Paapamunaku Jeetamu Maranamu Lyrics in Telugu & English
Verse 1
పాపమునకు జీతము మరణము (3)
ఓ పాపి భయపడవా?
చూచునదెల్ల నశించు నిశ్చయము (3)
చూడనిదే నిత్యము
యేసురాజువచ్చును ఇంక కొంతకాలమే - మోక్షమందు చేరుదుము
Paapamunaku Jeetamu Maranamu (3)
O Paapi Bhayapadavaa?
Choochunadella Nashinchu Nishchayamu (3)
Choodanide Nityamu
Yesuraajuvachchunu Inka Kontakaalame - Mokshamandu Cherudumu
Verse 2
లోకసుఖము నమ్మకు నమ్మకు (3)
ఆ యిచ్ఛలు మాయమగు
నీ జీవముపోవు సమయమున (3)
చిల్లిగవ్వ వెంటరాదు
Lokasukhamu Nammaku Nammaku (3)
Aa Yichchhalu Maayamagu
Nee Jeevamupovu Samayamuna (3)
Chilligavva Ventaraadu
Verse 3
నీ కాలమెల్ల వ్యర్థమగుచున్నది (3)
లోకమాయలయందున
దైవకోపము వచ్చుటకు ముందు (3)
నీ రక్షకుని చేరుము
Nee Kaalamella Vyarthamaguchunnadi (3)
Lokamaayalayanduna
Daivakopamu Vachchutaku Mundu (3)
Nee Rakshakuni Cherumu
Verse 4
దైవ ప్రేమ పారుచున్నది (3)
కల్వరిగిరి మీదనుండి
నీ పాపమెల్ల అందుపోవును (3)
స్నానంబుచేసినన్
Daiva Prema Paaruchunnadi (3)
Kalvarigiri Meedanundi
Nee Paapamella Andupovunu (3)
Snaanambuchesinan
Verse 5
మహా పాపినైన నన్నును (3)
నా మిత్రుడంగీకరించెన్
ఓ పాపి నీవు పరుగిడి రా (3)
దేవ దీవెనల పొందుము
Mahaa Paapinaina Nannunu (3)
Naa Mitrudangeekarinchen
O Paapi Neevu Parugidi Raa (3)
Deva Deevenala Pondumu
Verse 6
కష్టదుఃఖము లెక్కువగుచో (3)
ఇష్టుడేసుని వీడను
సిగ్గులేక చేరుదు నాయనచెంత (3)
నెప్పుడు వసింతును
Kashtaduhkhamu Lekkuvagucho (3)
Ishtudesuni Veedanu
Sigguleka Cherudu Naayanachenta (3)
Neppudu Vasintunu
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.