2 Kings · chapter 17 · verse 33
2 Kings 17:33 in Telugu
ఈ ప్రకారముగా వారు యెహోవాయందు భయభక్తులుగలవారైయుండి, తాము ఏ జనులలోనుండి పట్టబడిరో ఆయా జనుల మర్యాద చొప్పున తమ దేవతలను పూజించుచుండిరి.
Ee prakaaramugaa vaaru yehovaayandu bhayabhaktulugalavaaraiyundi, taamu e janulalonundi pattabadiro aayaa janula maryaada choppuna tama devatalanu poojinchuchundiri.
2 Kings 17:33 in English
- King James Version (KJV)
- They feared the LORD, and served their own gods, after the manner of the nations whom they carried away from thence.
- World English Bible (WEB)
- They feared the LORD, and also served their own gods, after the ways of the nations from among whom they had been carried away.
- American Standard Version (ASV)
- They feared Jehovah, and served their own gods, after the manner of the nations from among whom they had been carried away.
- Bible in Basic English (BBE)
- They gave worship to the Lord, but they gave honour to their gods like the nations did from whom they had been taken as prisoners.
- Darby Translation (DBY)
- They feared Jehovah, and served their own gods after the manner of the nations, whence they had been carried away.
- Webster's Bible (WBS)
- They feared the LORD, and served their own gods, after the manner of the nations whom they carried away from thence.
- Young's Literal Translation (YLT)
- Jehovah they are fearing, and their gods they are serving, according to the custom of the nations whence they removed them.
Read in context
- 31ఆవీయులు నిబ్హజు దేవతను తర్తాకు దేవతను, ఎవరు వారి దేవతను పెట్టు కొనుచుండిరి. సెపర్వీయులు తమ పిల్లలను ఆద్రమ్మె లెకు అనెమ్మెలెకు అను సెపర్వయీముయొక్క దేవతలకు అగ్నిగుండమందు దహించుచుండిరి.
- 32మరియు జనులు యెహోవాకు భయపడి, ఉన్నత స్థలములనిమిత్తము సామాన్యులలో కొందరిని యాజకులను చేసికొనగా వారు జనులపక్షమున ఉన్నతస్థలములలో కట్టబడిన మందిరములయందు బలులు అర్పించుచుండిరి.
- 33ఈ ప్రకారముగా వారు యెహోవాయందు భయభక్తులుగలవారైయుండి, తాము ఏ జనులలోనుండి పట్టబడిరో ఆయా జనుల మర్యాద చొప్పున తమ దేవతలను పూజించుచుండిరి.
- 34నేటి వరకు తమ పూర్వమర్యాదల ప్రకారము వారు చేయుచున్నారు; యెహోవాయందు భయభక్తులు పూనక వారితో నిబంధనచేసి మీరు ఇతర దేవతలకు భయపడ కయు, వాటికి నమస్కరింపకయు, పూజ చేయకయు, బలులు అర్పింపకయు,
- 35మహాధికారము చూపి బాహు బలముచేత ఐగుప్తు దేశములోనుండి మిమ్మును రప్పించిన యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయనకు మాత్రమే నమస్కారముచేసి బలులు అర్పింపవలెనని ఇశ్రాయేలని పేరుపెట్టబడిన యాకోబు సంతతివారికి సెలవిచ్చిన దేవుని సేవింపకయు
Cross references
- Luke 16:13 లూకా 16:13ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు; వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమిం చును, లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును; మీరు దేవునిని సిరిని సేవింప లేరని చెప్పెను.
- 2 Kings 17:41 2 రాజులు 17:41ఆ ప్రజలు ఆలాగున యెహోవాయందు భయ భక్తులు గలవారైనను తాము పెట్టుకొనిన విగ్రహములను పూజించుచు వచ్చిరి. మరియు తమ పితరులు చేసినట్లు వారి యింటివారును వారి సంతతివారును నేటివరకు చేయుచున్నారు.
- 1 Kings 18:21 1 రాజులు 18:21ఏలీయా జనులందరి దగ్గరకు వచ్చి యెన్నాళ్ల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడ బడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుస రించుడి, బయలు దేవుడైతే వాని ననుసరించుడని ప్రక టన చేయగా, జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలుకక పోయిరి.
- Matthew 6:24 మత్తయి 6:24ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు; అతడు ఒకని ద్వేషించియొకని ప్రేమించును; లేదా యొకని పక్ష ముగానుండి యొకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు.
- Zephaniah 1:5 జెఫన్యా 1:5మిద్దెలమీద ఎక్కి ఆకాశ సమూహములకు మ్రొక్కువారిని యెహోవా పేరునుబట్టియు, బయలు దేవత తమకు రాజనుదాని నామమును బట్టియు మ్రొక్కి ప్రమాణము చేయువారిని నేను నిర్మూలము చేసెదను.
- Hosea 10:2 హోషేయ 10:2వారి మనస్సు కపటమైనది గనుక వారు త్వరలోనే తమ అపరాధమునకు శిక్ష నొందుదురు; యెహోవా వారి బలిపీఠ ములను తుత్తునియలుగా చేయును, వారు ప్రతిష్టించిన దేవతాస్తంభములను పాడుచేయును.