Ezekiel · chapter 34 · verse 7
Ezekiel 34:7 in Telugu
కాబట్టి కాపరులారా, యెహోవా మాట ఆలకించుడి
Kaabatti kaaparulaaraa, yehovaa maata aalakinchudi
Ezekiel 34:7 in English
- King James Version (KJV)
- Therefore, ye shepherds, hear the word of the LORD;
- World English Bible (WEB)
- “‘Therefore, you shepherds, hear the LORD’s word:
- American Standard Version (ASV)
- Therefore, ye shepherds, hear the word of Jehovah:
- Bible in Basic English (BBE)
- For this cause, O keepers of the flock, give ear to the word of the Lord:
- Darby Translation (DBY)
- Therefore, ye shepherds, hear the word of Jehovah:
- Webster's Bible (WBS)
- Therefore, ye shepherds, hear the word of the LORD;
- Young's Literal Translation (YLT)
- Therefore, shepherds, hear a word of Jehovah:
Read in context
- 5కాబట్టి కాపరులు లేకయే అవి చెదరిపోయెను, చెదరి పోయి సకల అడవి మృగములకు ఆహారమాయెను.
- 6నా గొఱ్ఱెలు పర్వతము లన్నిటిమీదను ఎత్తయిన ప్రతి కొండమీదను తిరుగులాడు చున్నవి, నా గొఱ్ఱెలు భూమియందంతట చెదరిపోయినను వాటినిగూర్చి విచారించువాడొకడును లేడు, వెదకువా డొకడును లేడు.
- 7కాబట్టి కాపరులారా, యెహోవా మాట ఆలకించుడి
- 8కాపరులు లేకుండ నా గొఱ్ఱెలు దోపుడుసొమ్మయి సకలమైన అడవిమృగములకు ఆహార మాయెను; కాపరులు నా గొఱ్ఱెలను విచారింపరు, తమ కడుపు మాత్రమే నింపుకొందురు గాని గొఱ్ఱెలను మేపరు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
- 9కాబట్టి కాపరులారా యెహోవా మాట ఆలకించుడి.
Cross references
- Jeremiah 13:18 యిర్మీయా 13:18రాజును తల్లియైన రాణిని చూచి ఇట్లనుము మీ శిరోభూషణములును తలమీదనున్న మీ సుందరకిరీటమును పడిపోయెను; క్రుంగి కూర్చుండుడి.
- Malachi 2:1 మలాకీ 2:1కావున యాజకులారా, ఈ ఆజ్ఞ మీకియ్యబడి యున్నది.
- Luke 11:39–54 లూకా 11:39–54అందుకు ప్రభువిట్లనెను పరిసయ్యులైన మీరు గిన్నెయు పళ్లెమును వెలుపల శుద్ధి చేయుదురు గాని మీ అంతరంగము దోపుతోను చెడు తనముతోను నిండియున్నది. అవివేకులారా, వెలుపలి భాగమును చేసినవాడు లోపటి భాగమును చేయలేదా? కాగా మీకు కలిగినవి ధర్మము చేయుడి, అప్పుడు మీ కన్నియు శుద్ధిగా ఉండును. అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా సదాప మొదలైన ప్రతి కూరలోను పదియవవంతు చెల్లించుచున్నారే గాని, న్యాయమును దేవుని ప్రేమను విడిచి పెట్టుచున్నారు. వాటిని మానక వీటిని చేయవలసియున్నది. అయ్యో పరిసయ్యులారా, మీరు సమాజ మందిరములలో అగ్రపీఠములను సంతవీధులలో వందనము లను కోరుచున్నారు. అయ్యో, మీరు కనబడని సమాధులవలె ఉన్నారు; వాటిమీద నడుచు మనుష్యులు (అవి సమాధులని) యెరుగరనెను. అప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడొకడు బోధకుడా, యీలాగు చెప్పి మమ్మునుకూడ నిందించుచున్నావని ఆయ నతో చెప్పగా ఆయన అయ్యో, ధర్మ శాస్త్రోపదేశకులారా, మోయ శక్యముకాని బరువులను మీరు మనుష్యులమీద మోపుదురు గాని మీరు ఒక వ్రేలితోనైనను ఆ బరువులను ముట్టరు. అయ్యో, మీ పితరులు చంపిన ప్రవక్తల సమాధులను మీరు కట్టించుచున్నారు. కావున మీరు సాక్షులై మీ పితరుల కార్యములకు సమ్మతించు చున్నారు; వారు ప్రవక్తలను చంపిరి, మీరు వారి సమాధులు కట్టించుదురు. అందుచేత దేవుని జ్ఞానము చెప్పిన దేమనగా నేను వారియొద్దకు ప్రవక్తలను అపొస్తలులను పంపుదును. వారు కొందరిని చంపుదురు, కొందరిని హింసింతురు. కాబట్టి లోకము పుట్టినది మొదలుకొని, అనగా హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును మందిరము నకును మధ్యను నశించిన జెకర్యా రక్తమువరకు చిందింపబడిన ప్రవక్తలందరి రక్తము నిమిత్తము ఈ తరము వారు విచారింపబడుదురు; నిశ్చయముగా ఈ తరమువారు ఆ రక్తము నిమిత్తము విచారింపబడుదురని మీతో చెప్పు చున్నాను. అయ్యో, ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానమను తాళపు చెవిని ఎత్తికొని పోతిరి; మీరును లోపల ప్రవేశింపరు, ప్రవేశించువారిని అడ్డగింతురని చెప్పెను. ఆయన అక్కడనుండి వెళ్లినప్పుడు శాస్త్రులును పరిసయ్యులును ఆయన మీద నిండ పగబట్టి ఆయన మీద నేరము మోపవలెనని యుండి, ఆయన నోట నుండి వచ్చు ఏమాటనైనను పట్టుకొనుటకు పొంచి, వెదకుచు చాల సంగతులనుగూర్చి ఆయనను మాటలాడింపసాగిరి.
- Jeremiah 22:2–3 యిర్మీయా 22:2–3దావీదు సింహాసనముమీద కూర్చుండు యూదా రాజా, నీవును ఈ గుమ్మములద్వారా ప్రవేశించు నీ ఉద్యోగస్థులును నీ జనులును యెహోవా మాట వినుడని ప్రకటింపుము. యెహోవా ఈలాగు ఆజ్ఞనిచ్చుచున్నాడు మీరు నీతి న్యాయముల ననుసరించి నడుచుకొనుడి, దోచుకొనబడినవానిని బాధపెట్టువాని చేతిలోనుండి విడిపించుడి, పరదేశులనైనను తండ్రిలేనివారినైనను విధవ రాండ్రనైనను బాధింపకుడి వారికి ఉపద్రవము కలుగజేయకుడి, ఈ స్థలములో నిరపరాధుల రక్తము చిందింపకుడి.
- Isaiah 1:10 యెషయా 1:10సొదొమ న్యాయాధిపతులారా, యెహోవామాట ఆల కించుడి. గొమొఱ్ఱా జనులారా, మన దేవుని ఉపదేశమునకు చెవి యొగ్గుడి.
- Psalm 82:1–7 కీర్తనలు 82:1–7దేవుని సమాజములో దేవుడు నిలిచియున్నాడు దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పుతీర్చుదురు? ఎంతకాలము భక్తిహీనులయెడల పక్షపాతము చూపు దురు?(సెలా. ) పేదలకును తలిదండ్రులులేనివారికిని న్యాయము తీర్చుడి శ్రమగలవారికిని దీనులకును న్యాయము తీర్చుడి. దరిద్రులను నిరుపేదలను విడిపించుడి భక్తిహీనుల చేతిలోనుండి వారిని తప్పించుడి. జనులకు తెలివి లేదు వారు గ్రహింపరు వారు అంధకారములో ఇటు అటు తిరుగులాడుదురు దేశమునకున్న ఆధారములన్నియు కదలుచున్నవి. మీరు దైవములనియు మీరందరు సర్వోన్నతుని కుమారులనియు నేనే సెల విచ్చియున్నాను. అయినను ఇతర మనుష్యులు చనిపోవునట్లు మీరును చనిపోవుదురు అధికారులలో ఒకడు కూలునట్లు మీరును కూలుదురు.
