Ezekiel · chapter 26 · verse 21
Ezekiel 26:21 in Telugu
నిన్ను భీతికి కారణముగా జేతును, నీవు లేకపోవుదువు, ఎంత వెదకినను నీవెన్నటికిని కనబడక యుందువు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
Ninnu bheetiki kaaranamugaa jetunu, neevu lekapovuduvu, enta vedakinanu neevennatikini kanabadaka yunduvu; ide prabhuvaina yehovaa vaakku.
Ezekiel 26:21 in English
- King James Version (KJV)
- I will make thee a terror, and thou [shalt be] no [more:] though thou be sought for, yet shalt thou never be found again, saith the Lord GOD.
- World English Bible (WEB)
- I will make you a terror, and you will no more have any being. Though you are sought for, yet you will never be found again,’ says the Lord GOD.”
- American Standard Version (ASV)
- I will make thee a terror, and thou shalt no more have any being; though thou be sought for, yet shalt thou never be found again, saith the Lord Jehovah.
- Bible in Basic English (BBE)
- I will make you a thing of fear, and you will come to an end: even if you are looked for, you will not be seen again for ever, says the Lord.
- Darby Translation (DBY)
- And I will make thee a terror, and thou shalt be no [more]; and thou shalt be sought for, and shalt never be found again, for ever, saith the Lord Jehovah.
- Webster's Bible (WBS)
- I will make thee a terror, and thou [shalt be] no [more] : though thou shalt be sought for, yet shalt thou never be found again, saith the Lord GOD.
- Young's Literal Translation (YLT)
- Wastes I do make thee, and thou art not, And thou art sought, and art not found any more — to the age, An affirmation of the Lord Jehovah!'
Read in context
- 19ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా నివాసులులేని పట్టణములవలెనే నేను నిన్ను పాడుచేయునప్పుడు మహా సముద్రము నిన్ను ముంచునట్లుగా నీ మీదికి నేను అగాధజలములను రప్పించెదను, పురాతన కాలమందు పాతాళములోనికి దిగిపోయినవారియొద్ద నీ వుండునట్లు నేను నిన్ను పడవేసి, నీవు జనములేని దాన వగుటకై పురాతనకాలములో పాడైన జనులయొద్ద భూమి క్రిందనున్న స్థలములలో నీకు నివాసము నిర్ణయింతును, పాతాళములోనికి దిగి పోవువారితో కూడ నిన్ను నివసింప జేసెదను.
- 20మరియు సజీవులు నివసించు భూమిమీద నేను మహాఘనకార్యము కలుగజేతును;
- 21నిన్ను భీతికి కారణముగా జేతును, నీవు లేకపోవుదువు, ఎంత వెదకినను నీవెన్నటికిని కనబడక యుందువు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
Cross references
- Ezekiel 27:36 యెహెజ్కేలు 27:36జనులలోని వర్తకులు నిన్ను అపహసించుదురు భీతికి హేతువగుదువు, నీవు బొత్తిగా నాశనమగుదువు.
- Revelation 18:21 ప్రకటన 18:21తరువాత బలిష్ఠుడైన యొక దూత గొప్ప తిరుగటి రాతివంటి రాయి యెత్తి సముద్రములో పడవేసి ఈలాగు మహాపట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడి ఇక ఎన్నటికిని కనబడకపోవును.
- Ezekiel 28:19 యెహెజ్కేలు 28:19జనులలో నిన్ను ఎరిగిన వారందరును నిన్ను గూర్చి ఆశ్చర్యపడుదురు. నీవు బొత్తిగా నాశనమై భీతికి కారణముగా ఉందువు.
- Psalm 37:36 కీర్తనలు 37:36అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయెను నేను వెదకితిని గాని వాడు కనబడకపోయెను.
- Jeremiah 51:64 యిర్మీయా 51:64నేను దాని మీదికి రప్పింపబోవుచున్న అపాయములచేత బబులోను మరల పైకి రాలేక ఆలాగే మునిగిపోవును, దాని జనులు అలసియుందురు అను మాటలు నీవు ప్రకటింపవలెను. యిర్మీయాయొక్క మాటలు ఇంతటితో ముగిసెను.
- Ezekiel 26:14–16 యెహెజ్కేలు 26:14–16నిన్ను వట్టిబండగా చేయుదును, వలలు పరచుకొనుటకు చోటగుదువు నీవికను కట్టబడక యుందువు. నేనే మాట యిచ్చియున్నాను; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. తూరునుగూర్చి ప్రభువగు యెహోవా సెలవిచ్చు నదేమనగా నీవు కూలునప్పుడు కలుగు ధ్వనియు, హతులగుచున్నవారి కేకలును, నీలో జరుగు గొప్పవధయు ద్వీపములు విని కంపించును. సముద్రపు అధిపతులందరును తమ సింహాసనములమీదనుండి దిగి, తమ చొక్కాయి లను విచిత్రమైన వస్త్రములను తీసివేసి, దిగులుపడిన వారై నేలను కూర్చుండి గడగడ వణకుచు నిన్ను చూచి విస్మయపడుదురు.