Isaiah · chapter 24 · verse 11
Isaiah 24:11 in Telugu
ద్రాక్షారసము లేదని పొలములలో జనులు కేకలు వేయుచున్నారు సంతోషమంతయు అస్తమించెను దేశములో ఆనందము లేదు.
Draakshaarasamu ledani polamulalo janulu kekalu veyuchunnaaru santoshamantayu astaminchenu deshamulo aanandamu ledu.
Isaiah 24:11 in English
- King James Version (KJV)
- [There is] a crying for wine in the streets; all joy is darkened, the mirth of the land is gone.
- World English Bible (WEB)
- There is a crying in the streets because of the wine. All joy is darkened. The mirth of the land is gone.
- American Standard Version (ASV)
- There is a crying in the streets because of the wine; all joy is darkened, the mirth of the land is gone.
- Bible in Basic English (BBE)
- There is a crying in the streets because of the wine; there is an end of all delight, the joy of the land is gone.
- Darby Translation (DBY)
- There is a crying for wine in the streets; all joy is darkened, the mirth of the land is gone;
- Webster's Bible (WBS)
- [There] is a crying for wine in the streets; all joy is darkened, the mirth of the land is gone.
- Young's Literal Translation (YLT)
- A cry over the wine [is] in out-places, Darkened hath been all joy, Removed hath been the joy of the land.
Read in context
- 9పాటలు పాడుచు మనుష్యులు ద్రాక్షారసము త్రాగరు పానము చేయువారికి మద్యము చేదాయెను
- 10నిరాకారమైనపట్టణము నిర్మూలము చేయబడెను ఎవడును ప్రవేశింపకుండ ప్రతి యిల్లు మూయబడి యున్నది.
- 11ద్రాక్షారసము లేదని పొలములలో జనులు కేకలు వేయుచున్నారు సంతోషమంతయు అస్తమించెను దేశములో ఆనందము లేదు.
- 12పట్టణములో పాడు మాత్రము శేషించెను గుమ్మములు విరుగగొట్టబడెను.
- 13ఒలీవ చెట్టును దులుపునప్పుడును ద్రాక్షఫలములకోత తీరినతరువాత పరిగె పండ్లను ఏరు కొనునప్పుడును జరుగునట్లుగా భూమిమధ్య జనములలో జరుగును.
Cross references
- Hosea 7:14 హోషేయ 7:14హృదయ పూర్వకముగా నన్ను బతిమాలుకొనక శయ్యలమీద పరుండి కేకలు వేయుదురు; నన్ను విసర్జించి ధాన్య మద్యములు కావలెనని వారు గుంపులు కూడుదురు.
- Lamentations 5:14–15 విలాపవాక్యములు 5:14–15పెద్దలు గుమ్మములయొద్ద కూడుట మానిరి ¸యౌవనులు సంగీతము మానిరి. సంతోషము మా హృదయమును విడిచిపోయెను నాట్యము దుఃఖముగా మార్చబడియున్నది.
- Isaiah 24:7–9 యెషయా 24:7–9క్రొత్త ద్రాక్షారసము అంగలార్చుచున్నది ద్రాక్షావల్లి క్షీణించుచున్నది సంతోషహృదయులందరు నిట్టూర్పు విడుచు చున్నారు. తంబురల సంతోషనాదము నిలిచిపోయెను ఉల్లసించువారి ధ్వని మానిపోయెను సితారాల యింపైన శబ్దము నిలిచిపోయెను. పాటలు పాడుచు మనుష్యులు ద్రాక్షారసము త్రాగరు పానము చేయువారికి మద్యము చేదాయెను
- Jeremiah 48:33 యిర్మీయా 48:33ఫలభరితమైన పొలములోనుండియు మోయాబు దేశములోనుండియు ఆనందమును సంతోషమును తొలగిపోయెను ద్రాక్షగానుగలలో ద్రాక్షారసమును లేకుండ చేయు చున్నాను జనులు సంతోషించుచు త్రొక్కరు సంతోషము నిస్సంతోషమాయెను.
- Isaiah 16:10 యెషయా 16:10ఆనందసంతోషములు ఫలభరితమైన పొలమునుండి మానిపోయెను ద్రాక్షలతోటలో సంగీతము వినబడదు ఉత్సాహ ధ్వని వినబడదు గానుగులలో ద్రాక్షగెలలను త్రొక్కువాడెవడును లేడు ద్రాక్షలతొట్టి త్రొక్కువాని సంతోషపుకేకలు నేను మాన్పించియున్నాను.
- Luke 16:25 లూకా 16:25అందుకు అబ్రాహాము - కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, ఆలాగుననే లాజరు కష్టము అనుభవించెనని జ్ఞాపకము చేసికొనుము; ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు.
- Amos 5:16–20 ఆమోసు 5:16–20దేవుడును సైన్యములకధిపతియునైన ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగానేను మీ మధ్య సంచరింపబోవు చున్నాను గనుక రాజమార్గములన్నిటిలో అంగలార్పు వినబడును, వీధులన్నిటిలో జనులు కూడి అయ్యో శ్రమ అందురు; అంగలార్చుటకు వారు సేద్యగాండ్రను పిలుతురు; రోదనముచేయ నేర్పుగలవారిని అంగలార్చుటకు పిలిపింతురు. ద్రాక్షతోటలన్నిటిలో రోదనము వినబడును. యెహోవా దినము రావలెనని ఆశపెట్టు కొనియున్న వారలారా, మీకు శ్రమ; యెహోవా దినము వచ్చుటవలన మీకు ప్రయోజనమేమి? అది వెలుగుకాదు, అంధకారము. ఒకడు సింహము నొద్దనుండి తప్పించు కొనగా ఎలుగు బంటి యెదురైనట్టు, వాడు ఇంటిలోనికి పోయి గోడమీద చెయ్యివేయగా పాము వాని కరచి నట్టు ఆ దినముండును. యెహోవా దినము నిజముగా వెలుగైయుండదు కాదా? వెలుగు ఏమాత్రమును లేక అది కారుచీకటిగా ఉండదా?
- Isaiah 8:22 యెషయా 8:22భూమి తట్టు తేరి చూడగా బాధలును అంధకారమును దుస్సహ మైన వేదనయు కలుగును; వారు గాఢాంధకారములోనికి తోలివేయబడెదరు.
- Joel 1:15 యోవేలు 1:15ఆహా, యెహోవా దినము వచ్చెనే అది ఎంత భయంకరమైన దినము! అది ప్రళయమువలెనే సర్వశక్తునియొద్దనుండి వచ్చును.
- Isaiah 9:19 యెషయా 9:19సైన్యముల కధిపతియగు యెహోవా ఉగ్రతవలన దేశము కాలిపోయెను. జనులును అగ్నికి కట్టెలవలె నున్నారు వారిలో ఒకనినొకడు కరుణింపడు.
- Isaiah 32:13 యెషయా 32:13నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనందగృహములన్నిటిలో ముండ్ల తుప్పలును బలురక్కసి చెట్లును పెరుగును. పైనుండి మనమీద ఆత్మ కుమ్మరింపబడువరకు
- Proverbs 31:6 సామెతలు 31:6ప్రాణము పోవుచున్నవానికి మద్యము నియ్యుడి మనోవ్యాకులముగలవారికి ద్రాక్షారసము నియ్యుడి.