Deuteronomy · chapter 5 · verse 6
Deuteronomy 5:6 in Telugu
దాసుల గృహమైన ఐగుప్తుదేశములోనుండి నిన్ను రప్పించిన నీ దేవుడనైన యెహోవాను నేనే.
Daasula gruhamaina aiguptudeshamulonundi ninnu rappinchina nee devudanaina yehovaanu nene.
Deuteronomy 5:6 in English
- King James Version (KJV)
- I [am] the LORD thy God, which brought thee out of the land of Egypt, from the house of bondage.
- World English Bible (WEB)
- “I am the LORD your God, who brought you out of the land of Egypt, out of the house of bondage.
- American Standard Version (ASV)
- I am Jehovah thy God, who brought thee out of the land of Egypt, out of the house of bondage.
- Bible in Basic English (BBE)
- I am the Lord your God, who took you out of the land of Egypt, out of the prison-house.
- Darby Translation (DBY)
- I am Jehovah thy God who have brought thee out of the land of Egypt, out of the house of bondage.
- Webster's Bible (WBS)
- I [am] the LORD thy God, who brought thee out of the land of Egypt, from the house of bondage.
- Young's Literal Translation (YLT)
- 'I Jehovah [am] thy God, who hath brought thee out from the land of Egypt, from a house of servants.
Read in context
- 4యెహోవా ఆ కొండ మీద అగ్ని మధ్యనుండి ముఖాముఖిగా మీతో మాటలాడగా మీరు ఆ అగ్నికి భయపడి ఆ కొండ యెక్కలేదు.
- 5గనుక యెహోవామాట మీకు తెలియ జేయుటకు నేను యెహోవాకును మీకును మధ్యను నిలిచి యుండగా యెహోవా ఈలాగున సెలవిచ్చెను.
- 6దాసుల గృహమైన ఐగుప్తుదేశములోనుండి నిన్ను రప్పించిన నీ దేవుడనైన యెహోవాను నేనే.
- 7నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు.
- 8పైనున్న ఆకాశమందే గాని, క్రిందనున్న భూమి యందే గాని భూమి క్రిందనున్న నీళ్లయందే గాని యుండు దేని పోలికనైన విగ్రహమును చేసికొనకూడదు.
Cross references
- Exodus 20:2–17 నిర్గమకాండము 20:2–17నీ దేవుడనైన యెహోవాను నేనే; నేనే దాసుల గృహమైన ఐగుప్తుదేశములోనుండి నిన్ను వెలుపలికి రప్పించితిని; నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమిక్రింద నీళ్లయందేగాని యుండు దేని రూపము నయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషముగల దేవుడను; నన్ను ద్వేషించువారి విషయములో మూడు నాలుగు తరముల వరకు, తండ్రుల దోషమును కుమారులమీదికి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొనువారిని వెయ్యి తరములవరకు కరుణించు వాడనై యున్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు; యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపక ముంచుకొనుము. ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను ఏడవ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతిదినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెయైనను నీ దాసుడైనను నీ దాసియైనను నీ పశువైనను నీ యిండ్లలో నున్న పరదేశి యైనను ఏపనియు చేయ కూడదు. ఆరు దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి, యేడవ దినమున విశ్రమించెను; అందుచేత యెహోవా విశ్రాంతిదినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను. నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు. వ్యభిచరింపకూడదు. దొంగిలకూడదు. నీ పొరుగువానిమీద అబద్ధసాక్ష్యము పలుకకూడదు. నీ పొరుగువాని యిల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని యెద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను.
- Psalm 81:5–10 కీర్తనలు 81:5–10ఆయన ఐగుప్తు దేశసంచారము చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దానిని నియమించెను. అక్కడ నేనెరుగని భాష వింటిని. వారి భుజమునుండి నేను బరువును దింపగా వారి చేతులు మోతగంపల నెత్తకుండ విడుదలపొందెను. ఆపత్కాలమునందు నీవు మొఱ్ఱపెట్టగా నేను నిన్ను విడిపించితిని ఉరుము దాగు చోటులోనుండి నీకు ఉత్తరమిచ్చితిని మెరీబా జలములయొద్ద నిన్ను శోధించితిని. (సెలా. ) నా ప్రజలారా, ఆలంకిపుడి నేను మీకు సంగతి తెలియజేతును అయ్యో ఇశ్రాయేలూ, నీవు మా మాట వినినయెడల ఎంత మేలు! అన్యుల దేవతలలో ఒకటియును నీలో ఉండకూడదు అన్యుల దేవతలలో ఒకదానికిని నీవు పూజచేయ కూడదు. ఐగుప్తీయుల దేశములోనుండి నిన్ను రప్పించిన నీ దేవుడనగు యెహోవాను నేనే నీ నోరు బాగుగా తెరువుము నేను దాని నింపెదను.
- Deuteronomy 4:4 ద్వితీయోపదేశకాండము 4:4మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరును నేటివరకు సజీవులై యున్నారు.
- Leviticus 26:1–2 లేవీయకాండము 26:1–2మీరు విగ్రహములను చేసికొనకూడదు. చెక్కిన ప్రతిమనుగాని బొమ్మనుగాని నిలువపెట్టకూడదు. మీరు సాగిలపడుటకు ఏదొక రూపముగా చెక్కబడిన రాతిని మీ దేశములో నిలుపకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను, నా పరిశుద్ధమందిరమును సన్మానింప వలెను, నేను యెహోవాను.