- Matthew 23:13–36 మత్తయి 23:13–36అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యు లారా, మీరు మనుష్యులయెదుట పరలోకరాజ్యమును మూయుదురు; మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనియ్యరు. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్ర మును భూమిని చుట్టివచ్చెదరు; అతడు కలిసినప్పుడు అతని మీకంటె రెండంతలు నరకపాత్రునిగా చేయుదురు. అయ్యో, అంధులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయముతోడని ఒట్టుపెట్టుకొంటె అందులో ఏమియు లేదు గాని దేవాలయములోని బంగారముతోడని ఒట్టు పెట్టుకొంటె వాడు దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అంధులారా, ఏది గొప్పది? బంగారమా, బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా? మరియుబలిపీఠముతోడని యొకడు ఒట్టుపెట్టుకొంటె, అందులో ఏమియు లేదు గాని, దాని పైనుండు అర్పణముతోడని ఒట్టుపెట్టుకొంటె దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అంధులారా, ఏది గొప్పది? అర్పణమా, అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా? బలిపీఠముతోడని ఒట్టుపెట్టు కొనువాడు, దాని తోడనియు దాని పైనుండు వాటన్నిటితోడనియు ఒట్టుపెట్టుకొనుచున్నాడు. మరియు దేవాలయము తోడని ఒట్టుపెట్టుకొనువాడు, దాని తోడనియు అందులో నివసించువాని తోడనియు ఒట్టుపెట్టుకొనుచున్నాడు. మరియు ఆకాశముతోడని ఒట్టుపెట్టుకొనువాడు దేవుని సింహాసనము తోడనియు దానిపైని కూర్చున్నవాని తోడనియు ఒట్టుపెట్టుకొను చున్నాడు. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకఱ్ఱలోను పదియవ వంతు చెల్లించి, ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను, అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి; వాటిని మానక వీటిని చేయవలసి యుండెను. అంధులైన మార్గదర్శకులారా, దోమలేకుండు నట్లు వడియగట్టి ఒంటెను మింగువారు మీరే. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యు లారా, మీరు గిన్నెయు పళ్లెమును వెలుపట శుద్ధిచేయు దురు గాని అవి లోపల దోపుతోను అజితేంద్రియత్వము తోను నిండియున్నవి. గ్రుడ్డిపరిసయ్యుడా, గిన్నెయు పళ్లెమును వెలుపల శుద్ధియగునట్టుగా ముందు వాటిలోపల శుద్ధిచేయుము. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నముకొట్టిన సమాధులను పోలి యున్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చినవారి యెముకలతోను సమస్త కల్మషముతోను నిండియున్నవి. ఆలాగే మీరు వెలుపల మనుష్యు లకు నీతిమంతులుగా నగపడుచున్నారు గాని, లోపల వేషధారణతోను అక్రమముతోను నిండి యున్నారు. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు, నీతి మంతుల గోరీలను శృంగారించుచు మనము మన పితరుల దినములలో ఉండినయెడల ప్రవక్తల మరణ విషయములో వారితో పాలివారమై యుండక పోదుమని చెప్పుకొందురు. అందువలననే మీరు ప్రవక్తలను చంపినవారి కుమారులై యున్నారని మీ మీద మీరే సాక్ష్యము చెప్పుకొనుచున్నారు. మీరును మీ పితరుల పరిమాణము పూర్తి చేయుడి. సర్పములారా, సర్పసంతానమా, నరకశిక్షను మీ రేలాగు తప్పించుకొందురు? అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను జ్ఞానులను శాస్త్రులను పంపుచున్నాను; మీరు వారిలో కొందరిని చంపి సిలువవేయుదురు, కొందరిని మీ సమాజమందిరములలో కొరడాలతొ కొట్టి, పట్టణమునుండి పట్టణమునకు తరుముదురు. నీతిమంతు డైన హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును, దేవా లయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు జెకర్యా రక్తమువరకు భూమిమీద చిందింపబడిన నీతి మంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. ఇవన్నియు ఈ తరమువారిమీదికి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
- Ezekiel 34:9 యెహెజ్కేలు 34:9కాబట్టి కాపరులారా యెహోవా మాట ఆలకించుడి.
- Micah 3:8–9 మీకా 3:8–9నేనైతే యాకోబు సంతతివారికి తమ దోష మును ఇశ్రాయేలీయులకు తమ పాపమును కనుపరచుటకై, యెహోవా ఆత్మావేశముచేత బలముతోను తీర్పు తీర్చు శక్తితోను ధైర్యముతోను నింపబడినవాడనైయున్నాను. యాకోబు సంతతివారి ప్రధానులారా, ఇశ్రాయేలీయుల యధిపతులారా, న్యాయమును తృణీకరించుచు దుర్నీతిని నీతిగా ఎంచువారలారా, యీ మాట ఆలకించుడి.
- Jeremiah 13:13 యిర్మీయా 13:13నీవు వారితో ఈ మాట చెప్పుము యెహోవా సెలవిచ్చునదేమనగా ఈ దేశనివాసులనందరిని, దావీదు సింహాసనముమీద కూర్చుండు రాజుల నేమి యాజకులనేమి ప్రవక్తలనేమి యెరూషలేము నివాసులనందరిని నేను మత్తులుగా చేయబోవుచున్నాను.