Isaiah · chapter 13 · verse 22
Isaiah 13:22 in Telugu
వారి నగరులలో నక్కలును వారి సుఖవిలాస మందిర ములలో అడవికుక్కలును మొరలిడును ఆ దేశమునకు కాలము సమీపించియున్నది దాని దినములు సంకుచితములు.
Vaari nagarulalo nakkalunu vaari sukhavilaasa mandira mulalo adavikukkalunu moralidunu aa deshamunaku kaalamu sameepinchiyunnadi daani dinamulu sankuchitamulu.
Isaiah 13:22 in English
- King James Version (KJV)
- And the wild beasts of the islands shall cry in their desolate houses, and dragons in [their] pleasant palaces: and her time [is] near to come, and her days shall not be prolonged.
- World English Bible (WEB)
- Hyenas will cry in their fortresses, and jackals in the pleasant palaces. Her time is near to come, and her days will not be prolonged.
- American Standard Version (ASV)
- And wolves shall cry in their castles, and jackals in the pleasant palaces: and her time is near to come, and her days shall not be prolonged.
- Bible in Basic English (BBE)
- And wolves will be answering one another in their towers, and jackals in their houses of pleasure: her time is near, and her days of power will quickly be ended.
- Darby Translation (DBY)
- And jackals shall cry to one another in their palaces, and wild dogs in the pleasant castles. And her time is near to come, and her days shall not be prolonged.
- Webster's Bible (WBS)
- And the wild beasts of the isles shall cry in their desolate houses, and dragons in [their] pleasant palaces: and her time [is] near to come, and her days shall not be prolonged.
- Young's Literal Translation (YLT)
- And Aiim have responded in his forsaken habitations, And dragons in palaces of delight, And near to come [is] her time, And her days are not drawn out!
Read in context
- 20అది మరెన్నడును నివాసస్థలముగా నుండదు తరతరములకు దానిలో ఎవడును కాపురముండడు అరబీయులలో ఒకడైనను అక్కడ తన గుడారము వేయడు గొఱ్ఱెలకాపరులు తమ మందలను అక్కడ పరుండ నియ్యరు
- 21నక్కలు అక్కడ పండుకొనును గురుపోతులు వారి యిండ్లలో ఉండును నిప్పుకోళ్లు అక్కడ నివసించును కొండమేకలు అక్కడ గంతులు వేయును
- 22వారి నగరులలో నక్కలును వారి సుఖవిలాస మందిర ములలో అడవికుక్కలును మొరలిడును ఆ దేశమునకు కాలము సమీపించియున్నది దాని దినములు సంకుచితములు.
Cross references
- Isaiah 35:7 యెషయా 35:7ఎండమావులు మడుగులగును ఎండిన భూమిలో నీటిబుగ్గలు పుట్టును నక్కలు పండుకొనినవాటి ఉనికిపట్టులో జమ్మును తుంగగడ్డియు మేతయు పుట్టును.
- Isaiah 25:2 యెషయా 25:2నీవు పట్టణము దిబ్బగాను ప్రాకారముగల పట్టణము పాడుగాను అన్యుల నగరి పట్టణముగా మరల ఉండకుండ నీవు చేసితివి అది మరల ఎన్నడును కట్టబడకుండ చేసితివి.
- Jeremiah 51:33 యిర్మీయా 51:33ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు బబులోనుపురము చదరముచేయబడిన కళ్లమువలె ఆయెను ఇంక కొంతసేపటికి దానికి కోతకాలము వచ్చును.
- 2 Peter 2:3 2 పేతురు 2:3వారు అధిక లోభులై, కల్పనావాక్యములు చెప్పుచు, మీవలన లాభము సంపాదించుకొందురు; వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు.
- 2 Peter 3:9–10 2 పేతురు 3:9–10కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల ధీర్ఘశాంతముగలవాడై యున్నాడు. అయితే ప్రభువు దినము దొంగవచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించి పోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీదనున్న కృత్యములును కాలిపోవును
- Isaiah 34:13 యెషయా 34:13ఎదోము నగరులలో ముళ్లచెట్లు పెరుగును దాని దుర్గములలో దురదగొండ్లును గచ్చలును పుట్టును అది అడవికుక్కలకు నివాసస్థలముగాను నిప్పుకోళ్లకు సాలగాను ఉండును
- Habakkuk 2:3 హబక్కూకు 2:3ఆ దర్శనవిషయము నిర్ణయకాలమున జరుగును, సమాప్త మగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దానికొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగుచేయక వచ్చును.
- Deuteronomy 32:35 ద్వితీయోపదేశకాండము 32:35వారి కాలు జారుకాలమున పగతీర్చుటయు ప్రతిఫలమిచ్చుటయు నావే; వారి ఆపద్దినము సమీపించును వారి గతి త్వరగా వచ్చును.
- Ezekiel 7:7–10 యెహెజ్కేలు 7:7–10దేశ నివాసులారా, మీమీదికి దుర్దినము వచ్చుచున్నది, సమయము వచ్చుచున్నది, దినము సమీపమాయెను, ఉత్సాహధ్వని కాదు శ్రమధ్వనియే పర్వతములమీద వినబడు చున్నది. ఇంక కొంతసేపటికి నేను నా క్రోధమును నీమీద కుమ్మరింతును, నీమీద నా కోపమును నెరవేర్చుచు నీ ప్రవర్తననుబట్టి నీకు తీర్పుతీర్చి, నీ సమస్త హేయకృత్యముల ఫలము నీమీదికి రప్పించెదను. యెహోవానగు నేనే నిన్ను మొత్తువాడనై యున్నానని నీవెరుగునట్లు నీ యెడల కటాక్షముంచకయు కనికరము చూపకయు నుందును, నీ ప్రవర్తన ఫలము నీవనుభవింపజేసెదను, నీ హేయకృత్యములు నీ మధ్యనుండనిత్తును. ఇదిగో యిదే ఆ దినము, అది వచ్చేయున్నది, ఆ దుర్దినము ఉదయించు చున్నది, ఆ దండము పూచియున్నది, ఆ గర్వము చిగిరించియున్నది, బలాత్కారము పుట్టి దుష్టులను దండించున దాయెను.