Isaiah · chapter 12 · verse 5
Isaiah 12:5 in Telugu
యెహోవానుగూర్చి కీర్తన పాడుడి ఆయన తన మహాత్మ్యమును వెల్లడిపరచెను భూమియందంతటను ఇది తెలియబడును.
Yehovaanugoorchi keertana paadudi aayana tana mahaatmyamunu velladiparachenu bhoomiyandantatanu idi teliyabadunu.
Isaiah 12:5 in English
- King James Version (KJV)
- Sing unto the LORD; for he hath done excellent things: this [is] known in all the earth.
- World English Bible (WEB)
- Sing to the LORD, for he has done excellent things! Let this be known in all the earth!
- American Standard Version (ASV)
- Sing unto Jehovah; for he hath done excellent things: let this be known in all the earth.
- Bible in Basic English (BBE)
- Make a song to the Lord; for he has done noble things: give news of them through all the earth.
- Darby Translation (DBY)
- Sing psalms of Jehovah, for he hath done excellent things: this is known in all the earth.
- Webster's Bible (WBS)
- Sing to the LORD; for he hath done excellent things: this [is] known in all the earth.
- Young's Literal Translation (YLT)
- Praise ye Jehovah, for excellence He hath done, Known is this in all the earth.
Read in context
- 3కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావు లలోనుండి నీళ్లు చేదుకొందురు ఆ దినమున మీరీలాగందురు
- 4యెహోవాను స్తుతించుడి ఆయన నామమును ప్రకటించుడి జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చు కొనుడి.
- 5యెహోవానుగూర్చి కీర్తన పాడుడి ఆయన తన మహాత్మ్యమును వెల్లడిపరచెను భూమియందంతటను ఇది తెలియబడును.
- 6సీయోను నివాసీ, ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము నీ మధ్యనున్న ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై యున్నాడు.
Cross references
- Psalm 98:1 కీర్తనలు 98:1యెహోవా ఆశ్చర్యకార్యములు చేసియున్నాడు ఆయననుగూర్చి క్రొత్తకీర్తన పాడుడి ఆయన దక్షిణహస్తము ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగజేసియున్నది.
- Exodus 15:1 నిర్గమకాండము 15:1అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులును యెహోవానుగూర్చి యీ కీర్తన పాడిరి - యెహోవానుగూర్చి గానముచేసెదను ఆయన మిగుల అతిశయించి జయించెను గుఱ్ఱమును దాని రౌతును ఆయన సముద్రములో పడద్రోసెను.
- Habakkuk 2:14 హబక్కూకు 2:14ఏలయనగా సముద్రము జలము లతో నిండియున్నట్టు భూమి యెహోవా మాహాత్మ్యమును గూర్చిన జ్ఞానముతో నిండియుండును.
- Revelation 15:3 ప్రకటన 15:3వారు ప్రభువా, దేవా, సర్వాధికారీ, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి; యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములును సత్యములునై యున్నవి;
- Isaiah 40:9 యెషయా 40:9సీయోనూ, సువార్త ప్రటించుచున్నదానా, ఉన్నతపర్వతము ఎక్కుము యెరూషలేమూ, సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించుము భయపడక ప్రకటింపుమి - ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణములకు ప్రకటించుము.
- Exodus 15:21 నిర్గమకాండము 15:21మిర్యాము వారితో కలిసి యిట్లు పల్లవి యెత్తి పాడెను యెహోవాను గానము చేయుడి ఆయన మిగుల అతిశయించి జయించెను గుఱ్ఱమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోసెను.
- Revelation 19:1–3 ప్రకటన 19:1–3అటుతరువాత బహు జనులశబ్దమువంటి గొప్పస్వరము పరలోకమందు ఈలాగు చెప్పగా వింటిని ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును; ఆయన తీర్పులు సత్యములును న్యాయములునై యున్నవి; తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమునుబట్టి దానికి ప్రతిదండన చేసెను; మరి రెండవసారి వారుప్రభువును స్తుతించుడి అనిరి. ఆ పట్టణపు పొగ యుగయుగములు పైకి లేచుచున్నది.
- Psalm 72:19 కీర్తనలు 72:19ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడును గాక సర్వభూమియు ఆయన మహిమతో నిండియుండును గాక. ఆమేన్. ఆమేన్.
- Revelation 11:15–17 ప్రకటన 11:15–17ఏడవ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము నాయెను; ఆయన యుగయుగముల వరకు ఏలు ననెను. అంతట దేవునియెదుట సింహాసనాసీనులగు ఆ యిరువది నలుగురు పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమ స్కారముచేసి వర్తమానభూతకాలములలో ఉండు దేవుడవైన ప్రభువా, సర్వాధికారీ, నీవు నీ మహాబలమును స్వీకరించి యేలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము.
- Psalm 105:2 కీర్తనలు 105:2ఆయననుగూర్చి పాడుడి ఆయనను కీర్తించుడి ఆయన ఆశ్చర్యకార్యములన్నిటినిగూర్చి సంభాషణ చేయుడి
- Psalm 68:32–35 కీర్తనలు 68:32–35భూరాజ్యములారా, దేవునిగూర్చి పాడుడి ప్రభువును కీర్తించుడి. (సెలా. ) అనాదిగానున్న ఆకాశాకాశవాహన మెక్కువానిని కీర్తించుడి ఆయన తన స్వరము వినబడజేయును అది బలమైన స్వరము. దేవునికి బలాతిశయము నారోపించుడి మహిమోన్నతుడై ఆయన ఇశ్రాయేలుమీద ఏలు చున్నాడు అంతరిక్షమున ఆయన బలాతిశయమున్నది తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బలపరాక్రమ ముల ననుగ్రహించుచున్నాడు దేవుడు స్తుతినొందును గాక.