1 Samuel · chapter 7 · verse 8
1 Samuel 7:8 in Telugu
మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించునట్లుగా మాకొరకు ఆయనను ప్రార్థనచేయుట మానవద్దని సమూయేలునొద్ద మనవి చేసిరి
Mana devudaina yehovaanu philishteeyula chetilo nundi manalanu rakshinchunatlugaa maakoraku aayananu praarthanacheyuta maanavaddani samooyelunodda manavi chesiri
1 Samuel 7:8 in English
- King James Version (KJV)
- And the children of Israel said to Samuel, Cease not to cry unto the LORD our God for us, that he will save us out of the hand of the Philistines.
- World English Bible (WEB)
- The children of Israel said to Samuel, “Don’t stop crying to the LORD our God for us, that he will save us out of the hand of the Philistines.”
- American Standard Version (ASV)
- And the children of Israel said to Samuel, Cease not to cry unto Jehovah our God for us, that he will save us out of the hand of the Philistines.
- Bible in Basic English (BBE)
- And the children of Israel said to Samuel, Go on crying to the Lord our God for us to make us safe from the hands of the Philistines.
- Darby Translation (DBY)
- And the children of Israel said to Samuel, Cease not to cry to Jehovah our God for us, that he will save us out of the hand of the Philistines.
- Webster's Bible (WBS)
- And the children of Israel said to Samuel, Cease not to cry to the LORD our God for us, that he will save us from the hand of the Philistines.
- Young's Literal Translation (YLT)
- And the sons of Israel say unto Samuel, 'Keep not silent for us from crying unto Jehovah our God, and He doth save us out of the hand of the Philistines.'
Read in context
- 6వారు మిస్పాలో కూడు కొని నీళ్లుచేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండియెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీ యులకు న్యాయము తీర్చుచువచ్చెను.
- 7ఇశ్రాయేలీయులు మిస్పాలో కూడియున్నారని ఫిలిష్తీయులు విని నప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఇశ్రాయేలుమీదికి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలీయులు విని ఫిలిష్తీయులకు భయపడి
- 8మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించునట్లుగా మాకొరకు ఆయనను ప్రార్థనచేయుట మానవద్దని సమూయేలునొద్ద మనవి చేసిరి
- 9సమూయేలు పాలు విడువని ఒక గొఱ్ఱెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి, ఇశ్రా యేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థనచేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను.
- 10సమూయేలు దహనబలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీయుల మీదికి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయులమీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయిరి.
Cross references
- Isaiah 37:4 యెషయా 37:4జీవముగల దేవుని దూషించు టకై అష్షూరురాజైన తన యజమానునిచేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలు నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి, నీ దేవుడైన యెహోవాకు వినబడియున్న ఆ మాటలనుబట్టి ఆయన అష్షూరురాజును గద్దించునేమో. కాబట్టి నిలిచిన శేషముకొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయుము.
- 1 Samuel 12:19–24 1 సమూయేలు 12:19–24సమూయేలుతో ఇట్లనిరిరాజును నియమించుమని మేము అడుగుటచేత మా పాపములన్నిటిని మించిన కీడు మేము చేసితివిు. కాబట్టి మేము మరణము కాకుండ నీ దాసులమైన మా కొరకు నీ దేవుడైన యెహోవాను ప్రార్థించుము. అంతట సమూయేలు జనులతో ఇట్లనెనుభయపడకుడి, మీరు ఈ కీడు చేసిన మాట నిజమే, అయి నను యెహోవాను విసర్జింపకుండ ఆయనను అనుసరించుచు పూర్ణహృదయముతో ఆయనను సేవించుడి. ఆయనను విసర్జింపకుడి, ఆయనను విసర్జింపువారు ప్రయోజనము మాలినవై రక్షింపలేని మాయా స్వరూపములను అను సరించుదురు. నిజముగా అవి మాయయే. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసికొనుటకు ఇష్టము గలిగి యున్నాడు; తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుటవలన యెహోవాకు విరోధముగ పాపము చేసినవాడ నగుదును. అది నాకు దూరమగునుగాక. కాని శ్రేష్ఠమైన చక్కని మార్గమును మీకు బోధింతును. ఆయన మీకొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో అది మీరు తలంచుకొని, మీరు యెహోవాయందు భయభక్తులు కలిగి, నిష్కపటులై పూర్ణహృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము.
- James 5:16 యాకోబు 5:16మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి; మీరు స్వస్థతపొందునట్లు ఒకనికొరకు ఒకడు ప్రార్థనచేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై యుండును.
- Isaiah 62:6–7 యెషయా 62:6–7యెరూషలేమా, నీ ప్రాకారములమీద నేను కావలి వారిని ఉంచియున్నాను రేయైన పగలైన వారు మౌనముగా ఉండరు. యెహోవా జ్ఞాపకకర్తలారా, విశ్రమింపకుడి ఆయన యెరూషలేమును స్థాపించువరకు లోకమంతట దానికి ప్రసిద్ధి కలుగజేయువరకు ఆయనను విశ్రమింపనియ్యకుడి. తన దక్షిణ హస్తము తోడనియు బాహుబలము తోడ నియు
- Isaiah 62:1 యెషయా 62:1సీయోను నీతి సూర్యకాంతివలె కనబడువరకు దాని రక్షణ దీపమువలె వెలుగుచుండువరకు సీయోను పక్షమందు నేను మౌనముగా ఉండను యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను.