2 Chronicles · chapter 18 · verse 5
2 Chronicles 18:5 in Telugu
ఇశ్రాయేలురాజు నాలుగువందల మంది ప్రవక్తలను సమకూర్చినేను రామోత్గిలాదుమీదికి యుద్ధమునకు పోవుదునా మానుదునా అని వారి నడిగెను. అందుకువారుపొమ్ము, దేవుడు రాజు చేతికి దానినప్పగించు నని చెప్పిరి.
Ishraayeluraaju naaluguvandala mandi pravaktalanu samakoorchinenu raamotgilaadumeediki yuddhamunaku povudunaa maanudunaa ani vaari nadigenu. Andukuvaarupommu, devudu raaju chetiki daaninappaginchu nani cheppiri.
2 Chronicles 18:5 in English
- King James Version (KJV)
- Therefore the king of Israel gathered together of prophets four hundred men, and said unto them, Shall we go to Ramoth-gilead to battle, or shall I forbear? And they said, Go up; for God will deliver [it] into the king’s hand.
- World English Bible (WEB)
- Then the king of Israel gathered the prophets together, four hundred men, and said to them, “Shall we go to Ramoth Gilead to battle, or shall I forbear?” They said, “Go up, for God will deliver it into the hand of the king.”
- American Standard Version (ASV)
- Then the king of Israel gathered the prophets together, four hundred men, and said unto them, Shall we go to Ramoth-gilead to battle, or shall I forbear? And they said, Go up; for God will deliver it into the hand of the king.
- Bible in Basic English (BBE)
- So the king of Israel got together all the prophets, four hundred men, and said to them, Am I to go to Ramoth-gilead to make war or not? And they said, Go up: for God will give it into the hands of the king.
- Darby Translation (DBY)
- And the king of Israel assembled the prophets, four hundred men, and said to them, Shall we go against Ramoth-Gilead to battle, or shall I forbear? And they said, Go up, and God will give it into the king's hand.
- Webster's Bible (WBS)
- Therefore the king of Israel collected of prophets four hundred men, and said to them, Shall we go to Ramoth-gilead to battle, or shall I forbear? And they said, Go up; for God will deliver [it] into the king's hand.
- Young's Literal Translation (YLT)
- And the king of Israel gathereth the prophets, four hundred men, and saith unto them, 'Do we go unto Ramoth-Gilead to battle, or do I forbear?' And they say, 'Go up, and God doth give [it] into the hand of the king.'
Read in context
- 3ఇశ్రాయేలు రాజైన అహాబు యూదారాజైన యెహోషాపాతును చూచినీవు నాతోకూడ రామోత్గిలాదునకు వచ్చెదవా అని అడుగగా యెహోషాపాతునేను నీవాడను, నా జనులు నీ జనులు, మేము నీతో కూడ యుధ్దమునకు వచ్చెద మని చెప్పెను.
- 4మరియు యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతోనేడు యెహోవాయొద్ద సంగతి విచారణ చేయుదము రండనగా
- 5ఇశ్రాయేలురాజు నాలుగువందల మంది ప్రవక్తలను సమకూర్చినేను రామోత్గిలాదుమీదికి యుద్ధమునకు పోవుదునా మానుదునా అని వారి నడిగెను. అందుకువారుపొమ్ము, దేవుడు రాజు చేతికి దానినప్పగించు నని చెప్పిరి.
- 6అయితే యెహోషాపాతుమనము అడిగి విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇచ్చట లేడా? అని యడుగగా
- 7ఇశ్రాయేలు రాజుయెహోవా యొద్ద విచారణచేయుటకు ఇవ్లూ కుమా రుడైన మీకాయా అను ఒకడు ఇచ్చట ఉన్నాడు; అయితే అతడు నన్నుగూర్చి మేలు ప్రవచింపక నిత్యము కీడునే ప్రవచించుచున్నాడు గనుక నేను వానియందు పగ గలిగియున్నాననగా యెహోషాపాతురాజు ఆలా గనవద్దనెను.
Cross references
- Jeremiah 23:14 యిర్మీయా 23:14యెరూషలేము ప్రవక్తలు ఘోరమైన క్రియలు చేయగా నేను చూచితిని, వారు వ్యభిచారులు అసత్య వర్తనులు, ఎవడును తన దుర్మార్గతనుండి మరలక దుర్మార్గుల చేతులను బలపరచుదురు, వారందరు నా దృష్టికి సొదొమ వలెనైరి, దాని నివాసులు గొమొఱ్ఱావలెనైరి.
