1 Samuel · chapter 14 · verse 38
1 Samuel 14:38 in Telugu
అందువలన సౌలుజనులలో పెద్దలు నా యొద్దకు వచ్చి నేడు ఎవరివలన ఈ పాపము కలిగెనో అది విచారింపవలెను.
Anduvalana saulujanulalo peddalu naa yoddaku vachchi nedu evarivalana ee paapamu kaligeno adi vichaarimpavalenu.
1 Samuel 14:38 in English
- King James Version (KJV)
- And Saul said, Draw ye near hither, all the chief of the people: and know and see wherein this sin hath been this day.
- World English Bible (WEB)
- Saul said, “Draw near here, all you chiefs of the people, and know and see in whom this sin has been today.
- American Standard Version (ASV)
- And Saul said, Draw nigh hither, all ye chiefs of the people; and know and see wherein this sin hath been this day.
- Bible in Basic English (BBE)
- And Saul said, Come near, all you chiefs of the people, and let us get word from God and see in whom is this sin today.
- Darby Translation (DBY)
- And Saul said, Draw ye near hither, all the heads of the people; and know and see wherein this sin has been this day.
- Webster's Bible (WBS)
- And Saul said, Draw ye near hither all the chief of the people: and know and see wherein this sin hath been this day.
- Young's Literal Translation (YLT)
- And Saul saith, 'Draw ye nigh hither all, the chiefs of the people, and know and see in what this sin hath been to-day;
Read in context
- 36అంతటమనము రాత్రియందు ఫిలిష్తీయులను తరిమి తెల్లవారువరకు వారిని కలతపెట్టి, శేషించువా డొకడును లేకుండ చేతము రండి అని సౌలు ఆజ్ఞ ఇయ్యగా జనులునీ దృష్టికి ఏది మంచిదో అది చేయుమనిరి. అంతట సౌలుయాజకుడు ఇక్కడనే యున్నాడు, దేవునియొద్ద విచారణ చేయుదము రండని చెప్పి
- 37సౌలుఫిలిష్తీయుల వెనుక నేను దిగిపోయిన యెడల నీవు ఇశ్రాయేలీయుల చేతికి వారి నప్పగింతువా అని దేవునియొద్ద విచారణ చేయగా, ఆ దినమున ఆయన అతనికి ప్రత్యుత్తరమియ్యక యుండెను.
- 38అందువలన సౌలుజనులలో పెద్దలు నా యొద్దకు వచ్చి నేడు ఎవరివలన ఈ పాపము కలిగెనో అది విచారింపవలెను.
- 39నా కుమారుడైన యోనాతాను వలన కలిగినను వాడు తప్పక మరణమవునని ఇశ్రాయేలీ యులను రక్షించు యెహోవా జీవముతోడని నేను ప్రమా ణము చేయుచున్నాననెను. అయితే జనులందరిలో అతనికి ప్రత్యుత్తరమిచ్చిన వాడు ఒకడును లేకపోయెను.
- 40మీరు ఒక తట్టునను నేనును నా కుమారుడగు యోనాతానును ఒక తట్టునను ఉండవలెనని అతడు జనులందరితో చెప్పగా జనులునీ దృష్టికి ఏది మంచిదో అది చేయుమని సౌలుతో చెప్పిరి.
Cross references
- 1 Samuel 10:19–20 1 సమూయేలు 10:19–20అయినను మీ దుర్దశలన్నిటిని ఉపద్రవము లన్నిటిని పోగొట్టి మిమ్మును రక్షించిన మీ దేవుని మీరు ఇప్పుడు విసర్జించిమామీద ఒకని రాజుగా నియమింపుమని ఆయనను అడిగియున్నారు. కాబట్టి యిప్పుడు మీ గోత్రముల చొప్పునను మీ కుటుంబముల చొప్పునను మీరు యెహోవా సన్నిధిని హాజరు కావలెను. ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిని సమూయేలు సమకూర్చగా బెన్యామీను గోత్రము ఏర్పడెను.
- Numbers 24:17 సంఖ్యాకాండము 24:17ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమున నున్నట్టు కాదు ఆయనను చూచుచున్నాను గాని సమీపమున నున్నట్టు కాదు నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇశ్రాయేలులోనుండి లేచును అది మోయాబు ప్రాంతములను కొట్టును కలహవీరులనందరిని నాశనము చేయును.
- Zechariah 10:4 జెకర్యా 10:4వారిలోనుండి మూల రాయి పుట్టును, మేకును యుద్ధపువిల్లును వారిచేత కలు గును, బాధించువాడు వారిలోనుండి బయలుదేరును,
- 2 Samuel 18:3 2 సమూయేలు 18:3జనులునీవు రాకూడదు, మేము పారిపోయినను జనులు దానిని లక్ష్యపెట్టరు, మాలో సగము మంది చనిపోయినను జనులు దానిని లక్ష్యపెట్టరు, మావంటి పదివేల మందితో నీవు సాటి; కాబట్టి నీవు పట్టణమందు నిలిచి మాకు సహాయము చేయవలెనని అతనితో చెప్పిరి.
