Deuteronomy · chapter 16 · verse 15
Deuteronomy 16:15 in Telugu
నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోను నీ చేతిపను లన్నిటిలోను నిన్ను ఆశీర్వ దించును గనుక యెహోవా ఏర్పరచుకొను స్థలమును నీ దేవుడైన యెహోవాకు ఏడుదినములు పండుగ చేయ వలెను. నీవు నిశ్చయముగా సంతోషింపవలెను.
Nee devudaina yehovaa nee raabadi antatilonu nee chetipanu lannitilonu ninnu aasheerva dinchunu ganuka yehovaa erparachukonu sthalamunu nee devudaina yehovaaku edudinamulu panduga cheya valenu. Neevu nishchayamugaa santoshimpavalenu.
Deuteronomy 16:15 in English
- King James Version (KJV)
- Seven days shalt thou keep a solemn feast unto the LORD thy God in the place which the LORD shall choose: because the LORD thy God shall bless thee in all thine increase, and in all the works of thine hands, therefore thou shalt surely rejoice.
- World English Bible (WEB)
- You shall keep a feast to the LORD your God seven days in the place which the LORD chooses, because the LORD your God will bless you in all your increase and in all the work of your hands, and you shall be altogether joyful.
- American Standard Version (ASV)
- Seven days shalt thou keep a feast unto Jehovah thy God in the place which Jehovah shall choose; because Jehovah thy God will bless thee in all thine increase, and in all the work of thy hands, and thou shalt be altogether joyful.
- Bible in Basic English (BBE)
- Keep the feast to the Lord your God for seven days, in the place marked out by the Lord: because the blessing of the Lord your God will be on all the produce of your land and all the work of your hands, and you will have nothing but joy.
- Darby Translation (DBY)
- Seven days shalt thou hold a feast to Jehovah thy God in the place which Jehovah will choose; for Jehovah thy God will bless thee in all thy produce, and in all the work of thy hands, and thou shalt be wholly joyful.
- Webster's Bible (WBS)
- Seven days shalt thou keep a solemn feast to the LORD thy God in the place which the LORD shall choose: because the LORD thy God shall bless thee in all thy increase, and in all the works of thy hands, therefore thou shalt surely rejoice.
- Young's Literal Translation (YLT)
- Seven days thou dost feast before Jehovah thy God, in the place which Jehovah doth choose, for Jehovah thy God doth bless thee in all thine increase, and in every work of thy hands, and thou hast been only rejoicing.
Read in context
- 13నీ కళ్లములోనుండి ధాన్యమును నీ తొట్టిలోనుండి రసమును సమకూర్చినప్పుడు పర్ణశాలల పండుగను ఏడు దినములు ఆచరింపవలెను.
- 14ఈ పండుగలో నీవును నీ కుమారుడును నీ కుమార్తెయును నీ దాసుడును నీ దాసి యును నీ గ్రామములలోనున్న లేవీయులును పరదేశు లును తలిదండ్రులు లేనివారును విధవరాండ్రును సంతో షింపవలెను.
- 15నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోను నీ చేతిపను లన్నిటిలోను నిన్ను ఆశీర్వ దించును గనుక యెహోవా ఏర్పరచుకొను స్థలమును నీ దేవుడైన యెహోవాకు ఏడుదినములు పండుగ చేయ వలెను. నీవు నిశ్చయముగా సంతోషింపవలెను.
- 16ఏటికి మూడు మారులు, అనగా పొంగని రొట్టెలపండుగలోను వారములపండుగలోను పర్ణశాలల పండుగలోను నీ దేవు డైన యెహోవా ఏర్పరచుకొను స్థలమున నీ మగవారందరు ఆయన సన్నిధిని కనబడవలెను.
- 17వారు వట్టిచేతు లతో యెహోవా సన్నిధిని కనబడక, నీ దేవుడైన యెహోవా నీ కనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి వాడును తన శక్తికొలది యియ్యవలెను.
Cross references
- Deuteronomy 30:16 ద్వితీయోపదేశకాండము 30:16నీవు బ్రదికి విస్తరించునట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడ లను విధులను ఆచరించుమని నేడు నేను నీకాజ్ఞాపించు చున్నాను. అట్లు చేసినయెడల నీవు స్వాధీనపరచుకొను టకు ప్రవేశించు దేశములో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును.
