1 Chronicles · chapter 18 · verse 17
1 Chronicles 18:17 in Telugu
యెహోయాదా కుమారుడైన బెనాయా కెరేతీయులకును పెలేతీయులకును అధిపతియై యుండెను; మరియు దావీదుయొక్క కుమారులు రాజునకు సహాయులై యుండిరి.
Yehoyaadaa kumaarudaina benaayaa kereteeyulakunu peleteeyulakunu adhipatiyai yundenu; mariyu daaveeduyokka kumaarulu raajunaku sahaayulai yundiri.
1 Chronicles 18:17 in English
- King James Version (KJV)
- And Benaiah the son of Jehoiada [was] over the Cherethites and the Pelethites; and the sons of David [were] chief about the king.
- World English Bible (WEB)
- and Benaiah the son of Jehoiada was over the Cherethites and the Pelethites; and the sons of David were chief officials serving the king.
- American Standard Version (ASV)
- and Benaiah the son of Jehoiada was over the Cherethites and the Pelethites; and the sons of David were chief about the king.
- Bible in Basic English (BBE)
- And Benaiah, the son of Jehoiada, was over the Cherethites and the Pelethites; and the sons of David were chief of those whose places were at the king's side.
- Darby Translation (DBY)
- and Benaiah the son of Jehoiada was over the Cherethites and the Pelethites; and the sons of David were the first at the king's hand.
- Webster's Bible (WBS)
- And Benaiah the son of Jehoiada [was] over the Cherethites and the Pelethites; and the sons of David [were] chief about the king.
- Young's Literal Translation (YLT)
- and Benaiah son of Jehoiada [is] over the Cherethite and the Pelethite, and the elder sons of David [are] at the hand of the king.
Read in context
- 15సెరూయా కుమారుడైన యోవాబు సైన్యాధిపతియై యుండెను; అహీలూదు కుమారుడైన యెహోషా పాతు రాజ్యపు దస్తావేజుల మీద నుండెను;
- 16అహీటూబు కుమారుడైన సాదోకును అబ్యాతారు కుమారుడైన అబీమెలెకును యాజకులు, షవ్షా శాస్త్రి;
- 17యెహోయాదా కుమారుడైన బెనాయా కెరేతీయులకును పెలేతీయులకును అధిపతియై యుండెను; మరియు దావీదుయొక్క కుమారులు రాజునకు సహాయులై యుండిరి.
Cross references
- 2 Samuel 8:18 2 సమూయేలు 8:18యెహోయాదా కుమారుడగు బెనాయా కెరేతీయులకును పెలేతీయులకును అధిపతి; దావీదు కుమారులు సభా ముఖ్యులు.
- 2 Samuel 15:18 2 సమూయేలు 15:18అతని సేవకులందరును అతని యిరుపార్శ్వముల నడిచిరి; కెరే తీయులందరును పెలేతీయులందరును గాతునుండి వచ్చిన ఆరువందల మంది గిత్తీయులును రాజునకు ముందుగా నడచుచుండిరి.
- 2 Samuel 20:7 2 సమూయేలు 20:7కాబట్టి యోవాబు వారును కెరేతీయులును పెలేతీయులును బలాఢ్యులందరును అతనితో కూడ యెరూషలేములోనుండి బయలుదేరి బిక్రి కుమారుడగు షెబను తరుమబోయిరి.
- 1 Kings 2:34–35 1 రాజులు 2:34–35కాబట్టి యెహోయాదా కుమారుడైన బెనాయా వచ్చి అతనిమీద పడి అతని చంపగా అతడు అరణ్యమందుండు తన యింటిలో పాతిపెట్టబడెను. రాజు అతనికి బదులుగా యెహోయాదా కుమారుడైన బెనాయాను సేనాధిపతిగా నియమించెను. మరియు రాజు అబ్యాతారునకు బదులుగా యాజకుడైన సాదోకును నియ మించెను.
- 1 Chronicles 23:28 1 దినవృత్తాంతములు 23:28వీరు అహరోను సంతతివారి చేతిక్రింద పని చూచుటకును, వారి వశముననున్న యెహోవా మందిర సేవకొరకై సాలలలోను గదులలోను ఉంచబడిన సకలమైన ప్రతిష్ఠితవస్తువులను శుద్ధిచేయుటకును, దేవుని మందిర సేవకొరకైన పనిని విచారించుటకును,
- Zephaniah 2:5 జెఫన్యా 2:5సముద్రప్రాంతమందు నివసించు కెరేతీయులారా, మీకు శ్రమ; ఫిలిష్తీయుల దేశమైన కనానూ, నిన్ను గూర్చి యెహోవా సెలవిచ్చునదేమనగా నీయందు ఒక కాపురస్థుడైనను లేకుండ నేను నిన్ను లయముచేతును.
- 2 Samuel 20:23 2 సమూయేలు 20:23యోవాబు ఇశ్రాయేలు దండువారందరికి అధిపతియై యుండెను. అయితే కెరేతీయులకును పెలేతీయులకును యెహోయాదా కుమారుడగు బెనాయా అధిపతియై యుండెను.
- 1 Kings 1:44 1 రాజులు 1:44రాజు యాజకుడైన సాదోకును ప్రవక్తయైన నాతానును యెహోయాదా కుమారుడైన బెనా యానును కెరేతీయులను పెలేతీయులను అతనితోకూడ పంపగా వారు రాజు కంచరగాడిదమీద అతని నూరే గించిరి;
- 1 Kings 1:38 1 రాజులు 1:38కాబట్టి యాజకుడైన సాదోకును ప్రవక్తయైన నాతానును యెహోయాదా కుమారుడైన బెనాయాయును కెరేతీయులును పెలేతీయు లును రాజైన దావీదు కంచరగాడిదమీద సొలొమోనును ఎక్కించి గిహోనునకు తీసికొని రాగా
- 2 Samuel 23:19–23 2 సమూయేలు 23:19–23ఇతడు ఆ ముప్పదిమందిలో ఘనుడై వారికి అధిపతి యాయెను గాని మొదటి ముగ్గురితో సమానుడు కాకపోయెను. మరియు కబ్సెయేలు ఊరివాడై క్రియలచేత ఘనతనొందిన యొక పరాక్రమశాలికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయా అను నొకడు ఉండెను. ఇతడు మోయాబీయుల సంబంధులగు ఆ యిద్దరు శూరులను హతముచేసెను; మరియు మంచుకాలమున బయలువెడలి బావిలో దాగి యున్న యొక సింహమును చంపి వేసెను. ఇంకను అతడు సౌందర్యవంతుడైన యొక ఐగుప్తీయుని చంపెను. ఈ ఐగుప్తీయుని చేతిలో ఈటెయుండగా బెనాయా దుడ్డు కఱ్ఱ తీసికొని వాని మీదికి పోయి వాని చేతిలోని యీటె ఊడలాగి దానితోనే వాని చంపెను. ఈ కార్యములు యెహోయాదా కుమారుడైన బెనాయా చేసినందున ఆ ముగ్గురు బలాఢ్యులలోను అతడు పేరుపొంది ఆ ముప్పది మందిలో ఘనుడాయెను. అయినను మొదటి ముగ్గురితో సమానుడు కాకపోయెను. దావీదు ఇతనిని తన సభికులలో ఒకనిగా నియమించెను.