Sharanun Jochchiti Yesunaadhunda Shaktiheenatan Galge Lyrics in Telugu & English
Chorus
శరణుఁ జొచ్చితి యేసునాధుఁడ శక్తిహీనతఁ గల్గె నా దరణ మిమ్మిల
నెవ్వఁ బొందితి దవ్వుసేయక కావవే
||శరణు||
Sharanun Jochchiti Yesunaadhunda Shaktiheenatan Galge Naa Darana Mimmila
Nevvan Bonditi Davvuseyaka Kaavave
||Sharanu||
Verse 1
కరుణఁ జూడుము కన్న తండ్రివి కల్మషం బెడఁబాపవే మరణ మొందక
మున్ను నన్నిల మార్పు నొందఁగఁ జేయవే
||శరణు||
Karunan Joodumu Kanna Tandrivi Kalmasham Bedanbaapave Marana Mondaka
Munnu Nannila Maarpu Nondangan Jeyave
||Sharanu||
Verse 2
మొరను జెచ్చెర నాలకించుచు మోము నా దెసఁ జూపవే యురు
పదంబుల సేవఁ జేసెద నుద్ధరించుము కూర్మితో
||శరణు||
Moranu Jechchera Naalakinchuchu Momu Naa Desan Joopave Yuru
Padambula Sevan Jeseda Nuddharinchumu Koormito
||Sharanu||
Verse 3
తామస క్రియలందు వాంఛలు తాకకుండగఁ జేయవే క్షేమమైన సువార్త
బోధల సిద్ధపడి విననీయవే
||శరణు||
Taamasa Kriyalandu Vaanchhalu Taakakundagan Jeyave Kshemamaina Suvaarta
Bodhala Siddhapadi Vinaneeyave
||Sharanu||
Verse 4
శ్రమలు చాల కల్గి యున్నను సైఁప నేర్పుము సత్కృపన్ గమిలి పోయెడి
మాయ లోకపు గాంతి నీరస మంచు నీ
||శరణు||
Shramalu Chaala Kalgi Yunnanu Sainpa Nerpumu Satkrupan Gamili Poyedi
Maaya Lokapu Gaanti Neerasa Manchu Nee
||Sharanu||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.