Deuteronomy · chapter 4 · verse 14
Deuteronomy 4:14 in Telugu
అప్పుడు మీరు నదిదాటి స్వాధీన పరచుకొనబోవు దేశములో మీరు అనుసరింప వలసిన కట్టడ లను విధులను మీకు నేర్పవలెనని యెహోవా నా కాజ్ఞాపించెను.
Appudu meeru nadidaati svaadheena parachukonabovu deshamulo meeru anusarimpa valasina kattada lanu vidhulanu meeku nerpavalenani yehovaa naa kaajnyaapinchenu.
Deuteronomy 4:14 in English
- King James Version (KJV)
- And the LORD commanded me at that time to teach you statutes and judgments, that ye might do them in the land whither ye go over to possess it.
- World English Bible (WEB)
- The LORD commanded me at that time to teach you statutes and ordinances, that you might do them in the land where you go over to possess it.
- American Standard Version (ASV)
- And Jehovah commanded me at that time to teach you statutes and ordinances, that ye might do them in the land whither ye go over to possess it.
- Bible in Basic English (BBE)
- And the Lord gave me orders at that time to make clear to you these laws and decisions, so that you might do them in the land to which you are going, and which is to be your heritage.
- Darby Translation (DBY)
- And Jehovah commanded me at that time to teach you statutes and ordinances, that ye might do them in the land whither ye are passing over to possess it.
- Webster's Bible (WBS)
- And the LORD commanded me at that time to teach you statutes and judgments, that ye might do them in the land whither ye go over to possess it.
- Young's Literal Translation (YLT)
- 'And me hath Jehovah commanded at that time to teach you statutes and judgments, for your doing them in the land whither ye are passing over to possess it;
Read in context
- 12యెహోవా ఆ అగ్ని మధ్యనుండి మీతో మాటలాడెను. మాటలధ్వని మీరు వింటిరిగాని యే స్వరూపమును మీరు చూడలేదు, స్వరము మాత్రమే వింటిరి.
- 13మరియు మీరు చేయవలెనని ఆయన విధించిన నిబంధనను, అనగా పది ఆజ్ఞలను మీకు తెలియజేసి రెండు రాతి పలకలమీద వాటిని వ్రాసెను.
- 14అప్పుడు మీరు నదిదాటి స్వాధీన పరచుకొనబోవు దేశములో మీరు అనుసరింప వలసిన కట్టడ లను విధులను మీకు నేర్పవలెనని యెహోవా నా కాజ్ఞాపించెను.
- 15హోరేబులో యెహోవా అగ్నిజ్వాలల మధ్య నుండి మీతో మాటలాడిన దినమున మీరు ఏ స్వరూప మును చూడలేదు.
- 16కావున మీరు చెడిపోయి భూమి మీదనున్న యే జంతువు ప్రతిమనైనను
Cross references
- Ezekiel 21:1–23 యెహెజ్కేలు 21:1–23అప్పుడు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను నరపుత్రుడా, యెరూషలేము తట్టు నీ ముఖము త్రిప్పుకొని, పరిశుద్ధ స్థలములనుబట్టి ఇశ్రాయేలీయులదేశమును గూర్చి ప్రవచించి ఇట్లనుము యెహోవా సెలవిచ్చునదేమనగా నేను నీకు విరోధినై తిని. నీతిపరులనేమి దుష్టులనేమి నీలో ఎవరు నుండకుండ అందరిని నిర్మూలము చేయుటకై నా ఖడ్గము ఒరదూసి యున్నాను. నీతిపరులేమి దుష్టులేమి యెవరును మీలో ఉండకుండ దక్షిణదిక్కు మొదలుకొని ఉత్తరదిక్కువరకు అందరిని నిర్మూలము చేయుటకై నా ఖడ్గము దాని ఒరలో నుండి బయలుదేరియున్నది. యెహోవానైన నేను నా ఖడ్గము మరల ఒరలోపడకుండ దాని