Esther · chapter 5 · verse 14
Esther 5:14 in Telugu
అతని భార్యయైన జెరెషును అతని స్నేహితులందరును ఏబది మూరల ఎత్తుగల యొక ఉరికొయ్య చేయించుము; దాని మీద మొర్దెకై ఉరి తీయింపబడునట్లు రేపు నీవు రాజుతో మనవి చేయుము; తరువాత నీవు సంతోషముగా రాజుతో కూడ విందునకు పోదువు అని అతనితో చెప్పిరి. ఈ సంగతి హామానునకు యుక్తముగా కనబడినందున అతడు ఉరికొయ్య యొకటి సిద్ధము చేయించెను.
Atani bhaaryayaina jereshunu atani snehitulandarunu ebadi moorala ettugala yoka urikoyya cheyinchumu; daani meeda mordekai uri teeyimpabadunatlu repu neevu raajuto manavi cheyumu; taruvaata neevu santoshamugaa raajuto kooda vindunaku poduvu ani atanito cheppiri. Ee sangati haamaanunaku yuktamugaa kanabadinanduna atadu urikoyya yokati siddhamu cheyinchenu.
Esther 5:14 in English
- King James Version (KJV)
- Then said Zeresh his wife and all his friends unto him, Let a gallows be made of fifty cubits high, and to morrow speak thou unto the king that Mordecai may be hanged thereon: then go thou in merrily with the king unto the banquet. And the thing pleased Haman; and he caused the gallows to be made.
- World English Bible (WEB)
- Then Zeresh his wife and all his friends said to him, “Let a gallows be made fifty cubits high, and in the morning speak to the king about hanging Mordecai on it. Then go in merrily with the king to the banquet.” This pleased Haman, so he had the gallows made.
- American Standard Version (ASV)
- Then said Zeresh his wife and all his friends unto him, Let a gallows be made fifty cubits high, and in the morning speak thou unto the king that Mordecai may be hanged thereon: then go thou in merrily with the king unto the banquet. And the thing pleased Haman; and he caused the gallows to be made.
- Bible in Basic English (BBE)
- Then his wife Zeresh and all his friends said to him, Let a pillar, fifty cubits high, be made ready for hanging him, and in the morning get the king to give orders for the hanging of Mordecai: then you will be able to go to the feast with the king with a glad heart. And Haman was pleased with the suggestion, and he had the pillar made.
- Darby Translation (DBY)
- Then said Zeresh his wife and all his friends to him, Let a gallows be made of fifty cubits high, and in the morning speak to the king that Mordecai may be hanged on it: then go in merrily with the king to the banquet. And the thing pleased Haman; and he caused the gallows to be made.
- Webster's Bible (WBS)
- Then said Zeresh his wife and all his friends to him, Let a gallows be made fifty cubits high, and to-morrow speak thou to the king that Mordecai may be hanged upon it: then go thou in merrily with the king to the banquet. And the thing pleased Haman; and he caused the gallows to be made.
- Young's Literal Translation (YLT)
- And Zeresh his wife saith to him, and all his friends, 'Let them prepare a tree, in height fifty cubits, and in the morning speak to the king, and they hang Mordecai on it, and go thou in with the king unto the banquet rejoicing;' and the thing is good before Haman, and he prepareth the tree.
Read in context
- 12మరియు అతడు రాణియైన ఎస్తేరు తాను చేయించిన విందునకు రాజును నన్ను తప్ప మరి యెవనిని పిలిపించలేదు, రేపటి దినమున కూడ రాజుతో కలిసి విందునకు రమ్మని నాకు సెలవైనదని తెలియజేసెను.
- 13అయితే యూదుడైన మొర్దెకై రాజుగుమ్మమున కూర్చునియుండుట నేను చూచునంత కాలము ఆ పదవి అంతటివలన నాకు ప్రయోజనమేమియు లేదని అతడు చెప్పగా
- 14అతని భార్యయైన జెరెషును అతని స్నేహితులందరును ఏబది మూరల ఎత్తుగల యొక ఉరికొయ్య చేయించుము; దాని మీద మొర్దెకై ఉరి తీయింపబడునట్లు రేపు నీవు రాజుతో మనవి చేయుము; తరువాత నీవు సంతోషముగా రాజుతో కూడ విందునకు పోదువు అని అతనితో చెప్పిరి. ఈ సంగతి హామానునకు యుక్తముగా కనబడినందున అతడు ఉరికొయ్య యొకటి సిద్ధము చేయించెను.
Cross references
- Esther 6:4 ఎస్తేరు 6:4అప్పుడు ఆవరణములో ఎవరో యున్నారని రాజు చెప్పెను. అప్పటికి హామాను తాను చేయించిన ఉరికొయ్యమీద మొర్దెకైని ఉరితీయింప సెలవిమ్మని రాజుతో మనవి చేయుటకై రాజనగరుయొక్క ఆవరణము లోనికి వచ్చియుండెను.
