Esther · chapter 5 · verse 10
Esther 5:10 in Telugu
అయితే హామాను కోపము అణచుకొని తన యింటికిపోయి తనస్నేహితులను తన భార్యయైన జెరెషును పిలిపించి
Ayite haamaanu kopamu anachukoni tana yintikipoyi tanasnehitulanu tana bhaaryayaina jereshunu pilipinchi
Esther 5:10 in English
- King James Version (KJV)
- Nevertheless Haman refrained himself: and when he came home, he sent and called for his friends, and Zeresh his wife.
- World English Bible (WEB)
- Nevertheless Haman restrained himself, and went home. There, he sent and called for his friends and Zeresh his wife.
- American Standard Version (ASV)
- Nevertheless Haman refrained himself, and went home; and he sent and fetched his friends and Zeresh his wife.
- Bible in Basic English (BBE)
- But controlling himself, he went to his house; and he sent for his friends and Zeresh, his wife.
- Darby Translation (DBY)
- But Haman controlled himself, and came home; and he sent and called for his friends, and Zeresh his wife.
- Webster's Bible (WBS)
- Nevertheless, Haman refrained himself: and when he came home, he sent and called for his friends, and Zeresh his wife.
- Young's Literal Translation (YLT)
- And Haman forceth himself, and cometh in unto his house, and sendeth, and bringeth in his friends, and Zeresh his wife,
Read in context
- 8రాజవైన తామును హామానును మీ నిమిత్తము నేను చేయింపబోవు విందునకు రావలెను. రాజవైన తాము చెప్పినట్లు రేపటి దినమున నేను చేయుదును; ఇదే నా మనవియు నా కోరికయు ననెను.
- 9ఆ దినమందు హామాను సంతోషించి మనోల్లాసముగలవాడై బయలువెళ్లి, రాజుగుమ్మముననుండు మొర్దెకై తన్ను చూచియు అతడు లేచి నిలువకయు కదలకయు ఉన్నం దున మొర్దెకై మీద బహుగా కోపగించెను.
- 10అయితే హామాను కోపము అణచుకొని తన యింటికిపోయి తనస్నేహితులను తన భార్యయైన జెరెషును పిలిపించి
- 11తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యమును గూర్చియు, చాలామంది పిల్లలు తనకుండుటను గూర్చియు, రాజు తన్ను ఘనపరచి రాజు క్రిందనుండు అధిపతులమీదను సేవకులమీదను తన్ను ఏలాగున పెద్దగా చేసెనో దానిని గూర్చియు వారితో మాటలాడెను.
- 12మరియు అతడు రాణియైన ఎస్తేరు తాను చేయించిన విందునకు రాజును నన్ను తప్ప మరి యెవనిని పిలిపించలేదు, రేపటి దినమున కూడ రాజుతో కలిసి విందునకు రమ్మని నాకు సెలవైనదని తెలియజేసెను.
Cross references
- Esther 6:13 ఎస్తేరు 6:13హామాను తనకు సంభవించినదంతయు తన భార్యయైన జెరెషుకును తన స్నేహితులకందరికిని తెలుపగా, అతని యొద్దనున్న జ్ఞానులును అతని భార్యయైన జెరెషును ఎవనిచేత నీకు అధికార నష్టము కలుగుచున్నదో ఆ మొర్దెకై యూదుల వంశపువాడైనయెడల అతనిమీద నీకు జయము కలుగదు, అతనిచేత అవశ్యముగా చెడిపోదువని ఆతనితో అనిరి.
- Ecclesiastes 7:9 ప్రసంగి 7:9ఆత్రపడి కోపపడవద్దు; బుద్ధిహీనుల అంత రింద్రియములందు కోపము సుఖనివాసము చేయును.
- Genesis 45:1 ఆదికాండము 45:1అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచినవారందరి యెదుట తన్ను తాను అణచుకొనజాలక నా యొద్దనుండి ప్రతి మనుష్యుని వెలుపలికి పంపి వేయుడని బిగ్గరగా చెప్పెను. యోసేపు తన సహోదరులకు తన్ను తాను తెలియ చేసికొనినప్పుడు ఎవరును అతని యొద్ద నిలిచియుండలేదు.
- 2 Samuel 13:22–23 2 సమూయేలు 13:22–23అబ్షాలోము తన అన్నయగు అమ్నోనుతో మంచి చెడ్డ లేమియు మాటలాడక ఊరకుండెను గాని, తన సహోదరియగు తామారును బలవంతము చేసి నందుకై అతనిమీద పగయుంచెను. రెండు సంవత్సరములైన తరువాత ఎఫ్రాయిమునకు సమీపమందుండు బయల్దాసోరులో అబ్షాలోము గొఱ్ఱెల బొచ్చు కత్తిరించుకాలము రాగా అబ్షాలోము రాజకుమారుల నందరిని విందునకు పిలిచెను.
- Genesis 43:30–31 ఆదికాండము 43:30–31అప్పుడు తన తమ్మునిమీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చెను గనుక అతడు త్వరపడి యేడ్చుటకు చోటు వెదకి లోపలి గదిలోనికి వెళ్లి అక్కడ ఏడ్చెను. అప్పుడు అతడు ముఖము కడుగుకొని వెలుపలికి వచ్చి తన్ను తాను అణచుకొని, భోజనము వడ్డించుడని చెప్పెను.