Genesis · chapter 24 · verse 1
Genesis 24:1 in Telugu
అబ్రాహాము బహుకాలము గడిచిన వృద్ధుడై యుండెను. అన్ని విషయములలోను యెహోవా అబ్రాహామును ఆశీర్వదించెను.
Abraahaamu bahukaalamu gadichina vruddhudai yundenu. Anni vishayamulalonu yehovaa abraahaamunu aasheervadinchenu.
Genesis 24:1 in English
- King James Version (KJV)
- And Abraham was old, [and] well stricken in age: and the LORD had blessed Abraham in all things.
- World English Bible (WEB)
- Abraham was old, and well advanced in age. The LORD had blessed Abraham in all things.
- American Standard Version (ASV)
- And Abraham was old, [and] well stricken in age: and Jehovah had blessed Abraham in all things.
- Bible in Basic English (BBE)
- Now Abraham was old and far on in years: and the Lord had given him everything in full measure.
- Darby Translation (DBY)
- And Abraham was old, [and] advanced in age; and Jehovah had blessed Abraham in all things.
- Webster's Bible (WBS)
- And Abraham was old [and] far advanced in age: and the LORD had blessed Abraham in all things.
- Young's Literal Translation (YLT)
- And Abraham [is] old, he hath entered into days, and Jehovah hath blessed Abraham in all [things];
Read in context
- 1అబ్రాహాము బహుకాలము గడిచిన వృద్ధుడై యుండెను. అన్ని విషయములలోను యెహోవా అబ్రాహామును ఆశీర్వదించెను.
- 2అప్పుడు అబ్రాహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన యింటి పెద్ద దాసునితో నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము;
- 3నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెండ్లి చేయక
Cross references
- Psalm 112:1–3 కీర్తనలు 112:1–3యెహోవాను స్తుతించుడి యెహోవాయందు భయభక్తులుగలవాడు ఆయన ఆజ్ఞలనుబట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతివారు భూమిమీద బలవంతులగుదురు యథార్థవంతుల వంశపువారు దీవింపబడుదురు కలిమియు సంపదయు వాని యింట నుండును వాని నీతి నిత్యము నిలుచును.
- Proverbs 10:22 సామెతలు 10:22యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టముచేత ఆ యాశీర్వాదము ఎక్కువ కాదు.
- Genesis 13:2 ఆదికాండము 13:2అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై యుండెను.
- Galatians 3:9 గలతీయులకు 3:9కాబట్టి విశ్వాససంబంధులే విశ్వాసముగల అబ్రాహాముతో కూడ ఆశీర్వదింపబడుదురు.
- Matthew 6:33 మత్తయి 6:33కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును.
- Genesis 18:11 ఆదికాండము 18:11అబ్రాహామును శారాయును బహుకాలము గడచిన వృద్ధులై యుండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచి పోయెను గనుక
- Genesis 12:2 ఆదికాండము 12:2నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు.
- Ephesians 1:3 ఎఫెసీయులకు 1:3మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోకవిషయములలో ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకనుగ్రహించెను.
- 1 Timothy 4:8 1 తిమోతికి 4:8శరీర సంబంధమైన సాధకము కొంచెముమట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తియిప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును.
- Genesis 24:35 ఆదికాండము 24:35యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయెను; అతనికి గొఱ్ఱెలను గొడ్లను వెండి బంగారములను దాస దాసీ జనమును ఒంటెలను గాడిదలను దయచేసెను.
- Isaiah 51:2 యెషయా 51:2మీ తండ్రియైన అబ్రాహాము సంగతి ఆలోచించుడి మిమ్మును కనిన శారాను ఆలోచించుడి అతడు ఒంటరియై యుండగా నేను అతని పిలిచితిని అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది యగునట్లు చేసితిని.
- Genesis 25:20 ఆదికాండము 25:20ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియా వాడైన బెతూయేలు కుమార్తెయును సిరియా వాడైన లాబాను సహోదరియునైన రిబ్కాను పెండ్లి చేసికొన్నప్పుడు నలుబది సంవత్సరములవాడు.