Neeli Gaganaana Velige Taarala Boli Lokaana Velugudam Lyrics in Telugu & English
Verse 1
నీలి గగనాన వెలిగే తారల - బోలి లోకాన వెలుగుదం
మధుర స్వరంపు పక్షుల బోలి - యేసునకే స్తుతి పాడుదం
Neeli Gaganaana Velige Taarala - Boli Lokaana Velugudam
Madhura Svarampu Pakshula Boli - Yesunake Stuti Paadudam
Verse 2
పువ్వుల పరిమళంబు లెల్ల తోటలో వ్యాపించునట్లుగా
పూనికతోడ లోకమనెడి - తోటలో పరిమళం నింపుము
Puvvula Parimalambu Lella Totalo Vyaapinchunatlugaa
Poonikatoda Lokamanedi - Totalo Parimalam Nimpumu
Verse 3
చంద్ర సూర్యులు ప్రకాశమివ్వ అంధకారము మాయమౌ
నీదు జీవిత తేజంబు వెల్గన్ - పాపాంధకారము పోవును
Chandra Sooryulu Prakaashamivva Andhakaaramu Maayamau
Needu Jeevita Tejambu Velgan - Paapaandhakaaramu Povunu
Verse 4
దీపమున తైలమున్నంత కాలం - దీపమునందున్న వత్తి మండున్
ఈ పృధివిలోన జీవించు కాలం - వ్యాపింపజేయుము యేసునామం
Deepamuna Tailamunnanta Kaalam - Deepamunandunna Vatti Mandun
Ee Prudhivilona Jeevinchu Kaalam - Vyaapimpajeyumu Yesunaamam
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.