- Micah 2:11 మీకా 2:11వ్యర్థమైన మాటలు పలుకుచు, అబద్ధికుడై ద్రాక్షారసమునుబట్టియు మద్యమును బట్టియు నేను మీకు ఉపన్యాసము చేయుదునని అబద్ధము చెప్పుచు ఒకడు వచ్చినయెడల వాడే ఈ జనులకు ప్రవక్త యగును.
- 1 Kings 18:19 1 రాజులు 18:19అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలువారి నందరిని, యెజెబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు నాలుగువందల ఏబదిమందిని, అషేరాదేవి ప్రవక్తలైన నాలుగువందల మందిని నాయొద్దకు కర్మెలు పర్వతము నకు పిలువనంపుమని చెప్పెను.
- Jeremiah 38:14–28 యిర్మీయా 38:14–28తరువాత రాజైన సిద్కియా యెహోవా మందిరములో నున్న మూడవ ద్వారములోనికి ప్రవక్తయైన యిర్మీయాను పిలువనంపించి అతనితో ఇట్లనెనునేను ఒకమాట నిన్నడుగుచున్నాను, నీవు ఏ సంగతిని నాకు మరుగు చేయక దాని చెప్పుమనగా యిర్మీయా నేను ఆ సంగతి నీకు తెలియజెప్పినయెడల నిశ్చయముగా నీవు నాకు మరణ శిక్ష విధింతువు, నేను నీకు ఆలోచన చెప్పినను నీవు నా మాట వినవు. కావున రాజైన సిద్కియా జీవాత్మను మన కనుగ్రహించు యెహోవాతోడు నేను నీకు మరణము విధింపను, నీ ప్రాణము తీయ జూచుచున్న యీ మనుష్యుల చేతికి నిన్ను అప్పగింపను అని యిర్మీయాతో రహస్యముగా ప్రమాణము చేసెను. అప్పుడు యిర్మీయా సిద్కియాతో ఇట్లనెనుదేవుడు, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునైన యెహోవా ఈలాగు సెలవిచ్చు చున్నాడునీవు బబులోనురాజు అధిపతులయొద్దకు వెళ్లిన యెడల నీవు బ్రదికెదవు, ఈ పట్టణము అగ్నిచేత కాల్చబడదు, నీవును నీ యింటివారును బ్రదుకుదురు. అయితే నీవు బబులోను అధిపతుల యొద్దకు వెళ్లనియెడల ఈ పట్టణము కల్దీయుల చేతికి అప్పగింపబడును, వారు అగ్ని చేత దాని కాల్చివేసెదరు, మరియు నీవు వారి చేతిలో నుండి తప్పించుకొనజాలవు. అందుకు రాజైన సిద్కియా యిర్మీయాతో ఇట్లనెనుకల్దీయుల పక్షముగా ఉండు యూదులకు భయపడుచున్నాను; ఒకవేళ కల్దీయులు నన్ను వారి చేతికి అప్పగించినయెడల వారు నన్ను అపహసించెదరు. అందుకు యిర్మీయావారు నిన్నప్పగింపరు, నీవు బ్రదికి బాగుగానుండునట్లు నేను నీతో చెప్పుచున్న సంగతినిగూర్చి యెహోవా సెలవిచ్చు మాటను చిత్తగించి ఆలకించుము. నీవు ఒకవేళ బయలు వెళ్లక పోయినయెడల యెహోవా ఈ మాట నాకు తెలియజేసెను. యూదా రాజు నగరులో శేషించియున్న స్త్రీలందరు బబులోను అధిపతులయొద్దకు కొనిపోబడెదరు, ఆలాగు జరుగగా ఆ స్త్రీలు నిన్ను చూచినీ ప్రియస్నేహితులు నిన్ను మోసపుచ్చి నీ పైని విజయము పొందియున్నారు, నీ పాదములు బురదలో దిగబడియుండగా వారు వెనుకతీసిరని యందురు. నీ భార్యలందరును నీ పిల్లలును కల్దీయులయొద్దకు కొనిపోబడుదురు, నీవు