Skip to content
ThuthiThuthiThuthi

Naalo Nivasinche Naa Yesayya Manohara Sampada Song Lyricsనాలో నివసించే నా యేసయ్య మనోహర సంపద

Naalo Nivasinche Naa Yesayya Manohara Sampada Lyrics in Telugu & English

Present

Chorus

నాలో నివసించే నా యేసయ్య

మనోహర సంపద నీవేనయ్యా (2)

మారని మమతల మహనీయుడ (2)

కీర్తించి నిన్నే ఘనపరతునయ్యా - మనసారా నిన్నే ప్రేమింతునయ్యా (2)

||నాలో నివసించే||

Naalo Nivasinche Naa Yesayya

Manohara Sampada Neevenayyaa (2)

Maarani Mamatala Mahaneeyuda (2)

Keertinchi Ninne Ghanaparatunayyaa - Manasaaraa Ninne Premintunayyaa (2)

||Naalo Nivasinche||

Verse 1

మధురమైనది నీ స్నేహబంధం - మహిమగా నన్ను మార్చిన వైనం (2)

నీ చూపులే నన్ను కాచెను - నీ బాహువే నన్ను మోసేను (2)

ఏమిచ్చి నీ ఋణము నే తీర్చను (2)

||కీర్తించి||

Madhuramainadi Nee Snehabandham - Mahimagaa Nannu Maarchina Vainam (2)

Nee Choopule Nannu Kaachenu - Nee Baahuve Nannu Mosenu (2)

Emichchi Nee Runamu Ne Teerchanu (2)

||Keertinchi||

Verse 2

వినయ భావము ఘనతకు మూలము - నూతన జీవములో నడుపు మార్గం (2)

నా విన్నపం విన్నవులే - అరుదేంచేనే నీ వరములే (2)

ఏమని వర్ణింతును నీ కృపలను (2)

||కీర్తించి||

Vinaya Bhaavamu Ghanataku Moolamu - Nootana Jeevamulo Nadupu Maargam (2)

Naa Vinnapam Vinnavule - Arudenchene Nee Varamule (2)

Emani Varnintunu Nee Krupalanu (2)

||Keertinchi||

Verse 3

మహిమ గలది నీ దివ్య రాజ్యం - తేజోవాసుల పరిశుద్ద స్వాస్థ్యం (2)

సియోనులో చేరాలనే - నా ఆశయం నెరవేర్చుము (2)

యేసయ్య నిన్ను చూచి హర్షింతును

భువినేలు రాజ నీకే నా వందనం - దివినేలు రాజ వేలాది వందనం (2)

||నాలో నివసించే||

Mahima Galadi Nee Divya Raajyam - Tejovaasula Parishudda Svaasthyam (2)

Siyonulo Cheraalane - Naa Aashayam Neraverchumu (2)

Yesayya Ninnu Choochi Harshintunu

Bhuvinelu Raaja Neeke Naa Vandanam - Divinelu Raaja Velaadi Vandanam (2)

||Naalo Nivasinche||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with N