దూసియున్నానని జనులందరు తెలిసికొందురు. కావున నరపుత్రుడా, నిట్టూర్పు విడువుము, వారు చూచుచుండగా నీ నడుము బద్దలగునట్లు మనోదుఃఖముతో నిట్టూర్పు విడువుము. నీవు నిట్టూర్పు విడిచెదవేమని వారు నిన్నడుగగా నీవుశ్రమదినము వచ్చుచున్నదను దుర్వార్త నాకు వినబడినది, అందరి గుండెలు కరిగిపోవును, అందరి చేతులు బల హీనమవును, అందరి మనస్సులు అధైర్యపడును, అందరి మోకాళ్లు నీరవును, ఇంతగా కీడు వచ్చుచున్నది; అది వచ్చేయున్నది అని చెప్పుము; ఇదే యెహోవా వాక్కు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, నీవు ఈ మాటలు ప్రకటనచేసి ఇట్లనుము యెహోవా సెలవిచ్చునదేమనగా అదిగో ఖడ్గము ఖడ్గమే కనబడుచున్నది, అది పదునుగలదై మెరుగుపెట్టియున్నది. అది గొప్ప వధ చేయుటకై పదును పెట్టియున్నది, తళతళలాడునట్లు అది మెరుగుపెట్టియున్నది; ఇట్లుండగా నా కుమారుని దండము ఇతర దండములన్నిటిని తృణీకరించునది అని చెప్పి మనము సంతోషించెదమా? మరియు దూయుటకు సిద్ధమగునట్లు అది మెరుగుపెట్టువానియొద్ద నుంచ బడియుండెను, హతము చేయువాడు పట్టుకొనునట్లుగా అది పదునుగలదై మెరుగు పెట్టబడియున్నది. నరపుత్రుడా అంగలార్చుము, కేకలువేయుము, అది నా జనులమీదికిని ఇశ్రాయేలీయుల ప్రధానులమీదికిని వచ్చుచున్నది, ఖడ్గభయము నా జనులకు తటస్థించినది గనుక నీ తొడను చరచుకొనుము. శోధనకలిగెను, తృణీకరించు దండము రాకపోయిననేమి? ఇదే యెహోవా వాక్కు. నరపుత్రుడా, చేతులు చరచుకొనుచు సమాచారము ప్రవచింపుము, ఖడ్గము ముమ్మారు రెట్టింపబడినదై జనులను హతముచేయునదై యున్నది, అది గొప్పవాని అంతఃపురము చొచ్చి వాని హతము చేయునది. వారి గుండెలు కరిగిపోవునట్లును, పడద్రోయు అడ్డములు అధికములగునట్లును, వారి గుమ్మములలో నేను ఖడ్గము దూసెదను; అయ్యయ్యో అది తళతళలాడుచున్నది, హతము చేయుటకై అది దూయబడియున్నది. ఖడ్గమా, సిద్ధపడియుండుము; కుడివైపు చూడుము, ఎడమవైపు తిరుగుము, ఎక్కడ నీకు పని యుండునో అక్కడికి తిరుగుము నేనుకూడ నా చేతులు చరచుకొని నా క్రోధము తీర్చుకొందును; యెహోవా నగు నేనే మాట ఇచ్చి యున్నాను. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, బబులోను రాజు ఖడ్గమువచ్చుటకు రెండు మార్గములను ఏర్పరచుము. ఆరెండును ఒక దేశములోనుండి వచ్చునట్లు సూచించుటకై యొక హస్తరూపము గీయుము, పట్టణపు వీధి కొనను దాని గీయుము. ఖడ్గమునకు అమ్మోనీయుల పట్టణమగు రబ్బాకు ఒక మార్గమును, యూదాదేశమందున్న ప్రాకారములు గల పట్టణమగు యెరూషలేమునకు ఒక మార్గమును ఏర్పరచుము. బాటలు చీలుచోట రెండు మార్గములు చీలు స్థలమున శకునము తెలిసికొనుటకు బబులోను రాజు నిలుచుచున్నాడు; అతడు బాణములను ఇటు అటు ఆడించుచు, విగ్రహములచేత విచారణ చేయుచు, కార్యమునుబట్టి శకునము చూచుచున్నాడు. యెరూషలేము ఎదుట గుమ్మములను పడగొట్టు యంత్ర ములు పెట్టుమనియు, హతముచేయుదమనియు, ధ్వని ఎత్తుమనియు, జయధ్వని బిగ్గరగా ఎత్తుమనియు, గుమ్మ ములకు ఎదురుగా పడగొట్టు యంత్రములు ఉంచు మనియు, దిబ్బలు వేయుమనియు, ముట్టడి దిబ్బలు కట్టు మనియు యెరూషలేమునుగూర్చి తన కుడితట్టున శకునము కనబడెను. ప్రమాణములు చేసికొనిన వారికి ఈ శకునము వ్యర్థముగా కనబడును; అయితే వారు పట్టబడునట్లు వారు చేసికొనిన పాపమును అతడు వారి జ్ఞాపకమునకు తెప్పించును.
- Psalm 105:44–45 కీర్తనలు 105:44–45వారు తన కట్టడలను గైకొనునట్లును తన ధర్మశాస్త్రవిధులను ఆచరించునట్లును అన్యజనుల భూములను ఆయన వారికప్పగించెను జనముల కష్టార్జితమును వారు స్వాధీనపరచుకొనిరి. యెహోవాను స్తుతించుడి.