Skip to content
ThuthiThuthiThuthi

Neeve Naaku Sarvam Devaa Song Lyricsనీవే నాకు సర్వం దేవా

Neeve Naaku Sarvam Devaa Lyrics in Telugu & English

Present

Verse 1

నీవే నాకు సర్వం దేవా

నీవే నాకు ఆధారం దేవా (2)

నీ సన్నిదే నాకు చాలయ్య

నీ సన్నిదే నాకు మేలయ్య (2)

Neeve Naaku Sarvam Devaa

Neeve Naaku Aadhaaram Devaa (2)

Nee Sannide Naaku Chaalayya

Nee Sannide Naaku Melayya (2)

Verse 2

నిన్నె స్తుతియించి కొనియాడేదా

నిన్నె ఘనపరిచి కొనియాడేదా

నిన్నె ఆరాధించి కొనియడేద

నిన్నె మహిమ పరిచి కొనియాడేదా

Ninne Stutiyinchi Koniyaadedaa

Ninne Ghanaparichi Koniyaadedaa

Ninne Aaraadhinchi Koniyadeda

Ninne Mahima Parichi Koniyaadedaa

Verse 3

యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య.

Yesayya Yesayya Yesayya Yesayya.

Verse 4

అతి శ్రేష్ఠుడవు నీవు అతికాంక్షనీయుడవు

అతి సుందరుడవు నీవు పదివేలలో

మా దుర్గము కేడము మా కోటయు నీవే

నా దాగు చోటు స్థలము నీవే

గాఢాంధకారపు లోయలలో

నే సంచరించిన భయపడను

ఏ అపాయము నన్ను చేరనే చేరదు

నా బ్రతుకు దినములు అంతటిలో

నీ కృప క్షేమములే ఉండగా

నీ సన్నిధిలో నివాసం చేసెదను || నిన్నె ||

Ati Shreshthudavu Neevu Atikaankshaneeyudavu

Ati Sundarudavu Neevu Padivelalo

Maa Durgamu Kedamu Maa Kotayu Neeve

Naa Daagu Chotu Sthalamu Neeve

Gaadhaandhakaarapu Loyalalo

Ne Sancharinchina Bhayapadanu

E Apaayamu Nannu Cherane Cheradu

Naa Bratuku Dinamulu Antatilo

Nee Krupa Kshemamule Undagaa

Nee Sannidhilo Nivaasam Chesedanu || Ninne ||

Verse 5

నా ఊహలకందనివి నివ్వు చేసే కార్యములు

నీ మేలులు కొలువగ చాలదు జీవితము

అర్హత లేని నన్ను ఎన్నుకొని ఏర్పరచి

నీ దాసునిగ నన్ను నిలబెట్టవయ్య

కోత ఎంతో విస్తారం అని తెలిపి

కోసేవానిగ నన్ను పిలిచి

నీ బూరగ మలిచిన విధముకు స్తోత్రమయ్యా

నీ ప్రేమ వర్ణింప నాశక్యం

నీ క్రియలు వివరింప ఆశ్చర్యం

నా ఎడల నీకున్న కృప ఎంత అద్భుతము || నిన్నె ||

Naa Oohalakandanivi Nivvu Chese Kaaryamulu

Nee Melulu Koluvaga Chaaladu Jeevitamu

Arhata Leni Nannu Ennukoni Erparachi

Nee Daasuniga Nannu Nilabettavayya

Kota Ento Vistaaram Ani Telipi

Kosevaaniga Nannu Pilichi

Nee Booraga Malichina Vidhamuku Stotramayyaa

Nee Prema Varnimpa Naashakyam

Nee Kriyalu Vivarimpa Aashcharyam

Naa Edala Neekunna Krupa Enta Adbhutamu || Ninne ||

Verse 6

నీ వాక్యమే నన్ను బ్రతికించే ఔషధము

నా త్రోవలో నన్ను నడిపే దీపము

నీవు చేసిన మేలులను తలపోసుకున్నప్పుడు

ఆనందముతో ఉప్పొంగెను నా హృదయం

నీ మార్గాము లోనే నడిచెదను

నీ సువార్తను ప్రకటించెదను

నీ సాక్షిగా ఈ భూవిలో బ్రతికెదను

నీ రాకడ కొరకై సంఘముగా మేము సిద్ధముగానే ఉండెదము

నిరీక్షణతో నీ వైపే చూచేదము || నిన్నె ||

Nee Vaakyame Nannu Bratikinche Aushadhamu

Naa Trovalo Nannu Nadipe Deepamu

Neevu Chesina Melulanu Talaposukunnappudu

Aanandamuto Uppongenu Naa Hrudayam

Nee Maargaamu Lone Nadichedanu

Nee Suvaartanu Prakatinchedanu

Nee Saakshigaa Ee Bhoovilo Bratikedanu

Nee Raakada Korakai Sanghamugaa Memu Siddhamugaane Undedamu

Nireekshanato Nee Vaipe Choochedamu || Ninne ||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with N