Exodus · chapter 10 · verse 9
Exodus 10:9 in Telugu
అందుకు మోషే - మేము యెహోవాకు పండుగ ఆచరింపవలెను గనుక మా కుమారులను మా కుమార్తెలను మా మందలను మా పశువులను వెంటబెట్టుకొని మా పిన్న పెద్దలతోకూడ వెళ్లెద మనెను.
Anduku moshe - memu yehovaaku panduga aacharimpavalenu ganuka maa kumaarulanu maa kumaartelanu maa mandalanu maa pashuvulanu ventabettukoni maa pinna peddalatokooda velleda manenu.
Exodus 10:9 in English
- King James Version (KJV)
- And Moses said, We will go with our young and with our old, with our sons and with our daughters, with our flocks and with our herds will we go; for we [must hold] a feast unto the LORD.
- World English Bible (WEB)
- Moses said, “We will go with our young and with our old. We will go with our sons and with our daughters, with our flocks and with our herds; for we must hold a feast to the LORD.”
- American Standard Version (ASV)
- And Moses said, We will go with our young and with our old; with our sons and with our daughters, with our flocks and with our herds will we go; for we must hold a feast unto Jehovah.
- Bible in Basic English (BBE)
- And Moses said, We will go with our young and our old, with our sons and our daughters, with our flocks and our herds; for we are to keep a feast to the Lord.
- Darby Translation (DBY)
- And Moses said, We will go with our young and with our old, with our sons and with our daughters; with our flocks and with our herds will we go; for we have a feast of Jehovah.
- Webster's Bible (WBS)
- And Moses said, We will go with our young and with our old, with our sons and with our daughters, with our flocks and with our herds will we go; for we [must hold] a feast to the LORD.
- Young's Literal Translation (YLT)
- And Moses saith, 'With our young ones, and with our aged ones, we go, with our sons, and with our daughters, with our flock, and our herd, we go, for we have a festival to Jehovah.'
Read in context
- 7అప్పుడు ఫరో సేవకులు అతని చూచి - ఎన్నాళ్లవరకు వీడు మనకు ఉరిగా నుండును? తమ దేవుడైన యెహోవాను సేవించుటకు ఈ మనుష్యులను పోనిమ్ము; ఐగుప్తుదేశము నశించినదని నీకింకా తెలియదా అనిరి.
- 8మోషే అహరోనులు ఫరోయొద్దకు మరల రప్పింపబడగా అతడుమీరు వెళ్లి మీ దేవుడైన యెహోవాను సేవించుడి; అందుకు ఎవరెవరు వెళ్లుదురని వారి నడిగెను.
- 9అందుకు మోషే - మేము యెహోవాకు పండుగ ఆచరింపవలెను గనుక మా కుమారులను మా కుమార్తెలను మా మందలను మా పశువులను వెంటబెట్టుకొని మా పిన్న పెద్దలతోకూడ వెళ్లెద మనెను.
- 10అందు కతడు - యెహోవా మీకు తోడై యుండునా? నేను మిమ్మును మీ పిల్లలను పోనిచ్చెదనా? ఇదిగో మీరు దురాలోచన గలవారు.
- 11పురుషులైన మీరు మాత్రము వెళ్లి యెహోవాను సేవించుడి; మీరు కోరినది అదే గదా అని వారితో అనగా ఫరో సముఖమునుండి వారు వెళ్లగొట్టబడిరి.
Cross references
- 1 Corinthians 5:7–8 1 కొరింథీయులకు 5:7–8మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్తముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసిపారవేయుడి. ఇంతే కాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండ, నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము.
- Exodus 5:1 నిర్గమకాండము 5:1తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడనిరి.
- Deuteronomy 31:12–13 ద్వితీయోపదేశకాండము 31:12–13మీ దేవు డైన యెహోవాకు భయపడి యీ ధర్మశాస్త్ర వాక్యము లన్నిటిని అనుసరించి నడుచుకొనునట్లు పురుషులేమి స్త్రీలేమి పిల్లలేమి నీ పురములలోనున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకొనుటకై అందరిని పోగుచేయవలెను. ఆలాగు నేర్చుకొనినయెడల దాని నెరుగని వారి సంతతి వారు దానిని విని, మీరు స్వాధీనపరచుకొనుటకు యొర్దా నును దాటబోవుచున్న దేశమున మీరు బ్రదుకు దినము లన్నియు మీ దేవుడైన యెహోవాకు భయపడుట నేర్చు కొందురు.
- Exodus 3:18 నిర్గమకాండము 3:18వారు నీ మాట విందురు గనుక నీవును ఇశ్రాయేలీయుల పెద్దలును ఐగుప్తు రాజు నొద్దకు వెళ్లి అతని చూచి హెబ్రీయుల దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమాయెను గనుక మేము అరణ్యమునకు మూడుదినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలిని సమర్పించుదుము సెలవిమ్మని అతనితో చెప్పవలెను.
- Psalm 148:12–13 కీర్తనలు 148:12–13¸యౌవనులు కన్యలు వృద్ధులు బాలురు అందరును యెహోవా నామమును స్తుతించుదురు గాక ఆయన నామము మహోన్నతమైన నామము ఆయన ప్రభావము భూమ్యాకాశములకు పైగా నున్నది.
- Proverbs 3:9 సామెతలు 3:9నీ రాబడి అంతటిలో ప్రథమఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము.
- Numbers 29:12 సంఖ్యాకాండము 29:12మరియు ఏడవ నెల పదునయిదవ దినమున మీరు పరిశుద్ధసంఘముగా కూడవలెను. అప్పుడు మీరు జీవనో పాధియైన పనులేమియు చేయక యేడు దినములు యెహో వాకు పండుగ ఆచరింపవలెను.
- Genesis 50:8 ఆదికాండము 50:8యోసేపు యింటివారందరును అతని సహోదరులును అతని తండ్రి ఇంటివారును వెళ్లిరి. వారు తమ పిల్లలను తమ గొఱ్ఱెల మందలను తమ పశువులను మాత్రము గోషెను దేశములో విడిచిపెట్టిరి.
- Exodus 5:3 నిర్గమకాండము 5:3అప్పుడు వారు హెబ్రీయుల దేవుడు మమ్మును ఎదుర్కొనెను, సెలవైన యెడల మేము అరణ్యములోనికి మూడు దినముల ప్రయాణమంత దూరముపోయి మా దేవుడైన యెహోవాకు బలి అర్పించుదము; లేని యెడల ఆయన మా మీద తెగులుతోనునైనను ఖడ్గముతోనైనను పడునేమో అనిరి.
- Ephesians 6:4 ఎఫెసీయులకు 6:4తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి.
- Joshua 24:15 యెహోషువ 24:15యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవిం చెదరో నేడు మీరు కోరుకొనుడి; మీరె వరిని సేవింప కోరుకొనినను నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము అనెను.
- Exodus 13:6 నిర్గమకాండము 13:6ఏడు దినములు నీవు పులియని రొట్టెలను తినవలెను, ఏడవ దినమున యెహోవా పండుగ ఆచరింపవలెను.