వారి చేతిలోనుండి తప్పించుకొనజాలక బబులోను రాజుచేత పట్టబడెదవు గనుక ఈ పట్టణమును అగ్నిచేత కాల్చుటకు నీవే కారణమగుదువు. అందుకు సిద్కియా యిర్మీయాతో ఇట్లనెనునీవు మరణశిక్ష నొంద కుండునట్లు ఈ సంగతులను ఎవనికిని తెలియనియ్యకుము. నేను నీతో మాటలాడిన సంగతి అధిపతులు వినినయెడల వారు నీయొద్దకు వచ్చి మేము నిన్ను చంపకుండునట్లు రాజుతో నీవు చెప్పిన సంగతిని రాజు నీతో చెప్పిన సంగతిని మరుగుచేయక మాకిప్పుడే తెలియజెప్పుమనగా నీవు యోనాతాను ఇంటిలో నేను చనిపోకుండ అక్కడికి నన్ను తిరిగి వెళ్లనంపవద్దని రాజు ఎదుట నేను మనవి చేసికొనబోతినని వారితో చెప్పుమని రాజు యిర్మీయాతో అనెను. అంతట అధిపతులందరు యిర్మీయాయొద్దకు వచ్చి యడుగగా అతడు రాజు సెలవిచ్చిన మాటల ప్రకార ముగా వారికుత్తరమిచ్చి ఆ సంగతి వారికి తెలియజేయనందున వారు అతనితో మాటలాడుట మానిరి. యెరూష లేము పట్టబడువరకు యిర్మీయా బందీగృహశాలలో ఉండెను.
- 2 Kings 3:13 2 రాజులు 3:13ఎలీషా ఇశ్రాయేలురాజును చూచినాతో నీకు నిమిత్తమేమి? నీ తలిదండ్రులుంచుకొనిన ప్రవక్తలయొద్దకు పొమ్మని చెప్పెను. ఆలాగనవద్దు, మోయాబీయులచేతికి అప్పగింపవలెనని యెహోవా, రాజులమైన మా ముగ్గురిని పిలిచెనని ఇశ్రాయేలురాజు అతనితో అనినప్పుడు
- Jeremiah 23:17 యిర్మీయా 23:17వారు నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చెననియు; ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడవగా వానితో మీకు కీడు రాదనియు చెప్పుచు, యెహోవా ఆజ్ఞనుబట్టి మాటలాడక తమకు తోచిన దర్శనమునుబట్టి పలుకుదురు.
- Ezekiel 13:3–16 యెహెజ్కేలు 13:3–16ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా దర్శనమేమియు కలుగకున్నను స్వబుద్ధి ననుసరించు అవివేక ప్రవక్తలకు శ్రమ. ఇశ్రాయేలీయులారా, మీ ప్రవక్తలు పాడైన స్థలములలో నుండు నక్కలతో సాటిగా ఉన్నారు. యెహోవా దినమున ఇశ్రాయేలీయులు యుద్ధమందు స్థిరముగా నిలుచు నట్లు మీరు గోడలలోనున్న బీటల దగ్గర నిలువరు, ప్రాకారమును దిట్టపరచరు. వారు వ్యర్థమైన దర్శనములు చూచి, అబద్ధపు సోదె చూచి యెహోవా తమ్మును పంపక పోయినను, తాము చెప్పినమాట స్థిరమని నమ్మునట్లు ఇది యెహోవా వాక్కు అని చెప్పుదురు. నేను సెలవియ్యకపోయినను ఇది యెహోవా వాక్కు అని మీరు చెప్పిన యెడల మీరు కనినది వ్యర్థమైన దర్శనముగదా? మీరు నమ్మదగని సోదెగాండ్రయితిరి గదా? కావున ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీరు వ్యర్థమైన మాటలు పలుకుచు నిరర్థకమైన దర్శనములు కనుచున్నారు గనుక నేను మీకు విరోధిని; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. వ్యర్థమైన