Hebrews · chapter 8 · verse 2
Hebrews 8:2 in Telugu
మనకు అట్టి ప్రధానయాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకు, అనగా మనుష్యుడుకాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై యుండి, పరలోకమందు మహామహుని సింహాసమునకు కుడిపార్శ్వమున ఆసీనుడాయెను.
Manaku atti pradhaanayaajakudu okadunnaadu. Aayana parishuddhaalayamunaku, anagaa manushyudukaaka prabhuve sthaapinchina nijamaina gudaaramunaku parichaarakudai yundi, paralokamandu mahaamahuni sinhaasamunaku kudipaarshvamuna aaseenudaayenu.
Hebrews 8:2 in English
- King James Version (KJV)
- A minister of the sanctuary, and of the true tabernacle, which the Lord pitched, and not man.
- World English Bible (WEB)
- a servant of the sanctuary and of the true tabernacle which the Lord pitched, not man.
- American Standard Version (ASV)
- a minister of the sanctuary, and of the true tabernacle, which the Lord pitched, not man.
- Bible in Basic English (BBE)
- As a servant of the holy things and of the true Tent, which was put up by God, not by man.
- Darby Translation (DBY)
- minister of the holy places and of the true tabernacle, which the Lord has pitched, [and] not man.
- Webster's Bible (WBS)
- A minister of the sanctuary, and of the true tabernacle, which the Lord pitched, and not man.
- Young's Literal Translation (YLT)
- of the holy places a servant, and of the true tabernacle, which the Lord did set up, and not man,
Read in context
- 1మేము వివరించుచున్న సంగతులలోని సారాంశ మేదనగా.
- 2మనకు అట్టి ప్రధానయాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకు, అనగా మనుష్యుడుకాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై యుండి, పరలోకమందు మహామహుని సింహాసమునకు కుడిపార్శ్వమున ఆసీనుడాయెను.
- 3ప్రతి ప్రధానయాజకుడు అర్పణలను బలులను అర్పించుటకు నియమింప బడును. అందుచేత అర్పించుటకు ఈయనకు ఏమైన ఉండుట అవశ్యము.
- 4ధర్మశాస్త్రప్రకారము అర్పణలు అర్పించువారున్నారు గనుక ఈయన భూమిమీద ఉన్న యెడల యాజకుడై యుండడు.
Cross references
- Exodus 33:7 నిర్గమకాండము 33:7అంతట మోషే గుడారమును తీసి పాళెము వెలుపలికి వెళ్లి పాళెమునకు దూరముగా దాని వేసి, దానికి ప్రత్యక్షపు గుడారమను పేరు పెట్టెను. యెహోవాను వెదకిన ప్రతివాడును పాళెమునకు వెలుపలనున్న ఆ ప్రత్యక్షపు గుడారమునకు వెళ్లుచు వచ్చెను.
- Romans 15:8 రోమీయులకు 15:8నేను చెప్పునదేమనగా, పితరులకు చేయబడిన వాగ్దానముల విషయములో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును, అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతి గలవారికి పరిచారకుడాయెను.
- 2 Corinthians 5:1 2 కొరింథీయులకు 5:1భూమిమీద మన గుడారమైన యీ నివాసము శిథిలమైపోయినను, చేతిపనికాక దేవునిచేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని యెరుగుదుము.
- Hebrews 9:23–24 హెబ్రీయులకు 9:23–24పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధిచేయబడవలసియుండెను గాని పరలోక సంబంధమైనవి వీటికంటె శ్రేష్ఠమైన బలులవలన శుద్ధిచేయబడ వలసియుండెను. అందువలన నిజమైన పరిశుద్ధస్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధస్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని, యిప్పుడు మనకొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను.
- Hebrews 9:8–12 హెబ్రీయులకు 9:8–12దీనినిబట్టి ఆ మొదటి గుడార మింక నిలుచుచుండగా అతిపరిశుద్ధస్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయు చున్నాడు. ఆ గుడారము ప్రస్తుతకాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమునుబట్టి మనస్సాక్షి విషయములో ఆరాధకునికి సంపూర్ణసిద్ధి కలుగజేయలేని అర్పణలును బలులును అర్పింపబడుచున్నవి. ఇవి దిద్దు బాటు జరుగుకాలము వచ్చువరకు విధింపబడి, అన్నపానములతోను నానావిధములైన ప్రక్షాళనములతోను సంబంధించిన శరీరాచారములు మాత్రమైయున్నవి. అయితే క్రీస్తు రాబోవుచున్న మేలులవిషయమై ప్రధానయాజకుడుగా వచ్చి, తానే నిత్యమైన విమోచన సంపాదించి, హస్తకృతము కానిది, అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు, మరి ఘనమైనదియు, పరిపూర్ణమైనదియునైన గుడారముద్వారా, మేకలయొక్కయు కోడెలయొక్కయు రక్తముతో కాక, తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధస్థలములో ప్రవేశించెను.
- Exodus 28:1 నిర్గమకాండము 28:1మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను, అనగా అహరోనును, అహరోను కుమారులైన నాదాబును, అబీహును, ఎలియాజరును ఈతామారును ఇశ్రాయేలీయులలో నుండి నీ యొద్దకు పిలిపింపుము.
- Colossians 2:11 కొలొస్సయులకు 2:11మీరును, క్రీస్తు సున్నతియందు, శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయనయందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి.
- Exodus 28:35 నిర్గమకాండము 28:35సేవచేయునప్పుడు అహరోను దాని ధరించుకొనవలెను. అతడు యెహోవా సన్నిధిని పరిశుద్ధస్థలములోనికి ప్రవేశించునప్పుడు అతడు చావకయుండునట్లు దాని ధ్వని వినబడవలెను.
- Luke 24:44 లూకా 24:44అంతట ఆయన–మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను, కీర్తనలలోను నన్నుగూర్చి వ్రాయబడిన వన్నియు నెరవేరవలెనని నేను మీయొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను
- Hebrews 11:10 హెబ్రీయులకు 11:10ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై యున్నాడో, పునాదులుగల ఆ పట్టణముకొరకు అబ్రాహాము ఎదురుచూచుచుండెను.
- Hebrews 10:21 హెబ్రీయులకు 10:21దేవుని యింటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను,