Ezekiel · chapter 7 · verse 14
Ezekiel 7:14 in Telugu
వారు సర్వసిద్ధులై బాకా నాదము చేయుదురు గాని వారి సమూహమంతటిమీదికి నా ఉగ్రత వచ్చియున్నది గనుక యుద్ధమునకు పూనుకొనువాడొకడును ఉండడు.
Vaaru sarvasiddhulai baakaa naadamu cheyuduru gaani vaari samoohamantatimeediki naa ugrata vachchiyunnadi ganuka yuddhamunaku poonukonuvaadokadunu undadu.
Ezekiel 7:14 in English
- King James Version (KJV)
- They have blown the trumpet, even to make all ready; but none goeth to the battle: for my wrath [is] upon all the multitude thereof.
- World English Bible (WEB)
- They have blown the trumpet, and have made all ready; but no one goes to the battle, for my wrath is on all its multitude.
- American Standard Version (ASV)
- They have blown the trumpet, and have made all ready; but none goeth to the battle; for my wrath is upon all the multitude thereof.
- Bible in Basic English (BBE)
- And he who has given a price for goods will not get them, for my wrath is on all of them.
- Darby Translation (DBY)
- They have blown the trumpet and made all ready, but none goeth to the battle; for my fierce anger is upon all the multitude thereof.
- Webster's Bible (WBS)
- They have blown the trumpet, even to make all ready; but none goeth to the battle: for my wrath [is] upon all the multitude thereof:
- Young's Literal Translation (YLT)
- They have blown with a trumpet to prepare the whole, And none is going to battle, For My wrath [is] unto all its multitude.
Read in context
- 12కాలము వచ్చుచున్నది, దినము సమీప మాయెను, వారి సమూహమంతటిమీద ఉగ్రత నిలిచి యున్నది గనుక కొనువారికి సంతోషముండ పనిలేదు, అమ్మువానికి దుఃఖముండ పనిలేదు.
- 13వారు బ్రదికి యున్నను అమ్మువాడు అమ్మినదానికి తిరిగి రాడు, ఈ దర్శ నము వారి సమూహమంతటికి చెందును, అది తప్పక జర గును, వారందరు దోషులైరి గనుక తమ ప్రాణము రక్షించు కొనుటకు వారిలో ఎవరును ధైర్యము చేయరు.
- 14వారు సర్వసిద్ధులై బాకా నాదము చేయుదురు గాని వారి సమూహమంతటిమీదికి నా ఉగ్రత వచ్చియున్నది గనుక యుద్ధమునకు పూనుకొనువాడొకడును ఉండడు.
- 15బయట ఖడ్గమున్నది లోపట తెగులును క్షామమును ఉన్నవి, బయటనున్న వారు ఖడ్గముచేత చత్తురు, పట్టణములోనున్న వారిని క్షామమును తెగులును మింగును.
- 16వారిలో ఎవరైనను తప్పించుకొనిన యెడల వారందరును లోయలోని గువ్వలవలె పర్వతములమీదనుండి తమ దోషములనుబట్టి మూల్గులిడుదురు.
Cross references
- Jeremiah 4:5 యిర్మీయా 4:5యూదాలో సమాచారము ప్రకటించుడి, యెరూషలేములో చాటించుడి, దేశములో బూర ఊదుడి, గట్టిగా హెచ్చరిక చేయుడి, ఎట్లనగాప్రాకారముగల పట్టణ ములలోనికి పోవునట్లుగా పోగై రండి.
- Isaiah 24:1–7 యెషయా 24:1–7ఆలకించుడి యెహోవా దేశమును వట్టిదిగా చేయుచున్నాడు ఆయన దాని పాడుగాచేసి కల్లోలపరచుచున్నాడు దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు. ప్రజలకు కలిగినట్టు యాజకులకు కలుగును దాసులకు కలిగినట్లు యజమానులకు కలుగును దాసీలకు కలిగినట్లు వారి యజమానురాండ్రకు కలుగును కొనువారికి కలిగినట్లు అమ్మువారికి కలుగును అప్పిచ్చువారికి కలిగినట్లు అప్పు పుచ్చుకొను వారికి కలుగును వడ్డికిచ్చువారికి కలిగినట్లు వడ్డికి తీసుకొనువారికి కలుగును. దేశము కేవలము వట్టిదిగా చేయబడును అది కేవలము కొల్లసొమ్మగును. యెహోవా ఈలాగు సెలవిచ్చియున్నాడు దేశము వ్యాకులముచేత వాడిపోవుచున్నది లోకము దుఃఖముచేత క్షీణించిపోవుచున్నది భూజనులలో గొప్పవారు క్షీణించిపోవుచున్నారు. లోకనివాసులు ధర్మశాసనములను అతిక్రమించి యున్నారు కట్టడను మార్చి నిత్యనిబంధనను మీరియున్నారు. దాని నివాసులచేత లోకము అపవిత్రమాయెను. శాపము దేశమును నాశనము చేయుచున్నది దాని నివాసులు శిక్షకు పాత్రులైరి దేశనివాసులు కాలిపోయిరి శేషించిన మనుష్యులు కొద్దిగానే యున్నారు. క్రొత్త ద్రాక్షారసము అంగలార్చుచున్నది ద్రాక్షావల్లి క్షీణించుచున్నది సంతోషహృదయులందరు నిట్టూర్పు విడుచు చున్నారు. తంబురల సంతోషనాదము నిలిచిపోయెను
- Ezekiel 7:11–12 యెహెజ్కేలు 7:11–12వారిలోనైనను వారి గుంపులోనైనను వారి ఆస్తిలోనైనను వారికున్న ప్రభావములోనైనను ఏమియు శేషింపదు. కాలము వచ్చుచున్నది, దినము సమీప మాయెను, వారి సమూహమంతటిమీద ఉగ్రత నిలిచి యున్నది గనుక కొనువారికి సంతోషముండ పనిలేదు, అమ్మువానికి దుఃఖముండ పనిలేదు.
- Jeremiah 12:12 యిర్మీయా 12:12పాడుచేయువారు అరణ్య మందలి చెట్లులేని మెట్టలన్నిటిమీదికి వచ్చుచున్నారు; దేశముయొక్క యీ కొననుండి ఆ కొనవరకు యెహోవా ఖడ్గము తిరుగుచు హతము చేయుచున్నది; శరీరులకు క్షేమ మేమియు లేదు.
- Jeremiah 6:1 యిర్మీయా 6:1బెన్యామీనీయులారా, యెరూషలేములో నుండి పారి పోవుడి, తెకోవలో బూరధ్వని చేయుడి, బేత్ హక్కెరెము మీద ఆనవాలుకై ధ్వజము నిలువబెట్టుడి, కీడు ఉత్తర దిక్కునుండి వచ్చుచున్నది, గొప్ప దండు వచ్చుచున్నది.
- Jeremiah 7:20 యిర్మీయా 7:20అందువలన ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఈ స్థలముమీదను నరులమీదను జంతువులమీదను పొలముల చెట్లమీదను భూమిపంట మీదను నా కోపమును నా ఉగ్రతను కుమ్మరించెదను, ఆర్పశక్యము కాకుండ అది మండును.
- Jeremiah 6:11 యిర్మీయా 6:11కావున నేను యెహోవా క్రోధముతో నిండియున్నాను, దానిని అణచుకొని అణచుకొని నేను విసికియున్నాను, ఒకడు తప్పకుండ వీధిలోనున్న పసిపిల్లలమీదను ¸యౌవనుల గుంపుమీదను దాని కుమ్మరింపవలసి వచ్చెను, భార్యా భర్తలును వయస్సు మీరినవారును వృద్ధులును పట్టుకొనబడెదరు.
- Jeremiah 51:27 యిర్మీయా 51:27దేశములో ధ్వజములనెత్తుడి జనములలో బాకానాదము చేయుడి దానిమీదికి పోవుటకై జనములను ప్రతిష్ఠించుడి దానిమీద పడుటకై అరారాతు మిన్నీ అష్కనజు అను రాజ్యములను పిలిపించుడి దానిమీదికి జనులను నడిపించుటకై సేనాధిపతిని నియమించుడి రోమముగల గొంగళిపురుగులంత విస్తారముగా గుఱ్ఱము లను దానిమీదికి రప్పించుడి.