- Leviticus 23:36–42 లేవీయకాండము 23:36–42ఏడు దినములు మీరు యెహోవాకు హోమము చేయవలెను. ఎనిమిదవ దినమున మీరు పరిశుద్ధసంఘ ముగా కూడి యెహోవాకు హోమార్పణము చేయవలెను. అది మీకు వ్రతదినముగా ఉండును. అందులో మీరు జీవనోపాధియైన యే పనియు చేయకూడదు. యెహోవా నియమించిన విశ్రాంతిదినములు గాకయు, మీరు దానములనిచ్చు దినములుగాకయు, మీ మ్రొక్కు బడి దినములుగాకయు, మీరు యెహోవాకు స్వేచ్ఛార్పణ ములనిచ్చు దినములుగాకయు, యెహోవాకు హోమ ద్రవ్యమునేమి దహనబలి ద్రవ్యము నేమి నైవేద్యమునేమి బలినేమి పానీ యార్పణముల నేమి అర్పించుటకై పరిశుద్ధ సంఘపు దినములుగా మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవి. ఏ అర్పణదినమున ఆ అర్పణ మును తీసికొని రావలెను. అయితే ఏడవ నెల పదునయిదవ దినమున మీరు భూమిపంటను కూర్చుకొనగా ఏడు దినములు యెహో వాకు పండుగ ఆచరింపవలెను. మొదటి దినము విశ్రాంతి దినము, ఎనిమిదవ దినము విశ్రాంతిదినము. మొదటి దిన మున మీరు దబ్బపండ్లను ఈతమట్టలను గొంజి చెట్లకొమ్మ లను కాలువలయొద్దనుండు నిరవంజి చెట్లను పట్టుకొని యేడుదినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్స హించుచుండవలెను. అట్లు మీరు ఏటేట ఏడు దినములు యెహోవాకు పండుగగా ఆచరింపవలెను. ఇది మీ తర తరములలో నిత్యమైన కట్టడ. ఏడవ నెలలో దానిని ఆచ రింపవలెను. నేను ఐగుప్తుదేశములోనుండి ఇశ్రాయేలీ యులను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింప చేసితినని మీ జనులు ఎరుగునట్లు ఏడు దినములు మీరు పర్ణశాలలలో నివసింపవలెను. ఇశ్రాయేలీయులలో పుట్టిన వారందరు పర్ణశాలలలో నివసింపవలెను.
- Deuteronomy 16:10 ద్వితీయోపదేశకాండము 16:10నీ దేవుడైన యెహోవాకు వారముల పండుగ ఆచరించుటకై నీ చేతనైనంత స్వేచ్ఛార్పణమును సిద్ధపరచవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వ దించినకొలది దాని నియ్యవలెను.
- Deuteronomy 28:8–12 ద్వితీయోపదేశకాండము 28:8–12నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నము లన్నిటి లోను నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞల ననుసరించి ఆయన మార్గములలో నడుచుకొనిన యెడల యెహోవా నీకు ప్రమాణము చేసియున్నట్లు ఆయన తనకు ప్రతిష్టితజనముగా నిన్ను స్థాపించును. భూప్రజలందరు యెహోవా నామమున నీవు పిలువబడు చుండుట చూచి నీకు భయపడుదురు. మరియు యెహోవా నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణముచేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయములోను నీ పశు వుల విషయములోను నీ నేలపంట విషయములోను నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును. యెహోవా నీ దేశముమీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును, ఆకాశ మను తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేకజనము లకు అప్పిచ్చెదవు కాని అప్పుచేయవు
- Deuteronomy 7:13 ద్వితీయోపదేశకాండము 7:13ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభి వృద్ధిచేసి, నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణముచేసిన దేశములో నీ గర్భఫలమును, నీ భూఫలమైన నీ సస్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను, నీ పశువుల మందలను, నీ గొఱ్ఱెల మందలను, మేకల మందలను దీవించును.
