Daniel · chapter 7 · verse 26
Daniel 7:26 in Telugu
అతని యధికారము నశింపజేయుటకును నిర్మూలముచేయుటకును తీర్పు విధింపబడెను గనుక అది కొట్టి వేయబడును.
Atani yadhikaaramu nashimpajeyutakunu nirmoolamucheyutakunu teerpu vidhimpabadenu ganuka adi kotti veyabadunu.
Daniel 7:26 in English
- King James Version (KJV)
- But the judgment shall sit, and they shall take away his dominion, to consume and to destroy [it] unto the end.
- World English Bible (WEB)
- “‘But the judgment will be set, and they will take away his dominion, to consume and to destroy it to the end.
- American Standard Version (ASV)
- But the judgment shall be set, and they shall take away his dominion, to consume and to destroy it unto the end.
- Bible in Basic English (BBE)
- But the judge will be seated, and they will put an end to his authority, to overcome it and send complete destruction on it.
- Darby Translation (DBY)
- And the judgment shall sit, and they shall take away his dominion, to consume and to destroy it unto the end.
- Webster's Bible (WBS)
- But the judgment shall sit, and they shall take away his dominion to consume and to destroy [it] to the end.
- Young's Literal Translation (YLT)
- 'And the Judge is seated, and its dominion they cause to pass away, to cut off, and to destroy — unto the end;
Read in context
- 24ఆ పది కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబోవు పదిమంది రాజులను సూచించుచున్నవి; కడపట ముందుగా ఉన్న రాజులకు భిన్నమగు మరియొక రాజుపుట్టి ఆ ముగ్గురు రాజులను పడద్రోయును.
- 25ఆ రాజుమహోన్నతునికి విరోధముగా మాటలాడుచు మహోన్నతుని భక్తులను నలుగగొట్టును; అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణచేయ బూనుకొనును; వారు ఒక కాలము కాలములు అర్థకాలము అతని వశమున నుంచబడుదురు.
- 26అతని యధికారము నశింపజేయుటకును నిర్మూలముచేయుటకును తీర్పు విధింపబడెను గనుక అది కొట్టి వేయబడును.
- 27ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును అధికారమును రాజ్య మహాత్మ్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిలుచును, అధికారులందరును దానికి దాసులై విధేయులగుదురు. ఇంతలో సంగతి సమాప్తమాయెను అని చెప్పెను.
- 28దానియేలను నేను విని మనస్సునందు అధికమైన కలతగలవాడ నైతిని; అందుచేత నా ముఖము వికారమాయెను; అయితే ఆ సంగతి నా మనస్సులో నుంచుకొంటిని.
Cross references
- Revelation 20:10–11 ప్రకటన 20:10–11వారిని మోసపరచిన అపవాది అగ్ని గంధకములుగల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూరమృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు; వారు యుగయుగములు రాత్రింబగళ్లు బాధింపబడుదురు. మరియు ధవళమైన మహా సింహాసనమును దానియందు ఆసీనుడైయున్న యొకనిని చూచితిని; భూమ్యాకాశములు ఆయన సముఖమునుండి పారిపోయెను; వాటికి నిలువ చోటు కనబడకపోయెను.
- 2 Thessalonians 2:8 2 థెస్సలొనీకయులకు 2:8అప్పుడా ధర్మవిరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటియూపిరిచేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశముచేత నాశనము చేయును.
- Revelation 11:13 ప్రకటన 11:13ఆ గడియలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణములో పదియవ భాగము కూలిపోయెను. ఆ భూకంపమువలన ఏడువేలమంది చచ్చిరి. మిగిలినవారు భయాక్రాంతులై పరలోకపు దేవుని మహిమపరచిరి.
- Daniel 7:22 దానియేలు 7:22ఆ మహావృద్ధుడు వచ్చి మహోన్నతుని పరిశుద్ధుల విషయములో తీర్పు తీర్చువరకు ఆలాగు జరుగును గాని సమయము వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు రాజ్యము నేలుదురను సంగతి నేను గ్రహించితిని.
- Daniel 7:10–11 దానియేలు 7:10–11అగ్నివంటి ప్రవాహము ఆయనయొద్దనుండి ప్రవహించుచుండెను. వేవేలకొలది ఆయనకు పరిచారకులుండిరి; కోట్లకొలది మనుష్యులు ఆయనయెదుట నిలిచిరి, తీర్పుతీర్చుటకై గ్రంథములు తెరువబడెను. అప్పుడు నేను చూచుచుండగా, ఆ కొమ్ము పలుకుచున్న మహా గర్వపు మాటల నిమిత్తము వారు ఆ జంతువును చంపినట్టు కనబడెను; తరువాత దాని కళేబరము మండుచున్న అగ్నిలో వేయబడెను.