Deuteronomy · chapter 29 · verse 28
Deuteronomy 29:28 in Telugu
యెహోవా తన కోపోద్రేకముచేతను అత్యుగ్రతచేతను తమ దేశములో నుండి వారిని పెల్లగించి, నేడున్నట్లుగా వారిని వెళ్లగొట్టి పరదేశము పాలుచేసెను.
Yehovaa tana kopodrekamuchetanu atyugratachetanu tama deshamulo nundi vaarini pellaginchi, nedunnatlugaa vaarini vellagotti paradeshamu paaluchesenu.
Deuteronomy 29:28 in English
- King James Version (KJV)
- And the LORD rooted them out of their land in anger, and in wrath, and in great indignation, and cast them into another land, as [it is] this day.
- World English Bible (WEB)
- The LORD rooted them out of their land in anger, in wrath, and in great indignation, and thrust them into another land, as it is today.”
- American Standard Version (ASV)
- and Jehovah rooted them out of their land in anger, and in wrath, and in great indignation, and cast them into another land, as at this day.
- Bible in Basic English (BBE)
- Rooting them out of their land, in the heat of his wrath and passion, and driving them out into another land, as at this day.
- Darby Translation (DBY)
- and Jehovah rooted them out of their land in anger, and in fury, and in great indignation, and cast them into another land, as [it appears] this day.
- Webster's Bible (WBS)
- And the LORD rooted them out of their land in anger and in wrath, and in great indignation, and cast them into another land, as [it is] this day.
- Young's Literal Translation (YLT)
- and Jehovah doth pluck them from off their ground in anger, and in fury, and in great wrath, and doth cast them unto another land, as [at] this day.
Read in context
- 26తామెరుగని అన్యదేవతలను, ఆయన వారికి నియమింపని దేవతలను, పూజించి వాటికి నమస్క రించిరి
- 27గనుక యీ గ్రంథములో వ్రాయబడిన శాపము లన్నిటిని యీ దేశముమీదికి తెప్పించుటకు దానిమీద యెహోవా కోపము రవులుకొనెను.
- 28యెహోవా తన కోపోద్రేకముచేతను అత్యుగ్రతచేతను తమ దేశములో నుండి వారిని పెల్లగించి, నేడున్నట్లుగా వారిని వెళ్లగొట్టి పరదేశము పాలుచేసెను.
- 29రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మ శాస్త్ర వాక్యములన్నిటి ననుసరించి నడుచుకొనునట్లు బయలుపరచబడినవి యెల్లప్పుడు మనవియు మన సంతతి వారివియునగునని చెప్పుదురు.
Cross references
- 2 Chronicles 7:20 2 దినవృత్తాంతములు 7:20నేను మీకిచ్చిన నా దేశ ములోనుండి మిమ్మును పెల్లగించి, నా నామమునకు నేను పరిశుద్ధపరచిన యీ మందిరమును నా సన్నిధినుండి తీసివేసి, సమస్త జనములలో దానిని సామెత కాస్పదముగాను నిందకాస్పదముగాను చేయుదును.
- 1 Kings 14:15 1 రాజులు 14:15ఇశ్రాయేలువారు దేవతాస్తంభ ములను నిలిపి యెహోవాకు కోపము పుట్టించి యున్నారు గనుక నీటియందు రెల్లు అల్లలాడునట్లు యెహోవా ఇశ్రాయేలు వారిని మొత్తి, ఒకడు వేరును పెల్లగించినట్లు వారి పితరులకు తాను ఇచ్చిన యీ మంచి దేశములోనుండి వారిని పెల్లగించి వారిని యూఫ్రటీసునది అవతలకు చెదర గొట్టును.
- Proverbs 2:22 సామెతలు 2:22భక్తిహీనులు దేశములో నుండకుండ నిర్మూలమగుదురు. విశ్వాసఘాతకులు దానిలోనుండి పెరికివేయబడుదురు.
- Psalm 52:5 కీర్తనలు 52:5కావున దేవుడు సదాకాలము నిన్ను అణగగొట్టును నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారములోనుండి నిన్ను పెల్లగించును సజీవుల దేశములోనుండి నిన్ను నిర్మూలము చేయును. (సెలా. )
- Jeremiah 42:10 యిర్మీయా 42:10నేను మీకు చేసిన కీడునుగూర్చి సంతాపమొందియున్నాను, మీరు తొందరపడక యీ దేశములో కాపురమున్న యెడల, పడగొట్టక నేను మిమ్మును స్థాపింతును, పెల్లగింపక నాటెదను.
- Daniel 9:7 దానియేలు 9:7ప్రభువా, నీవే నీతిమంతుడవు; మేమైతే సిగ్గుచేత ముఖవికారమొందినవారము; మేము నీమీద తిరుగుబాటు చేసితివిు; దానినిబట్టి నీవు సకల దేశములకు మమ్మును తరిమితివి, యెరూషలేములోను యూదయ దేశము లోను నివసించుచు స్వదేశవాసులుగా ఉన్నట్టియు, పర దేశవాసులుగా ఉన్నట్టియు ఇశ్రాయేలీయులందరికిని మాకును ఈ దినమున సిగ్గే తగియున్నది.
- Deuteronomy 28:25 ద్వితీయోపదేశకాండము 28:25యెహోవా నీ శత్రువుల యెదుట నిన్ను ఓడించును. ఒక్కమార్గ మున వారి యెదుటికి బయలుదేరి నీవు యేడు మార్గముల వారి యెదుటనుండి పారిపోయి, భూరాజ్యములన్నిటి లోనికి యిటు అటు చెదరగొట్ట బడుదువు.
- Deuteronomy 6:24 ద్వితీయోపదేశకాండము 6:24మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటివలె మనలను బ్రదికించు నట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి యీ కట్టడల నన్నిటిని గైకొనవలెనని మన కాజ్ఞాపించెను.
- 2 Kings 17:23 2 రాజులు 17:23తన సేవకులైన ప్రవక్తలద్వారా యెహోవా సెల విచ్చిన మాటచొప్పున, ఆయన ఇశ్రాయేలువారిని తన సముఖములోనుండి వెళ్లగొట్టెను. ఆ హేతువుచేత వారు తమ స్వదేశములోనుండి అష్షూరు దేశ ములోనికి చెరగొని పోబడిరి; నేటివరకు వారచ్చట ఉన్నారు.
- Deuteronomy 28:64 ద్వితీయోపదేశకాండము 28:64దేశముయొక్క యీ కొనమొదలు కొని ఆ కొనవరకును సమస్తజనములలోనికి యెహోవా నిన్ను చెదరగొట్టును. అక్కడ నీవైనను నీ పితరులైనను ఎరుగని కొయ్యవియు రాతివియునైన అన్యదేవతలను పూజింతువు.
- Deuteronomy 28:36 ద్వితీయోపదేశకాండము 28:36యెహోవా నిన్నును నీవు నీమీద నియమించు కొను నీ రాజును, నీవేగాని నీ పితరులేగాని యెరుగని జనమున కప్పగించును. అక్కడ నీవు కొయ్యదేవతలను రాతిదేవతలను పూజించెదవు
- Luke 21:23–24 లూకా 21:23–24ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చువారికిని శ్రమ. భూమిమీద మిక్కిలి యిబ్బందియు ఈ ప్రజలమీద కోపమును వచ్చును. వారు కత్తివాత కూలుదురు; చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనముల మధ్యకు పోవుదురు; అన్యజనముల కాలములు సంపూర్ణమగువరకు యెరూష లేము అన్యజనములచేత త్రొక్కబడును.