Nilichina Devaa Aaraadhinchedanu (2)
Maruvaka Mamatanu Choopi Mahima Kireetamu Dayachesi Naavu
Mahimalo Naa Sthaanamunu Padilamugaa Daachi Unchaavu
Ghanata Mahima Neeke Esayyaa
Balamu Prabhaavamulu Gala Devaa (2)
||Naa Atishayamaa||
Verse 1
గత కాలములో నడచిన మార్గాన అపాయములను దాటించినావు
ఘనులకు లేని ఘనతను నాకు కిరీటముగా దయచేసినావు (2)
మేలు చేయుటలో నీవే సంపన్నుడవు ప్రభు
దారి చూపుటలో నీవే మార్గదర్శడవు
నీ కృపనే తలంచి పాడెద ఈ నూతన గీతమును
నీ ప్రేమ రుచి చూచి పాడెద నా స్తోత్ర గీతమును (2)
||నా అతిశయమా||
Gata Kaalamulo Nadachina Maargaana Apaayamulanu Daatinchinaavu
Ghanulaku Leni Ghanatanu Naaku Kireetamugaa Dayachesinaavu (2)
Melu Cheyutalo Neeve Sampannudavu Prabhu
Daari Chooputalo Neeve Maargadarshadavu
Nee Krupane Talanchi Paadeda Ee Nootana Geetamunu
Nee Prema Ruchi Choochi Paadeda Naa Stotra Geetamunu (2)
||Naa Atishayamaa||
Verse 2
నీ సేవలోనా ప్రతి విషయమందు నీ మహిమ చూపించినావు
నీ మందసమున భుజమున మోయు భాగ్యము నాకిచ్చి నావు (2)
శోధన వలయమును నీవే తొలగించావు ప్రభు
శాంతి వధనమును నాలో నిత్యము స్థాపించి
నీ వాక్యం నా తోడై యుండగా ఘన విజయము నా సొంతమే
నీ స్మరణే నాలోనే ఉండగా విహరింతును వైభవముగా (2)
||నా అతిశయమా||
Nee Sevalonaa Prati Vishayamandu Nee Mahima Choopinchinaavu
Nee Mandasamuna Bhujamuna Moyu Bhaagyamu Naakichchi Naavu (2)
Shodhana Valayamunu Neeve Tolaginchaavu Prabhu
Shaanti Vadhanamunu Naalo Nityamu Sthaapinchi
Nee Vaakyam Naa Todai Yundagaa Ghana Vijayamu Naa Sontame
Nee Smarane Naalone Undagaa Viharintunu Vaibhavamugaa (2)
||Naa Atishayamaa||
Verse 3
సీయోను కొరకే నే వేచియున్నాను నా ఆశ తీర్చుము నా ప్రభువా
నీ నిత్య రాజ్యాన నేనుండుటకు సిద్ధము చేయుము నా దేవా (2)
లోకములో నుండి నన్ను ప్రత్యేకించితివి
నీదు వరములోనే నాపై బహుగా నిలిపితివి
నీ కొరకే ఫలించి సాగేద ఈ ఆత్మీయ యాత్రలో
సీయోనే నా గురిగా నడచెదా తుదివరకు ఓపికగా (2)
||నా అతిశయమా||
Seeyonu Korake Ne Vechiyunnaanu Naa Aasha Teerchumu Naa Prabhuvaa
Nee Nitya Raajyaana Nenundutaku Siddhamu Cheyumu Naa Devaa (2)
Lokamulo Nundi Nannu Pratyekinchitivi
Needu Varamulone Naapai Bahugaa Nilipitivi
Nee Korake Phalinchi Saageda Ee Aatmeeya Yaatralo
Seeyone Naa Gurigaa Nadachedaa Tudivaraku Opikagaa (2)
||Naa Atishayamaa||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.