Skip to content
ThuthiThuthiThuthi

Nuti Seyanu Leve Yo Manasaa Song Lyricsనుతి సేయను లేవే యో మనసా

Nuti Seyanu Leve Yo Manasaa Lyrics in Telugu & English

Present

Chorus

నుతి సేయను లేవే యో మనసా నుతిఁజేయను లేవే క్షితిని దివిని

హితమతిఁ బ్రోచెడి సుతుని జనకుని శుద్ధాత్మునిఁ ద్ర్యేకుని

||నుతి||

Nuti Seyanu Leve Yo Manasaa Nutinjeyanu Leve Kshitini Divini

Hitamatin Brochedi Sutuni Janakuni Shuddhaatmunin Dryekuni

||Nuti||

Verse 1

సూర్యుని కాంతి సొంపగు పంటలు సుకాలక్షేమముల్ శోభిలు

గేహమున్ ఆర్య సాంగత్యము నైశ్వర్యముల నిల ననుభవింపవె నీవా

యాఢ్యుని పేర్మిని

||నుతి||

Sooryuni Kaanti Sompagu Pantalu Sukaalakshemamul Shobhilu

Gehamun Aarya Saangatyamu Naishvaryamula Nila Nanubhavimpave Neevaa

Yaadhyuni Permini

||Nuti||

Verse 2

దురితము లందె దుర్గతి నున్న నీ కురుతర ప్రేమను బరమార్థ

మీయను వరపుత్రు నొసఁగఁడె వందనీయుఁడు ప్రభు మరిమరి

మ్రొక్కు మా పరమోపకారిని

||నుతి||

Duritamu Lande Durgati Nunna Nee Kurutara Premanu Baramaartha

Meeyanu Varaputru Nosangande Vandaneeyundu Prabhu Marimari

Mrokku Maa Paramopakaarini

||Nuti||

Verse 3

జీవము జ్ఞానము జీవము నొసంగెడు పావనాత్మను నీకై పంపిన

దేవుడు కేవల దోష స్వ భావము మార్చఁడె సేవ జేయుమ నీవా

పావనమూర్తికి

||నుతి||

Jeevamu Jnyaanamu Jeevamu Nosangedu Paavanaatmanu Neekai Pampina

Devudu Kevala Dosha Sva Bhaavamu Maarchande Seva Jeyuma Neevaa

Paavanamoortiki

||Nuti||

Verse 4

కరములు పదముల్ కనకాదు లన్నియు స్వరమును చిత్తము స్థిరమగు

ప్రేమయు మరి నీదు హృదయము పరమాత్ము సేవకై పరిపూర్ణముగ

నిచ్చి ప్రణుతించు మాయనన్

||నుతి||

Karamulu Padamul Kanakaadu Lanniyu Svaramunu Chittamu Sthiramagu

Premayu Mari Needu Hrudayamu Paramaatmu Sevakai Paripoornamuga

Nichchi Pranutinchu Maayanan

||Nuti||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with N