- Psalm 37:32 కీర్తనలు 37:32భక్తిహీనులు నీతిమంతులకొరకు పొంచియుండి వారిని చంపజూతురు.
- 1 Kings 21:7 1 రాజులు 21:7అందు కతని భార్యయైన యెజెబెలుఇశ్రాయేలులో నీవిప్పుడు రాజ్యపరిపాలనము చేయుటలేదా? లేచి భోజనము చేసి మనస్సులో సంతోషముగా ఉండుము; నేనే యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్షతోట నీకిప్పించెదనని అతనితో చెప్పి
- Psalm 37:14 కీర్తనలు 37:14దీనులను దరిద్రులను పడద్రోయుటకై యథార్థముగా ప్రవర్తించువారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసియున్నారు విల్లెక్కుపెట్టి యున్నారు
- Esther 7:9–10 ఎస్తేరు 7:9–10రాజు ముందర నుండు షండులలో హర్బోనా అనునొకడుఏలినవాడా చిత్తగించుము, రాజు మేలుకొరకు మాటలాడిన మొర్దెకైని ఉరితీయుటకు హామాను చేయించిన యేబది మూరల యెత్తు గల ఉరికొయ్య హామాను ఇంటియొద్ద నాటబడియున్న దనగా రాజుదానిమీద వాని ఉరితీయుడని ఆజ్ఞ ఇచ్చెను. కాగా హామాను మొర్దెకైకి సిద్ధముచేసిన ఉరి కొయ్యమీద వారు అతనినే ఉరితీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను.
- Acts 23:14–15 అపొస్తలుల కార్యములు 23:14–15వారు ప్రధానయాజకుల యొద్దకును పెద్దలయొద్దకును వచ్చి మేము పౌలును చంపువరకు ఏమియు రుచి చూడమని గట్టిగ ఒట్టుపెట్టుకొని యున్నాము. కాబట్టి మీరు మహాసభతో కలిసి, అతనినిగూర్చి మరి పూర్తిగా విచారించి తెలిసికొనబోవునట్టు అతనిని మీ యొద్దకు తీసికొని రమ్మని సహస్రాధిపతితో మనవిచేయుడి; అతడు దగ్గరకు రాకమునుపే మేమతని చంపుటకు సిద్ధపడియున్నామని చెప్పిరి.
- Psalm 7:13–16 కీర్తనలు 7:13–16వానికొరకు మరణసాధనములను సిద్ధపరచియున్నాడు తన అంబులను అగ్ని బాణములుగా చేసియున్నాడు పాపమును కనుటకు వాడు ప్రసవవేదన పడుచున్నాడుచేటును గర్భమున ధరించినవాడై అబద్దమును కని యున్నాడు. వాడు గుంటత్రవ్వి దానిని లోతుచేసియున్నాడుతాను త్రవ్విన గుంటలో తానేపడిపోయెను. వాడు తలంచిన చేటు వాని నెత్తిమీదికే వచ్చునువాడు యోచించిన బలాత్కారము వాని నడినెత్తి మీదనే పడును.
- 2 Samuel 13:3–5 2 సమూయేలు 13:3–5అమ్నోనునకు మిత్రుడొకడుండెను. అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు, అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటముగలవాడు. అతడు రాజకుమారుడవైన నీవు నానాటికి చిక్కిపోవుటకు హేతువేమి? సంగతి నాకు తెలియజెప్పవా అని అమ్నోనుతో అనగా అమ్నోనునా తమ్ముడగు అబ్షాలోము సహోదరియైన తామారును నేను మోహించియున్నానని అతనితో అనెను. యెహోనాదాబునీవు రోగివైనట్టువేషము వేసికొని నీ మంచముమీద పండుకొనియుండుము. నీ తండ్రి నిన్ను చూచుటకు వచ్చినప్పుడు నీవునా చెల్లెలైన తామారుచేత సిద్ధపరచబడిన భోజనము నేను భుజించునట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా దానిని సిద్ధము చేసి నాకు పెట్టునట్లు సెలవిమ్మని అడుగుమని అతనికి బోధింపగా అమ్నోను పడకమీద పండుకొనెను.
