Deuteronomy · chapter 11 · verse 15
Deuteronomy 11:15 in Telugu
మరియు నీవు తిని తృప్తిపొందునట్లు నీ పశువులకొరకు నీ చేలయందు గడ్డి మొలిపించెదను.
Mariyu neevu tini truptipondunatlu nee pashuvulakoraku nee chelayandu gaddi molipinchedanu.
Deuteronomy 11:15 in English
- King James Version (KJV)
- And I will send grass in thy fields for thy cattle, that thou mayest eat and be full.
- World English Bible (WEB)
- I will give grass in your fields for your livestock, and you shall eat and be full.
- American Standard Version (ASV)
- And I will give grass in thy fields for thy cattle, and thou shalt eat and be full.
- Bible in Basic English (BBE)
- And I will give grass in your fields for your cattle, so that you may have food in full measure.
- Darby Translation (DBY)
- and I will give grass in thy field for thy cattle; and thou shalt eat and be full.
- Webster's Bible (WBS)
- And I will give grass in thy fields for thy cattle, that thou mayest eat and be full.
- Young's Literal Translation (YLT)
- and I have given herbs in thy field for thy cattle, and thou hast eaten, and been satisfied.
Read in context
- 13కాబట్టి మీ పూర్ణహృదయముతోను మీ పూర్ణాత్మ తోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినినయెడల
- 14మీ దేశమునకు వర్షము, అనగా తొలకరివానను కడవరివానను దాని దాని కాలమున కురి పించెదను. అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షా రసమును నీ నూనెను కూర్చుకొందువు.
- 15మరియు నీవు తిని తృప్తిపొందునట్లు నీ పశువులకొరకు నీ చేలయందు గడ్డి మొలిపించెదను.
- 16మీ హృదయము మాయలలో చిక్కి త్రోవవిడిచి యితర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండ మీరు జాగ్రత్త పడుడి.
- 17లేని యెడల యెహోవా మీమీద కోపపడి ఆకాశమును మూసివేయును; అప్పుడు వాన కురియదు, భూమిపండదు, యెహోవా మీకిచ్చుచున్న ఆ మంచి దేశమున ఉండ కుండ మీరు శీఘ్రముగా నశించెదరు.
Cross references
- Psalm 104:14 కీర్తనలు 104:14పశువులకు గడ్డిని నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు
- Deuteronomy 6:11 ద్వితీయోపదేశకాండము 6:11నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింప బడిన ఇండ్లను, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావు లను, నీవు నాటని ద్రాక్షతోటలను ఒలీవల తోటలను నీ కిచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు
- Joel 2:19 యోవేలు 2:19మరియు యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదే మనగాఇకను అన్యజనులలో మిమ్మును అవమానాస్పదముగా చేయక, మీరు తృప్తినొందునంతగా నేను ధాన్యమును క్రొత్త ద్రాక్షారసమును తైలమును మీకు పంపించెదను
- Malachi 3:10–11 మలాకీ 3:10–11నా మందిరములో ఆహారముండునట్లు పదియవభాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసికొనిరండి; దీని చేసి మీరు నన్ను శోధించినయెడల నేను ఆకాశపువాకిండ్లను విప్పి, పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చు చున్నాడు. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూమిపంటను నాశనముచేయవు, మీ ద్రాక్షచెట్లు అకాలఫలములను రాల్పకయుండునని సైన్య ములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు
- Joel 2:22 యోవేలు 2:22పశువులారా, భయపడకుడి, గడ్డిబీళ్లలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపుచెట్లును, ద్రాక్షచెట్లు సమృద్ధిగా ఫలించును,
- Deuteronomy 8:10 ద్వితీయోపదేశకాండము 8:10నీవు తిని తృప్తిపొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమునుబట్టి ఆయనను స్తుతింపవలెను.
- Haggai 1:6 హగ్గయి 1:6మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది, పానము చేయుచున్నను దాహము తీరకయున్నది, బట్టలు కప్పు కొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టముచేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది.
- Joel 1:18 యోవేలు 1:18మేతలేక పశువులు బహుగా మూల్గుచున్నవి ఎడ్లు మందలుగా కూడి ఆకలికి అల్లాడుచున్నవి గొఱ్ఱెమందలు చెడిపోవుచున్నవి.