- Numbers 29:12–38 సంఖ్యాకాండము 29:12–38మరియు ఏడవ నెల పదునయిదవ దినమున మీరు పరిశుద్ధసంఘముగా కూడవలెను. అప్పుడు మీరు జీవనో పాధియైన పనులేమియు చేయక యేడు దినములు యెహో వాకు పండుగ ఆచరింపవలెను. నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును దాని పానార్పణమును గాక, యెహో వాకు ఇంపైన సువాసనగల దహనబలిగా పదమూడు కోడెదూడలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱె పిల్లలను అర్పింపవలెను. అవి నిర్దోషమైనవై యుండవలెను. నూనెతో కలుపబడిన గోధుమపిండిని నైవేద్యముగాను ఆ పదమూడు కోడెదూడలలో ప్రతి దూడతో తూములో మూడు పదియవవంతులను ఆ రెండు పొట్టేళ్లలో ప్రతి పొట్టేలుతో రెండు పదియవవంతులను ఆ పదునాలుగు గొఱ్ఱెపిల్లలలో ప్రతి పిల్లతో ఒక్కొక్క పదియవవంతును పాపపరిహారార్థబలిగా ఒక మేక పిల్లను అర్పింవలెను. రెండవ దినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్య మును వాటి పానార్పణములును గాక మీరు నిర్దోషమైన పండ్రెండుకోడెదూడలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱె పిల్లలను విధిప్రకారముగా, వాటి వాటి లెక్కచొప్పున, ఆ కోడెలతోను పొట్టేళ్లతోను గొఱ్ఱెపిల్లలతోను వాటి వాటి నైవేద్యమును పానార్ప ణములను పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింప వలెను. మూడవ దినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును దాని పానార్పణమును గాక నిర్దోషమైన పదకొండు కోడెలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱెపిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్కచొప్పున, ఆ కోడెలతోను పొట్టేళ్లతోను గొఱ్ఱె పిల్లలతోను వాటి నైవేద్యమును పానార్పణములను పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. నాలుగవ దినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక నిర్దోషమైన పది కోడెలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱెపిల్లలను విధి ప్రకారముగా, వాటి వాటి లెక్క చొప్పున, ఆ కోడెలతోను పొట్టేళ్లతోను గొఱ్ఱెపిల్లల తోను వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. అయిదవ దినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక నిర్దోషమైన తొమ్మిది కోడెలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱెపిల్లలను విధి ప్రకారముగా, వాటి వాటి లెక్కచొప్పున, ఆ కోడెలతోను పొట్టేళ్లతోను గొఱ్ఱె పిల్లలతోను వాటి వాటి నైవేద్యమును పానార్పణము లను పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింప వలెను. ఆరవ దినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్య మును పానార్పణమును గాక నిర్దోషమైన యెనిమిది కోడె లను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱె పిల్లలను విధి ప్రకారముగా, వాటి వాటి లెక్కచొప్పున, ఆ కోడెలతోను పొట్టేళ్లతోను గొఱ్ఱెపిల్లలతోను వాటి వాటి నైవేద్యమును పానార్పణములను పాపపరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను. ఏడవ దినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్య మును పానార్పణమును గాక నిర్దోషమైన యేడు దూడ లను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱె పిల్లలను విధి ప్రకారముగా, వాటి వాటి లెక్కచొప్పున, ఆ కోడెలతోను పొట్టేళ్లతోను గొఱ్ఱెపిల్లల తోను వాటి వాటి నైవేద్యమును పానార్పణములను పాపపరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను. ఎనిమిదవ దినము మీకు వ్రతదినముగానుండును. అప్పుడు మీరు జీవనోపాధియైన పనులనేమియు చేయ కూడదు. అందులో నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును పానార్పణమునుగాక మీరు యెహోవాకు ఇంపైన సువాసనగల దహనబలిగా నిర్దోషమైన యొక కోడెదూడను ఒక పొట్టేలును ఏడాదివైన యేడు గొఱ్ఱెపిల్లలను విధి ప్రకారముగా, వాటి వాటి లెక్కచొప్పున, ఆ కోడెదూడతోను పొట్టేలుతోను గొఱ్ఱెపిల్లలతోను వాటి వాటి నైవేద్యమును పానార్పణ ములను పాపపరి హారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను.
Original words (Hebrew)
- Seven · H7651שֶׁבַע shebaʻ
- days · H3117יוֹם yôwm
- feast · H2287חָגַג châgag
- God · H430אֱלֹהִים ʼĕlôhîym
- place · H4725מָקוֹם mâqôwm
- choose · H977בָּחַר bâchar
- God · H430אֱלֹהִים ʼĕlôhîym
- bless · H1288בָרַךְ bârak
- increase · H8393תְּבוּאָה tᵉbûwʼâh
- works · H4639מַעֲשֶׂה maʻăseh
- hands · H3027יָד yâd
- rejoice · H8056שָׂמֵחַ sâmêach