- Esther 3:8–15 ఎస్తేరు 3:8–15అంతట హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా మీ రాజ్య సంస్థా నములన్నిటియందుండు జనులలో ఒక జాతివారు చెదరి యున్నారు; వారి విధులు సకలజనుల విధులకు వేరుగా ఉన్నవి; వారు రాజుయొక్క ఆజ్ఞలను గైకొనువారు కారు; కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు. రాజునకు సమ్మతియైతే వారు హతము చేయబడునట్లును, నేను ఆ పనిచేయువారికి ఇరువదివేల మణుగుల వెండిని రాజుయొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించునట్లును, చట్టము పుట్టించుమనగా రాజు తనచేతి ఉంగరము తీసి దానిని హమ్మెదాతా కుమారుడైన అగాగీయుడగు హామానున కిచ్చి ఆ వెండి నీ కియ్య బడియున్నది;నీ దృష్టికి ఏది అనుకూలమో అది ఆ జను లకు చేయునట్లుగా వారును నీకు అప్పగింపబడి యున్నారని రాజు సెలవిచ్చెను. ఈ హామాను యూదులకు శత్రువు. మొదటి నెల పదమూడవ దినమందు రాజుయొక్క వ్రాతగాండ్రు పిలువబడిరి; హామాను ఆజ్ఞాపించిన ప్రకారము అంతయు ఆ యా సంస్థానములమీద నుంచ బడిన రాజుయొక్క అధిపతులకును అధికారులకును, ఆ యా సంస్థానములలోని జనములమీద నుంచబడిన అధి పతులకును అధికారులకును, వారి వారి లిపినిబట్టియు, ఆ యా జనములభాషను బట్టియు, రాజైన అహష్వేరోషు పేరట ఆ వ్రాతగాండ్రచేత తాకీదులు వ్రాయింపబడి రాజు ఉంగరముచేత ముద్రింపబడెను. అదారు అను పండ్రెండవ నెల పదమూడవ దినమందు ¸యౌవనుల నేమి వృద్ధులనేమి శిశువుల నేమి స్త్రీల నేమి యూదుల నందరిని ఒక్కదినమందే బొత్తిగా నిర్మూలము చేసి వారి సొమ్ము కొల్లపుచ్చు కొమ్మని తాకీదులు అంచెవారిచేత రాజ్య సంస్థానములన్నిటికిని పంపబడెను. మరియు ఒకానొక దినమునకు వారు సిద్ధపడవలెనను ఆ ఆజ్ఞకు ఒక ప్రతి ప్రబలింపబడినదై ప్రతి సంస్థానములోనున్న సమస్త జనులకు ఇయ్యబడుటకు పంపబడెను. అంచెవారు రాజాజ్ఞ చేత త్వరపెట్టబడి బయలువెళ్లిరి. ఆ యాజ్ఞ షూషను కోటలో ఇయ్యబడెను, దాని విని షూషను పట్టణము కలతపడెను. అంతట రాజును హామానును విందుకు కూర్చుండిరి.
- 1 Kings 21:25 1 రాజులు 21:25తన భార్యయైన యెజెబెలు ప్రేరేపణచేత యెహోవా దృష్టికి కీడుచేయ తన్ను తాను అమ్ముకొనిన అహాబువంటి వాడు ఎవ్వడును లేడు.
- Proverbs 4:16 సామెతలు 4:16అట్టివారు కీడుచేయనిది నిద్రింపరు ఎదుటివారిని పడద్రోయనిది వారికి నిద్రరాదు.
- Mark 14:10–11 మార్కు 14:10–11పండ్రెండుమందిలో నొకడగు ఇస్కరియోతు యూదా, ప్రధానయాజకుల చేతికి ఆయనను అప్పగింప వలెనని వారియొద్దకు పోగా వారు విని, సంతోషించి వానికి ద్రవ్యమిత్తుమని వాగ్దానము చేసిరి గనుక వాడు ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టు చుండెను.
Original words (Hebrew)
- said · H559אָמַר ʼâmar
- Zeresh · H2238זֶרֶשׁ Zeresh
- wife · H802אִשָּׁה ʼishshâh
- friends · H157אָהַב ʼâhab
- gallows · H6086עֵץ ʻêts
- made · H6213עָשָׂה ʻâsâh
- fifty · H2572חֲמִשִּׁים chămishshîym
- cubits · H520אַמָּה ʼammâh
- high · H1364גָּבֹהַּ gâbôahh
- morrow · H1242בֹּקֶר bôqer
- speak · H559אָמַר ʼâmar
- king · H4428מֶלֶךְ melek
- Mordecai · H4782מׇרְדְּכַי Mordᵉkay
- hanged · H8518תָּלָה tâlâh
- go · H935בּוֹא bôwʼ
- merrily · H8056שָׂמֵחַ sâmêach
- king · H4428מֶלֶךְ melek
- banquet · H4960מִשְׁתֶּה mishteh
- thing · H1697דָּבָר dâbâr
- pleased · H3190יָטַב yâṭab
- Haman · H2001הָמָן Hâmân
- caused · H6213עָשָׂה ʻâsâh
- gallows · H6086עֵץ ʻêts
- made · H6213עָשָׂה ʻâsâh