దర్శనములు కనుచు, నమ్మదగని సోదెగాండ్రయిన ప్రవక్తలకు నేను పగవాడను, వారు నా జనుల సభలోనికి రారు, ఇశ్రాయేలీయుల సంఖ్యలో చేరినవారు కాక పోదురు, వారు ఇశ్రాయేలీయుల దేశములోనికి తిరిగి రారు, అప్పుడు నేను ప్రభువైన యెహోవానని మీరు తెలిసికొందురు. సమాధానమేమియు లేకపోయినను వారు సమాధానమని చెప్పి నా జనులను మోసపుచ్చు చున్నారు; నా జనులు మంటిగోడను కట్టగా వారు వచ్చి దానిమీద గచ్చుపూత పూసెదరు. ఇందువలననే పూయుచున్న వారితో నీ విట్లనుము వర్షము ప్రవాహముగా కురియును, గొప్ప వడగండ్లు పడును, తుపాను దాని పడగొట్టగా అది పడిపోవును. ఆ గోడ పడగా జనులు మిమ్మును చూచి మీరు పూసిన పూత యేమాయెనని అడుగుదురు గదా? ఇందుకు ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా నేను రౌద్రము తెచ్చుకొని తుపానుచేత దానిని పడగొట్టుదును, నా కోపమునుబట్టి వర్షము ప్రవాహముగా కురియును, నా రౌద్రమునుబట్టి గొప్ప వడగండ్లు పడి దానిని లయపరచును, దాని పునాది కనబడునట్లు మీరు గచ్చుపూత పూసిన గోడను నేను నేలతో సమముగా కూల్చెదను, అది పడిపోగా దానిక్రింద మీరును నాశనమగుదురు, అప్పుడు నేను యెహోవానని మీరు తెలిసికొందురు. ఈలాగున ఆ గోడమీదను దానిమీద గచ్చుపూత పూసినవారిమీదను నా కోపము నేను తీర్చుకొని, ఆ గోడకును దానికి పూత పూసినవారికిని పని తీరెనని మీతో చెప్పుదును. యెరూషలేమునకు సమాధానము లేకపోయినను ఆ పూత పూయువారు సమాధానార్థమైన దర్శనములు కనుచు ప్రవచించువారు ఇశ్రాయేలీయుల ప్రవక్తలే; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
- Ezekiel 13:22 యెహెజ్కేలు 13:22మరియు నేను యెహోవానని మీరు తెలిసికొనునట్లు మీరు వేసిన ముసుకులను నేను చింపి మీ చేతిలోనుండి నా జనులను విడిపించెదను, వేటాడుటకు వారికను మీ వశమున ఉండరు.
- 2 Timothy 4:3 2 తిమోతికి 4:3ఎందుకనగా జనులు హితబోధను సహింపక, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అను కూలమైన బోధకులను తమకొరకు పోగుచేసికొని,
- Jeremiah 8:10–11 యిర్మీయా 8:10–11గనుక వారి భార్యలను అన్యుల కప్పగింతును, వారిని జయించువారికి వారి పొలములను అప్పగింతును. అల్పులేమి ఘనులేమి అందరును మోసముచేసి దోచుకొనువారు; ప్రవక్తలేమి యాజకులేమి అందరును వంచకులు. సమాధానము లేని సమయమున సమాధానము సమాధానము అని వారు చెప్పుచు, నా జనుల గాయమును పైపైన మాత్రమే బాగు చేయుదురు.
- 2 Chronicles 18:14 2 దినవృత్తాంతములు 18:14అతడు రాజునొద్దకు రాగా రాజు అతని చూచిమీకాయా, యుద్ధమునకు రామోత్గిలాదునకు మేము పోవుదుమా, మానుదుమా అని యడుగగా అతడుపోయి జయించుడి, వారు మీ చేతికి అప్పగింపబడుదురనెను.
