Ezekiel · chapter 24 · verse 13
Ezekiel 24:13 in Telugu
నీకు కలిగిన అపవిత్రత నీ కామాతురతయే; నిన్ను శుభ్రపరచుటకు నేను పూనుకొనినను నీవు శుభ్రపడకపోతివి, నా క్రోధమును నీమీద తీర్చుకొనువరకు నీవు శుభ్ర పడకయుందువు.
Neeku kaligina apavitrata nee kaamaaturataye; ninnu shubhraparachutaku nenu poonukoninanu neevu shubhrapadakapotivi, naa krodhamunu neemeeda teerchukonuvaraku neevu shubhra padakayunduvu.
Ezekiel 24:13 in English
- King James Version (KJV)
- In thy filthiness [is] lewdness: because I have purged thee, and thou wast not purged, thou shalt not be purged from thy filthiness any more, till I have caused my fury to rest upon thee.
- World English Bible (WEB)
- “‘“In your filthiness is lewdness. Because I have cleansed you and you weren’t cleansed, you won’t be cleansed from your filthiness any more, until I have caused my wrath toward you to rest.
- American Standard Version (ASV)
- In thy filthiness is lewdness: because I have cleansed thee and thou wast not cleansed, thou shalt not be cleansed from thy filthiness any more, till I have caused my wrath toward thee to rest.
- Bible in Basic English (BBE)
- As for your unclean purpose: because I have been attempting to make you clean, but you have not been made clean from it, you will not be made clean till I have let loose my passion on you in full measure.
- Darby Translation (DBY)
- In thy filthiness is lewdness, for I have purged thee, and thou art not pure. Thou shalt no more be purged from thy filthiness, till I have satisfied my fury upon thee.
- Webster's Bible (WBS)
- In thy filthiness [is] lewdness: because I have purged thee, and thou wast not purged, thou shalt not be purged from thy filthiness any more, till I have caused my fury to rest upon thee.
- Young's Literal Translation (YLT)
- In thine uncleanness [is] wickedness, Because I have cleansed thee, And thou hast not been cleansed, From thine uncleanness thou art not cleansed again, Till I have caused My fury to rest on thee.
Read in context
- 11తరువాత దానికి తగిలిన మష్టును మడ్డియు పోవునట్లు అది వేడియై మెరుగు పట్టువరకు వట్టిచట్టి పొయ్యిమీదనే యుంచుము.
- 12అలసట పుట్టు వరకు ఇంతగా శ్రద్ధపుచ్చుకొనినను దాని విస్తారమైన మష్టు పోదాయెను, మష్టుతోకూడ దానిని అగ్నిలో వేయుము,
- 13నీకు కలిగిన అపవిత్రత నీ కామాతురతయే; నిన్ను శుభ్రపరచుటకు నేను పూనుకొనినను నీవు శుభ్రపడకపోతివి, నా క్రోధమును నీమీద తీర్చుకొనువరకు నీవు శుభ్ర పడకయుందువు.
- 14యెహోవానైన నేను మాటయిచ్చి యున్నాను, అది జరుగును, నేనే నెరవేర్చెదను నేను వెనుకతీయను, కనికరింపను, సంతాపపడను, నీ ప్రవర్తనను బట్టియు నీ క్రియలనుబట్టియు నీకు శిక్ష విధింపబడును, ఇదే యెహోవా వాక్కు.
- 15మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
Cross references
- Ezekiel 5:13 యెహెజ్కేలు 5:13నా కోపము తీరును, వారిమీద నా ఉగ్రత తీర్చుకొని నన్ను ఓదార్చుకొందును, నేను వారి మీద నా ఉగ్రత తీర్చుకొనుకాలమున యెహోవానైన నేను ఆసక్తిగలవాడనై ఆలాగు సెలవిచ్చితినని వారు తెలిసి కొందురు
- Ezekiel 22:24 యెహెజ్కేలు 22:24నరపుత్రుడా, యెరూషలేమునకు నీవీమాట ప్రకటింపుము నీవు పవిత్రము కాని దేశమువై యున్నావు
- Zephaniah 3:2 జెఫన్యా 3:2అది దేవుని మాట ఆలకించదు, శిక్షకు లోబడదు, యెహోవాయందు విశ్వాస ముంచదు, దాని దేవునియొద్దకు రాదు.
- Ezekiel 8:18 యెహెజ్కేలు 8:18కాబట్టి కటాక్షము లేకయు కనికరము చూపకయు నేను నా క్రోధమునగుపరచి, వారు నా చెవులలో ఎంత బిగ్గరగా మొఱ్ఱపెట్టినను నేను ఆలకింప కుందును.
