Exodus · chapter 20 · verse 19
Exodus 20:19 in Telugu
నీవు మాతో మాటలాడుము మేము విందుము; దేవుడు మాతో మాటలాడిన యెడల మేము చనిపోవుదుము
Neevu maato maatalaadumu memu vindumu; devudu maato maatalaadina yedala memu chanipovudumu
Exodus 20:19 in English
- King James Version (KJV)
- And they said unto Moses, Speak thou with us, and we will hear: but let not God speak with us, lest we die.
- World English Bible (WEB)
- They said to Moses, “Speak with us yourself, and we will listen; but don’t let God speak with us, lest we die.”
- American Standard Version (ASV)
- And they said unto Moses, Speak thou with us, and we will hear; but let not God speak with us, lest we die.
- Bible in Basic English (BBE)
- And they said to Moses, To your words we will give ear, but let not the voice of God come to our ears, for fear death may come on us.
- Darby Translation (DBY)
- and said to Moses, Speak thou with us, and we will hear; but let not God speak with us, lest we die.
- Webster's Bible (WBS)
- And they said to Moses, Speak thou with us, and we will hear: but let not God speak with us, lest we die.
- Young's Literal Translation (YLT)
- and say unto Moses, 'Speak thou with us, and we hear, and let not God speak with us, lest we die.'
Read in context
- 17నీ పొరుగువాని యిల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని యెద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను.
- 18ప్రజలందరు ఆ ఉరుములు ఆ మెరుపులు ఆ బూర ధ్వనియు ఆ పర్వత ధూమమును చూచి, భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి.
- 19నీవు మాతో మాటలాడుము మేము విందుము; దేవుడు మాతో మాటలాడిన యెడల మేము చనిపోవుదుము
- 20అందుకు మోషే - భయపడకుడి; మిమ్ము పరీక్షించుటకును, మీరు పాపము చేయకుండునట్లు ఆయన భయము మీకు కలుగుటకును, దేవుడు వేంచేసెనని ప్రజలతో చెప్పెను.
- 21ప్రజలు దూరముగా నిలిచిరి. మోషే దేవుడున్న ఆ గాఢాంధకారమునకు సమీపింపగా
Cross references
- Deuteronomy 18:16 ద్వితీయోపదేశకాండము 18:16ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండునుగాక అని చెప్పితివి. ఆ సమయ మున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నావంటి ప్రవక్తను నీ సహోదరులలో నీకొరకు పుట్టించును, ఆయన మాట నీవు వినవలెను.
- Acts 7:38 అపొస్తలుల కార్యములు 7:38సీనాయి పర్వతముమీద తనతో మాటలాడిన దేవదూతతోను మన పితరులతోను అరణ్యములోని సంఘమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసికొనినవాడితడే.
- Deuteronomy 5:23–27 ద్వితీయోపదేశకాండము 5:23–27మరియు ఆ పర్వతము అగ్నివలన మండుచున్నప్పుడు ఆ చీకటిమధ్యనుండి ఆ స్వరమును విని మీరు, అనగా మీ గోత్రముల ప్రధానులును మీ పెద్దలును నాయొద్దకు వచ్చి మన దేవుడైన యెహోవా తన ఘనతను మహాత్మ్య మును మాకు చూపించెను. అగ్నిమధ్యనుండి ఆయన స్వర మును వింటిమి. దేవుడు నరులతో మాటలాడినను వారు బ్రదుకుదురని నేడు తెలిసికొంటిమి. కాబట్టి మేము చావనేల? ఈ గొప్ప అగ్ని మమ్మును దహించును; మేము మన దేవుడైన యెహోవా స్వరము ఇక వినినయెడల చని పోదుము. మావలె సమస్త శరీరులలో మరి ఎవడు సజీవు డైన దేవుని స్వరము అగ్ని మధ్యనుండి పలుకుట విని బ్రదికెను? నీవే సమీపించి మన దేవుడైన యెహోవా చెప్పునది యావత్తు వినుము. అప్పుడు మన దేవుడైన యెహోవా నీతో చెప్పినది యావత్తు నీవే మాతో చెప్పిన యెడల మేము విని దాని గైకొందుమని చెప్పితిరి.
- Exodus 33:20 నిర్గమకాండము 33:20మరియు ఆయననీవు నా ముఖమును చూడజాలవు; ఏ నరుడును నన్ను చూచి బ్రదుకడనెను.
- Galatians 3:19 గలతీయులకు 3:19ఆలాగైతే ధర్మశాస్త్ర మెందుకు? ఎవనికి ఆ వాగ్దా నము చేయబడెనో ఆ సంతానము వచ్చువరకు అది అతి క్రమములనుబట్టి దానికి తరువాత ఇయ్యబడెను; అది మధ్యవర్తిచేత దేవదూతల ద్వారా నియమింపబడెను.
- Genesis 32:30 ఆదికాండము 32:30యాకోబు - నేను ముఖా ముఖిగా దేవుని చూచితిని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అను పేరు పెట్టెను.
- Deuteronomy 5:5 ద్వితీయోపదేశకాండము 5:5గనుక యెహోవామాట మీకు తెలియ జేయుటకు నేను యెహోవాకును మీకును మధ్యను నిలిచి యుండగా యెహోవా ఈలాగున సెలవిచ్చెను.
- Hebrews 12:19 హెబ్రీయులకు 12:19బూరధ్వనికిని, మాటల ధ్వనికిని మీరు వచ్చియుండలేదు. ఒక జంతువైనను ఆ కొండను తాకినయెడల రాళ్లతో కొట్టబడవలెనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక,