Acts · chapter 16 · verse 29
Acts 16:29 in Telugu
అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి, వణకుచు పౌలుకును సీలకును సాగిలపడి
Atadu deepamu temmani cheppi lopaliki vachchi, vanakuchu paulukunu seelakunu saagilapadi
Acts 16:29 in English
- King James Version (KJV)
- Then he called for a light, and sprang in, and came trembling, and fell down before Paul and Silas,
- World English Bible (WEB)
- He called for lights, sprang in, fell down trembling before Paul and Silas,
- American Standard Version (ASV)
- And he called for lights and sprang in, and, trembling for fear, fell down before Paul and Silas,
- Bible in Basic English (BBE)
- And he sent for lights and came rushing in and, shaking with fear, went down on his face before Paul and Silas,
- Darby Translation (DBY)
- And having asked for lights, he rushed in, and, trembling, fell down before Paul and Silas.
- Webster's Bible (WBS)
- Then he called for a light, and sprang in, and came trembling, and fell down before Paul and Silas;
- Young's Literal Translation (YLT)
- And, having asked for a light, he sprang in, and trembling he fell down before Paul and Silas,
Read in context
- 27అంతలో చెరసాల నాయకుడు మేలుకొని, చెరసాల తలుపులన్నియు తెరచియుండుట చూచి, ఖయిదీలు పారిపోయిరనుకొని, కత్తిదూసి, తన్ను తాను చంపుకొనబోయెను.
- 28అప్పుడు పౌలు నీవు ఏ హానియు చేసికొనవద్దు, మేమందరము ఇక్కడనే యున్నామని బిగ్గరగా చెప్పెను.
- 29అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి, వణకుచు పౌలుకును సీలకును సాగిలపడి
- 30వారిని వెలుపలికి తీసికొనివచ్చి అయ్యలారా, రక్షణపొందుటకు నేనేమి చేయవలెననెను.
- 31అందుకు వారు ప్రభువైన యేసు నందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ యింటివారును రక్షణ పొందుదురని చెప్పి
Cross references
- Revelation 3:9 ప్రకటన 3:9యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను; వారు వచ్చి నీ పాదముల యెదుట పడి నమస్కారముచేసి, ఇదిగో, నేను నిన్ను ప్రేమించితినని తెలిసికొనునట్లు చేసెదను.
- Daniel 6:26 దానియేలు 6:26నా సముఖమున నియమించిన దేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలుయొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణకుచుండవలెను. ఆయనే జీవముగల దేవుడు, ఆయనే యుగయుగములుండువాడు, ఆయన రాజ్యము నాశనముకానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టున కుండును.
- Jeremiah 10:10 యిర్మీయా 10:10యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవముగల దేవుడు, సదాకాలము ఆయనే రాజు, ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు.
- Psalm 99:1 కీర్తనలు 99:1యెహోవా రాజ్యము చేయుచున్నాడు జనములు వణకును ఆయన కెరూబులమీద ఆసీనుడై యున్నాడు భూమి కదలును.
- Psalm 119:120 కీర్తనలు 119:120నీ భయమువలన నా శరీరము వణకుచున్నది నీ న్యాయవిధులకు నేను భయపడుచున్నాను.
- Acts 9:5–6 అపొస్తలుల కార్యములు 9:5–6ప్రభువా, నీవెవడవని అతడడుగగా ఆయన నేను నీవు హింసించు చున్న యేసును; లేచి పట్టణములోనికి వెళ్లుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడునని చెప్పెను.
- Isaiah 66:5 యెషయా 66:5యెహోవా వాక్యమునకు భయపడువారలారా, ఆయన మాట వినుడి మిమ్మును ద్వేషించుచు నా నామమునుబట్టి మిమ్మును త్రోసివేయు మీ స్వజనులు మీ సంతోషము మాకు కనబడునట్లు యెహోవా మహిమనొందును గాక అని చెప్పుదురు వారే సిగ్గునొందుదురు.
- Acts 24:25 అపొస్తలుల కార్యములు 24:25అప్పుడతడు నీతిని గూర్చియు ఆశానిగ్రహమును గూర్చియు రాబోవు విమర్శనుగూర్చియు ప్రసంగించు చుండగా ఫేలిక్సు మిగుల భయపడిఇప్పటికి వెళ్లుము, నాకు సమయమైన నిన్ను పిలువనంపింతునని చెప్పెను.
- Isaiah 66:2 యెషయా 66:2అవన్నియు నా హస్తకృత్యములు అవి నావలన కలిగినవని యెహోవా సెలవిచ్చు చున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయముగలవాడై నా మాట వినివణకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను.
- Isaiah 60:14 యెషయా 60:14నిన్ను బాధించినవారి సంతానపువారు నీ యెదుటికి వచ్చి సాగిలపడెదరు నిన్ను తృణీకరించినవారందరు వచ్చి నీ పాదములమీద పడెదరు. యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సీయోననియు నీకు పేరు పెట్టెదరు.
- Jeremiah 5:22 యిర్మీయా 5:22సముద్రము దాటలేకుండునట్లును, దాని తరంగము లెంత పొర్లినను అవి ప్రబలలేకయు, ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండునట్లును నిత్య నిర్ణయముచేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయ పడరా? నా సన్నిధిని వణకరా? ఇదే యెహోవా వాక్కు.