Hosea · chapter 4 · verse 18
Hosea 4:18 in Telugu
వారికి ద్రాక్షారసము చేదాయెను, ఒళ్లు తెలియనివారు; మానక వ్యభిచారముచేయు వారు; వారి అధికారులు సిగ్గుమాలినవారై అవమానకర మైన దానిని ప్రేమింతురు.
Vaariki draakshaarasamu chedaayenu, ollu teliyanivaaru; maanaka vyabhichaaramucheyu vaaru; vaari adhikaarulu siggumaalinavaarai avamaanakara maina daanini preminturu.
Hosea 4:18 in English
- King James Version (KJV)
- Their drink is sour: they have committed whoredom continually: her rulers [with] shame do love, Give ye.
- World English Bible (WEB)
- Their drink has become sour. They play the prostitute continually. Her rulers dearly love their shameful way.
- American Standard Version (ASV)
- Their drink is become sour; they play the harlot continually; her rulers dearly love shame.
- Bible in Basic English (BBE)
- Their drink has become bitter; they are completely false; her rulers take pleasure in shame.
- Darby Translation (DBY)
- Their drink is sour; they give themselves up to whoredom; her great men passionately love [their] shame.
- Webster's Bible (WBS)
- Their drink is sour: they have been guilty of lewd deeds continually: her rulers [with] shame do love, Give ye.
- Young's Literal Translation (YLT)
- Sour [is] their drink, They have gone diligently a-whoring, Her protectors have loved shame thoroughly.
Read in context
- 16పెయ్య మొండి తనము చూపునట్టు ఇశ్రాయేలువారు మొండితనము చూపియున్నారు గనుక విశాలస్థలమందు మేయు గొఱ్ఱె పిల్లకు సంభవించునట్లు దేవుడు వారికి సంభవింపజేయును.
- 17ఎఫ్రాయిము విగ్రహములతో కలసికొనెను, వానిని ఆలాగుననే యుండనిమ్ము.
- 18వారికి ద్రాక్షారసము చేదాయెను, ఒళ్లు తెలియనివారు; మానక వ్యభిచారముచేయు వారు; వారి అధికారులు సిగ్గుమాలినవారై అవమానకర మైన దానిని ప్రేమింతురు.
- 19సుడిగాలి జనులను చుట్టి కొట్టుకొనిపోవును; తాము అర్పించిన బలులనుబట్టి వారు సిగ్గునొందుదురు.
Cross references
- Proverbs 30:15–16 సామెతలు 30:15–16జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతురులిద్దరు కలరు తృప్తిపడనివి మూడు కలవుచాలును అని పలుకనివి నాలుగు కలవు. అవేవనగా పాతాళము, కనని గర్భము, నీరు చాలును అనని భూమి, చాలును అనని అగ్ని.
- Micah 3:11 మీకా 3:11జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు, వారి యాజకులు కూలికి బోధింతురు, ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోదె చెప్పుదురు; అయినను వారు, యెహోవాను ఆధారము చేసికొని యెహోవా మన మధ్యనున్నాడు గదా, యే కీడును మనకు రానేరదని యనుకొందురు.
- Jeremiah 2:21 యిర్మీయా 2:21శ్రేష్ఠమైన ద్రాక్షావల్లివంటి దానిగా నేను నిన్ను నాటి తిని; కేవలము నిక్కమైన విత్తనమువలని చెట్టు వంటిదానిగా నిన్ను నాటితిని; నాకు జాతిహీనపు ద్రాక్షావల్లివలె నీ వెట్లు భ్రష్టసంతాన మైతివి?
- Exodus 23:8 నిర్గమకాండము 23:8లంచము తీసి కొనకూడదు; లంచము దృష్టిగలవానికి గ్రుడ్డితనము కలుగజేసి, నీతిమంతుల మాట లకు అపార్థము చేయించును.
- 1 Samuel 12:3–4 1 సమూయేలు 12:3–4ఇదిగో నేనున్నాను, నేనెవని యెద్దునైన తీసికొంటినా? ఎవని గార్దభమునైన పట్టు కొంటినా? ఎవనికైన అన్యాయము చేసితినా? ఎవనినైన బాధపెట్టితినా? న్యాయము నాకు అగపడకుండ ఎవని యొద్దనైన లంచము పుచ్చుకొంటినా? ఆలాగు చేసినయెడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని యెదుటను వాడు నా మీద సాక్ష్యము పలుకవలెను, అప్పుడు నేను మీ యెదుట దానిని మరల నిత్తు ననెను. నీవు మాకు ఏ అన్యాయమైనను ఏ బాధనైనను చేయలేదు; ఏ మనుష్యునియొద్దగాని నీవు దేనినైనను తీసికొనలేదని వారు చెప్పగా
- Hosea 4:10 హోషేయ 4:10వారు యెహోవాను లక్ష్య పెట్టుటమానిరి గనుక వారు భోజనము చేసినను తృప్తి పొందక యుందురు, వ్యభిచారము చేసినను అభివృద్ధి నొందక యుందురు.
- Amos 5:12 ఆమోసు 5:12మీ అప రాధములు విస్తారములైనవనియు, మీ పాపములు ఘోరమైనవనియు నేనెరుగుదును. దరిద్రులయొద్ద పంట మోపులను పుచ్చుకొనుచు మీరు వారిని అణగద్రొక్కు దురు గనుక మలుపురాళ్లతో మీరు ఇండ్లుకట్టుకొనినను వాటిలో మీరు కాపురముండరు, శృంగారమైన ద్రాక్ష తోటలు మీరు నాటినను ఆ పండ్ల రసము మీరు త్రాగరు.
- Deuteronomy 32:32–33 ద్వితీయోపదేశకాండము 32:32–33వారి ద్రాక్షావల్లి సొదొమ ద్రాక్షావల్లి అది గొమొఱ్ఱా పొలములలో పుట్టినది. వారి ద్రాక్షపండ్లు పిచ్చి ద్రాక్షపండ్లు వాటి గెలలు చేదైనవి. వారి ద్రాక్షారసము క్రూరసర్పముల విషము నాగుపాముల క్రూరవిషము.
- Deuteronomy 16:19 ద్వితీయోపదేశకాండము 16:19నీవు న్యాయము తప్పి తీర్పుతీర్చకూడదు; పక్షపాతము చేయకూడదు; లంచము పుచ్చుకొనకూడదు. ఏలయనగా లంచము జ్ఞానుల కన్ను లకు గ్రుడ్డితనము కలుగజేయును నీతి మంతుల మాటలకు అపార్థము పుట్టించును.
- Micah 7:3 మీకా 7:3రెండు చేతులతోను కీడు చేయ పూనుకొందురు, అధిపతులు బహుమానము కోరుదురు, న్యాయాధిపతులు లంచము పుచ్చుకొందురు, గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేయుదురు. ఆలాగున వారు ఏకపట్టుగానుండి దాని ముగింతురు.
- 1 Samuel 8:3 1 సమూయేలు 8:3వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక, ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా
- Hosea 4:2 హోషేయ 4:2అబద్ధసాక్ష్యము పలు కుటయు అబద్ధమాడుటయు హత్య చేయుటయు దొంగిలించుటయు వ్యభిచరించుటయు వాడుకయ్యెను; జనులు కన్నము వేసెదరు, మానక నరహత్యచేసెదరు.