- Jeremiah 28:1–17 యిర్మీయా 28:1–17యూదారాజైన సిద్కియా యేలుబడి ఆరంభమున నాల్గవ సంవత్సరము అయిదవ నెలలో గిబియోనువాడును ప్రవక్తయును అజ్జూరు కుమారుడునైన హనన్యా యాజకుల యెదుటను ప్రజలందరియెదుటను యెహోవా మందిరములో నాతో ఈలాగనెను. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను బబులోనురాజు కాడిని విరిచియున్నాను. రెండు సంవత్సరములలోగా బబులోను రాజైన నెబుకద్రెజరు ఈ స్థలములోనుండి బబులోనునకు తీసికొనిపోయిన యెహోవా మందిరపు ఉపకరణములన్నిటిని ఇచ్చటికి మరల తెప్పించెదను. బబులోను రాజు కాడిని విరుగగొట్టి యెహోయాకీము కుమారుడును యూదారాజునైన యెకోన్యాను, బబులోనునకు చెరగొని పోయిన యూదులనందిరిని, యీ స్థలమునకు తిరిగి రప్పించెదను; ఇదే యెహోవా వాక్కు. అప్పుడు ప్రవక్తయైన యిర్మీయా యాజకులయెదుటను యెహోవా మందిరములో నిలుచుచున్న ప్రజలందరి యెదుటను ప్రవక్తయైన హనన్యాతో ఇట్లనెను ఆలాగున జరుగునుగాక, యెహోవా ఆలాగుననే చేయునుగాక, యెహోవా మందిరపు ఉపకరణములన్నిటిని, చెరగొనిపోబడిన వారి నందరిని యెహోవా బబులోనులోనుండి ఈ స్థలమునకు తెప్పించి నీవు ప్రకటించిన మాటలను నెరవేర్చునుగాక. అయినను నేను నీ చెవులలోను ఈ ప్రజలందరి చెవులలోను చెప్పుచున్న మాటను చిత్తగించి వినుము. నాకును నీకును ముందుగా నున్న ప్రవక్తలు, అనేకదేశములకు మహారాజ్యములకు విరోధముగా యుద్ధములు జరుగుననియు, కీడు సంభవించుననియు, తెగులుకలుగుననియు పూర్వకాలమందు ప్రకటించుచు వచ్చిరి. అయితే క్షేమము కలుగునని ప్రకటించు ప్రవక్త యున్నాడే, అతని మాట నెరవేరినయెడల యెహోవా నిజముగా అతని పంపెనని యొప్పుకొనదగునని ప్రవక్తయైన యిర్మీయా చెప్పగా ప్రవక్తయైన హనన్యా ప్రవక్తయైన యిర్మీయా మెడ మీదనుండి ఆ కాడిని తీసి దాని విరిచి ప్రజలందరి యెదుట ఇట్లనెను యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు రెండు సంవత్సరములలోగా నేను బబులోను రాజైన నెబుకద్రెజరు కాడిని సర్వజనముల మెడమీద నుండి తొలగించి దాని విరిచివేసెదను; అంతట ప్రవక్తయైన యిర్మీయా వెళ్లిపోయెను. ప్రవక్తయైన హనన్యా ప్రవక్తయైన యిర్మీయా మెడ మీదనున్న కాడిని విరిచిన తరువాత యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను నీవు పోయి హనన్యాతో ఇట్లనుము యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నీవు కొయ్యకాడిని విరిచితివే, దానికి ప్రతిగా ఇనుపకాడిని చేయించవలెను. ఇశ్రా యేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఈ జనులందరును బబులోను రాజైన నెబుకద్రెజరునకు దాసులు కావలెనని వారి మెడమీద ఇనుపకాడి యుంచితిని గనుక వారు అతనికి దాసులగుదురు, భూజంతువులను కూడ నేను అతనికి అప్పగించియున్నాను. అంతట ప్రవక్తయైన యిర్మీయా ప్రవక్తయైన హనన్యాతో ఇట్లనెనుహనన్యా వినుము;యెహోవా నిన్ను పంపలేదు, ఈ ప్రజలను అబద్ధమును ఆశ్రయింపజేయుచున్నావు. కాగా యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడుభూమిమీద నుండి నేను నిన్ను కొట్టివేయుచున్నాను, యెహోవా మీద తిరుగుబాటుచేయుటకై నీవు జనులను ప్రేరేపించితివి గనుక ఈ సంవత్సరము నీవు మరణమౌదువు అని చెప్పెను. ఆ సంవత్సరమే యేడవ నెలలో ప్రవక్తయైన హనన్యా మృతినొందెను.
Original words (Hebrew)
- king · H4428מֶלֶךְ melek
- Israel · H3478יִשְׂרָאֵל Yisrâʼêl
- together · H6908קָבַץ qâbats
- prophets · H5030נָבִיא nâbîyʼ
- four · H702אַרְבַּע ʼarbaʻ
- hundred · H3967מֵאָה mêʼâh
- men · H376אִישׁ ʼîysh
- said · H559אָמַר ʼâmar
- go · H3212יָלַךְ yâlak
- Ramoth-gilead · H7433רָמֹת גִּלעָד Râmôth Gilʻâd
- battle · H4421מִלְחָמָה milchâmâh
- forbear · H2308חָדַל châdal
- said · H559אָמַר ʼâmar
- up · H5927עָלָה ʻâlâh
- God · H430אֱלֹהִים ʼĕlôhîym
- deliver · H5414נָתַן nâthan
- king’s · H4428מֶלֶךְ melek
- hand · H3027יָד yâd