- 2 Corinthians 7:1 2 కొరింథీయులకు 7:1ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తిచేసి కొనుచు, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసికొందము.
- Ezekiel 16:42 యెహెజ్కేలు 16:42ఈ విధముగా నీమీదనున్న నా క్రోధమును చల్లార్చుకొందును, నా రోషము నీయెడల మాని పోవును, ఇకను ఆయాసపడకుండ నేను శాంతము తెచ్చు కొందును.
- Jeremiah 6:28–30 యిర్మీయా 6:28–30వారందరు బహు ద్రోహులు, కొండె గాండ్రు, వారు మట్టిలోహము వంటివారు, వారందరు చెరుపువారు. కొలిమితిత్తి బహుగా బుసలు కొట్టు చున్నది గాని అగ్నిలోనికి సీసమే వచ్చుచున్నది; వ్యర్థము గానే చొక్కముచేయుచు వచ్చెను. దుష్టులు చొక్కమునకు రారు. యెహోవా వారిని త్రోసివేసెను గనుక త్రోసివేయవలసిన వెండియని వారికి పేరు పెట్టబడును.
- Ezekiel 24:11 యెహెజ్కేలు 24:11తరువాత దానికి తగిలిన మష్టును మడ్డియు పోవునట్లు అది వేడియై మెరుగు పట్టువరకు వట్టిచట్టి పొయ్యిమీదనే యుంచుము.
- Romans 2:8–9 రోమీయులకు 2:8–9అయితే భేదములు పుట్టించి, సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడువారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్క్యార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు, మొదట యూదునికి గ్రీసుదేశస్థునికికూడ, శ్రమయు వేదనయు కలుగును.
- Revelation 22:11 ప్రకటన 22:11అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే యుండ నిమ్ము, నీతి మంతుడు ఇంకను నీతిమంతుడుగానే యుండనిమ్ము. పరిశుద్ధుడు ఇంకనుపరిశుద్ధుడుగానే యుండనిమ్ము.
- Hosea 7:9–16 హోషేయ 7:9–16అన్యులు అతని బలమును మింగివేసినను అది అతనికి తెలియకపోయెను; తన తలమీద నెరసిన వెండ్రుకలు కనబడుచున్నను అది అతనికి తెలియదు. ఇశ్రాయేలు కున్న అతిశయాస్పదము అతనిమీద సాక్ష్యము పలుకును. ఇంత జరిగినను వారు తమ దేవుడైన యెహోవాయొద్దకు తిరుగకయున్నారు, ఆయనను వెదకక యున్నారు. ఎఫ్రాయిము బుద్ధిలేని పిరికిగుండెగల గువ్వయాయెను; వారు ఐగుప్తీయులను పిలుచుకొందురు. అష్షూరీయుల యొద్దకు పోవుదురు. వారు వెళ్లగా నేను వారిపైని నా వల వేయుదును, ఆకాశపక్షులను ఒకడు కొట్టినట్టు వారిని పడగొట్టుదును, వారి సమాజమునకు నేను ప్రకటించిన ప్రకారము నేను వారిని శిక్షింతును. వారికి శ్రమ కలుగును; వారు నన్ను విసర్జించి తప్పిపోయియున్నారు; వారికి నాశనము కలుగును; వారు నామీద తిరుగుబాటు చేసియున్నారు; వారికి క్షయము సంభవించును. నేను వారిని విమోచింపకోరియున్నను వారు నామీద అబద్దములు చెప్పుదురు హృదయ పూర్వకముగా నన్ను బతిమాలుకొనక శయ్యలమీద పరుండి కేకలు వేయుదురు; నన్ను విసర్జించి ధాన్య మద్యములు కావలెనని వారు గుంపులు కూడుదురు. నేను వారికి బుద్ధినేర్పి వారిని బలపరచినను వారు నామీద దుర్యోచనలు చేయుదురు. వారు తిరుగుదురు గాని సర్వోన్నతుడైన వానియొద్దకు తిరుగరు; వారు అక్కరకురాని విల్లువలె నున్నారు; వారి యధిపతులు తాము పలికిన గర్వపు మాటలలో చిక్కుపడి కత్తి పాలగుదురు. ఈలాగున వారు ఐగుప్తుదేశములో అపహాస్యము నొందుదురు.
- Hosea 7:1 హోషేయ 7:1నేను ఇశ్రాయేలువారికి స్వస్థత కలుగజేయదలంచగా ఎఫ్రాయిము దోషమును షోమ్రోను చెడుతనమును బయలుపడుచున్నది. జనులు మోసము అభ్యాసము చేసెదరు, కొల్లగాండ్రయి లోపలికి చొరబడుదురు, బంది పోటు దొంగలై బయట దోచుకొందురు.