- Joshua 7:14–26 యెహోషువ 7:14–26ఉదయమున మీ గోత్రముల వరుసనుబట్టి మీరు రప్పింపబడుదురు; అప్పుడు యెహోవా ఏ గోత్రమును సూచించునో అది వంశముల వరుసప్రకారము దగ్గరకు రావలెను; యెహోవా సూచించు వంశము కుటుంబములప్రకారము దగ్గరకు రావలెను; యెహోవా సూచించు కుటుంబము పురుషుల వరుసప్రకారము దగ్గరకు రావలెను. అప్పుడు శపిత మైనది యెవనియొద్ద దొరుకునో వానిని వానికి కలిగినవారి నందరిని అగ్నిచేత కాల్చివేయవలెను, ఏలయనగా వాడు యెహోవా నిబంధనను మీరి ఇశ్రాయేలులో దుష్కా ర్యము చేసినవాడు అనెను. కాబట్టి యెహోషువ ఉదయమున లేచి ఇశ్రాయేలీ యులను వారి గోత్రముల వరుసనుబట్టి దగ్గరకు రప్పించి నప్పుడు యూదాగోత్రము పట్టుబడెను. యూదా వంశ మును దగ్గరకు రప్పించినప్పుడు జెరహీయుల వంశము పట్టు బడెను. జెరహీయుల వంశమును పురుషుల వరుసను దగ్గ రకు రప్పించినప్పుడు జబ్ది పట్టబడెను. అతడును అతని యింటి పురుషుల వరుసను దగ్గరకు రప్పింపబడినప్పుడు యూదా గోత్రములోని జెరహు మునిమనుమడును జబ్ది మనుమడును కర్మీ కుమారుడునైన ఆకాను పట్టుబడెను. అప్పుడు యెహోషువ ఆకానుతో నా కుమారుడా ఇశ్రా యేలు దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి, ఆయన యెదుట ఒప్పుకొని, నీవు చేసినదానిని మరుగు చేయక నాకు తెలుపుమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా ఆకాను యెహోషువతో ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పైవస్త్రమును రెండువందల తులముల వెండిని ఏబది తుల ముల యెత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసికొంటిని; అదిగో నా డేరామధ్య అవి భూమిలో దాచబడియున్నవి, ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. అప్పుడు యెహోషువ దూతలను పంపగా వారు ఆ డేరా యొద్దకు పరుగెత్తి చూచినప్పుడు అది డేరాలో దాచబడి యుండెను, ఆ వెండి దాని క్రిందనుండెను. కాబట్టి వారు డేరా మధ్యనుండి వాటిని తీసికొని యెహోషువ యొద్దకును ఇశ్రాయేలీయులయొద్దకును తెచ్చి యెహోవా సన్నిధిని ఉంచిరి. తరువాత యెహోషువయు ఇశ్రా యేలీయులందరును జెరహు కుమారుడైన ఆకానును ఆ వెండిని ఆ పైవస్త్రమును ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందను డేరాను వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసికొనివచ్చిరి. అప్పుడు యెహోషువనీవేల మమ్మును బాధ పరిచితివి? నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలీయులందరు వానిని రాళ్లతో చావగొట్టిరి; వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్నిచేత కాల్చి వారిమీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటివరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడినవాడై మళ్లుకొనెను. అందుచేతను నేటివరకు ఆ చోటికి ఆకోరు లోయ అనిపేరు.
- Joshua 7:11 యెహోషువ 7:11ఇశ్రాయేలీ యులు పాపము చేసియున్నారు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరియున్నారు. శపితమైన దాని కొంత తీసికొని, దొంగిలి బొంకి తమ సామానులో దాని ఉంచుకొని యున్నారు.
- Psalm 47:9 కీర్తనలు 47:9జనముల ప్రధానులు అబ్రాహాముయొక్క దేవునికి జనులై కూడుకొనియున్నారు. భూనివాసులు ధరించుకొను కేడెములు దేవునివి ఆయన మహోన్నతుడాయెను.
- Judges 20:2 న్యాయాధిపతులు 20:2దేవుని జన సమాజమునకు చేరినవారు ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటికి పెద్దలుగా నున్నవారై కత్తిదూయు నాలుగు లక్షల కాలుబలము కూడుకొనిరి.
- Matthew 21:42 మత్తయి 21:42మరియు యేసు వారిని చూచి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను. ఇది ప్రభువువలననే కలిగెను. ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములలో ఎన్నడును చదువలేదా?
- Ephesians 2:20 ఎఫెసీయులకు 2:20క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియై యుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు.