Genesis · chapter 15 · verse 16
Genesis 15:16 in Telugu
అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ నాలుగవ తరమువారు ఇక్కడికి మరల వచ్చెదరని నిశ్చయముగా తెలిసికొనుమని అబ్రాముతో చెప్పెను.
Amoreeyula akramamu inkanu sampoornamu kaaledu ganuka nee naalugava taramuvaaru ikkadiki marala vachchedarani nishchayamugaa telisikonumani abraamuto cheppenu.
Genesis 15:16 in English
- King James Version (KJV)
- But in the fourth generation they shall come hither again: for the iniquity of the Amorites [is] not yet full.
- World English Bible (WEB)
- In the fourth generation they will come here again, for the iniquity of the Amorite is not yet full.”
- American Standard Version (ASV)
- And in the fourth generation they shall come hither again: for the iniquity of the Amorite is not yet full.
- Bible in Basic English (BBE)
- And in the fourth generation they will come back here; for at present the sin of the Amorite is not full.
- Darby Translation (DBY)
- And [in the] fourth generation they shall come hither again; for the iniquity of the Amorites is not yet full.
- Webster's Bible (WBS)
- But in the fourth generation they shall come hither again: for the iniquity of the Amorites [is] not yet full.
- Young's Literal Translation (YLT)
- and the fourth generation doth turn back hither, for the iniquity of the Amorite is not yet complete.'
Read in context
- 14వారు నాలుగు వందల యేండ్లు వీరిని శ్రమ పెట్టుదురు; వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు.
- 15నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయెదవు; మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడుదువు.
- 16అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ నాలుగవ తరమువారు ఇక్కడికి మరల వచ్చెదరని నిశ్చయముగా తెలిసికొనుమని అబ్రాముతో చెప్పెను.
- 17మరియు ప్రొద్దుగ్రుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్నిజ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను.
- 18ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నదియైన యూఫ్రటీసు నదివరకు ఈ దేశమును, అనగా
Cross references
- 1 Kings 21:26 1 రాజులు 21:26ఇశ్రాయేలీయుల యెదుట నిలువకుండ యెహోవా వెళ్లగొట్టిన అమోరీయుల ఆచారరీతిగా విగ్రహములను పెట్టుకొని అతడు బహు హేయముగా ప్రవర్తించెను.
- Daniel 8:23 దానియేలు 8:23వారి ప్రభుత్వముయొక్క అంతములో వారి యతిక్రమములు సంపూర్తియగుచుండగా, క్రూరముఖము గల వాడును యుక్తిగలవాడునై యుండి, ఉపాయము తెలిసి కొను ఒక రాజు పుట్టును.
- Matthew 23:32–35 మత్తయి 23:32–35మీరును మీ పితరుల పరిమాణము పూర్తి చేయుడి. సర్పములారా, సర్పసంతానమా, నరకశిక్షను మీ రేలాగు తప్పించుకొందురు? అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను జ్ఞానులను శాస్త్రులను పంపుచున్నాను; మీరు వారిలో కొందరిని చంపి సిలువవేయుదురు, కొందరిని మీ సమాజమందిరములలో కొరడాలతొ కొట్టి, పట్టణమునుండి పట్టణమునకు తరుముదురు. నీతిమంతు డైన హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును, దేవా లయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు జెకర్యా రక్తమువరకు భూమిమీద చిందింపబడిన నీతి మంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును.
- Exodus 12:40 నిర్గమకాండము 12:40ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలము నాలుగు వందల ముప్పది సంవత్సరములు.
- 1 Thessalonians 2:16 1 థెస్సలొనీకయులకు 2:16అన్యజనులు రక్షణపొందుటకై వారితో మేము మాటలాడకుండ మమ్మును ఆటంకపరచుచు, దేవునికి ఇష్టులు కానివారును మనుష్యులకందరికి విరోధులునై యున్నారు; దేవుని ఉగ్రత తుదముట్ట వారిమీదికి వచ్చెను.
- 2 Peter 3:8–9 2 పేతురు 3:8–9ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము వెయ్యిసంవత్సరములవలెను, వెయ్యిసంవత్సరములు ఒక దినమువలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల ధీర్ఘశాంతముగలవాడై యున్నాడు.
- Zechariah 5:5–11 జెకర్యా 5:5–11అప్పుడు నాతో మాటలాడుచున్న దూత బయలు వెళ్లి నీవు నిదానించి చూచి ఇవతలకు వచ్చునదేమిటో కనిపెట్టుమని నాతో చెప్పగా ఇదేమిటియని నేనడిగి తిని. అందుకతడుఇది కొల, ఇది బయలువెళ్లు తూము అనెను; మరియు లోకమంతటను జనులు ఈలాగున కన బడుదురని చెప్పెను. అప్పుడు సీసపుబిళ్లను తీయగా కొల తూములో కూర్చున్న యొక స్త్రీ కనబడెను. అప్పుడతడు ఇది దోషమూర్తి యని నాతో చెప్పి తూములో దాని పడవేసి సీసపుబిళ్లను తూముమీద నుంచెను. నేను మరల తేరి చూడగా ఇద్దరు స్త్రీలు బయలుదేరిరి; సంకుబుడి కొంగ రెక్కలవంటి రెక్కలు వారి కుండెను, గాలి వారి రెక్కలను ఆడించుచుండెను, వారు వచ్చి తూమును భూమ్యాకాశముల మధ్యకు ఎత్తి దాని మోసిరి. వీరు ఈ తూమును ఎక్కడికి తీసికొని పోవుదురని నాతో మాటలాడుచున్న దూతను నేనడు గగా షీనారుదేశమందు దానికొక సాలను కట్టుటకు వారు పోవుచున్నారు; అది సిద్ధమైనప్పుడు అక్కడ దానిని పీఠముమీద పెట్టియుంచుదురని అతడు నాకుత్తర మిచ్చెను.