1 Corinthians · chapter 15 · verse 57
1 Corinthians 15:57 in Telugu
అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక.
Ayinanu mana prabhuvaina yesukreestu moolamugaa manaku jayamu anugrahinchuchunna devuniki stotramu kalugunu gaaka.
1 Corinthians 15:57 in English
- King James Version (KJV)
- But thanks [be] to God, which giveth us the victory through our Lord Jesus Christ.
- World English Bible (WEB)
- But thanks be to God, who gives us the victory through our Lord Jesus Christ.
- American Standard Version (ASV)
- but thanks be to God, who giveth us the victory through our Lord Jesus Christ.
- Bible in Basic English (BBE)
- But praise be to God who gives us strength to overcome through our Lord Jesus Christ.
- Darby Translation (DBY)
- but thanks to God, who gives us the victory by our Lord Jesus Christ.
- Webster's Bible (WBS)
- But thanks [be] to God, who giveth us the victory, through our Lord Jesus Christ.
- Young's Literal Translation (YLT)
- and to God — thanks, to Him who is giving us the victory through our Lord Jesus Christ;
Read in context
- 55ఓ మరణమా, నీ విజయమెక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ?
- 56మరణపు ముల్లు పాపము; పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే.
- 57అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక.
- 58కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థముకాదని యెరిగి, స్థిరులును, కదలనివారును, ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునై యుండుడి.
Cross references
- 2 Corinthians 2:14 2 కొరింథీయులకు 2:14మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానముయొక్క సువాసనను కనుపరచుచు ఆయనయందు మమ్మును ఎల్లప్పుడు విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము.
- Romans 8:37 రోమీయులకు 8:37అయినను మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము.
- 1 John 5:4–5 1 యోహాను 5:4–5దేవుని మూలముగా పుట్టినవారందరును లోకమును జయించుదురు; లోకమును జయించిన విజయము మన విశ్వాసమే యేసు దేవుని కుమారుడని నమ్ము వాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు?
- Proverbs 21:31 సామెతలు 21:31యుద్ధదినమునకు గుఱ్ఱములను ఆయత్తపరచుటకద్దు గాని రక్షణ యెహోవా అధీనము.
- Revelation 12:11 ప్రకటన 12:11వారు గొఱ్ఱెపిల్ల రక్తమును బట్టియు, తామిచ్చిన సాక్ష్య మునుబట్టియు వానిని జయించియున్నారు గాని, మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు.
- John 16:33 యోహాను 16:33నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి యున్నాననెను.
- 2 Corinthians 9:15 2 కొరింథీయులకు 9:15చెప్ప శక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము.
- Psalm 98:1 కీర్తనలు 98:1యెహోవా ఆశ్చర్యకార్యములు చేసియున్నాడు ఆయననుగూర్చి క్రొత్తకీర్తన పాడుడి ఆయన దక్షిణహస్తము ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగజేసియున్నది.
- Revelation 15:2–3 ప్రకటన 15:2–3మరియు అగ్నితో కలిసియున్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూరమృగమునకును దాని ప్రతిమకును దాని పేరుగల సంఖ్యకును లోబడక వాటిని జయించినవారు దేవుని వీణలుగలవారై, ఆ స్ఫటికపు సముద్రమునొద్ద నిలిచియుండుట చూచితిని. వారు ప్రభువా, దేవా, సర్వాధికారీ, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి; యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములును సత్యములునై యున్నవి;
- Romans 7:25 రోమీయులకు 7:25మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయములో నేను దైవనియమమునకును, శరీర విషయములో పాపనియమమునకును దాసుడనై యున్నాను.
- Ephesians 5:20 ఎఫెసీయులకు 5:20మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమునుగూర్చి తండ్రియైన దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు,
- 2 Corinthians 1:11 2 కొరింథీయులకు 1:11అందువలన అనేకుల ప్రార్థన ద్వారా, మాకు కలిగిన కృపావరముకొరకు అనేకులచేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును.