Isaiah · chapter 37 · verse 31
Isaiah 37:31 in Telugu
యూదా వంశములో తప్పించు కొనిన శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును.
Yoodaa vanshamulo tappinchu konina sheshamu inkanu krindiki veru tanni meediki edigi phalinchunu.
Isaiah 37:31 in English
- King James Version (KJV)
- And the remnant that is escaped of the house of Judah shall again take root downward, and bear fruit upward:
- World English Bible (WEB)
- The remnant that is escaped of the house of Judah will again take root downward, and bear fruit upward.
- American Standard Version (ASV)
- And the remnant that is escaped of the house of Judah shall again take root downward, and bear fruit upward.
- Bible in Basic English (BBE)
- And those of Judah who are still living will again take root in the earth, and give fruit.
- Darby Translation (DBY)
- And the remnant that is escaped of the house of Judah shall again take root downward, and bear fruit upward;
- Webster's Bible (WBS)
- And the remnant that hath escaped of the house of Judah shall again take root downward, and bear fruit upward:
- Young's Literal Translation (YLT)
- And it hath continued — the escaped Of the house of Judah that hath been left — To take root beneath, And it hath made fruit upward.
Read in context
- 29నామీద నీవు వేయు రంకెలును నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చెను నా గాలము నీ ముక్కునకు తగిలించెదను నా కళ్లెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించెదను నీవు వచ్చిన మార్గముననే నిన్ను మళ్లించెదను.
- 30మరియు యెషయా చెప్పినదేమనగాహిజ్కియా, నీకిదే సూచనయగును. ఈ సంవత్సరమందు దాని అంతట అదే పండు ధాన్యమును, రెండవ సంవత్సరమందు దానినుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు. మూడవ సంవత్సరమున మీరు విత్తనము విత్తి చేలు కోయుదురు; ద్రాక్షతోటలు నాటి వాటిఫలము ననుభవించుదురు.
- 31యూదా వంశములో తప్పించు కొనిన శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును.
- 32శేషించు వారు యెరూషలేములో నుండి బయలుదేరుదురు, తప్పించు కొనినవారు సీయోను కొండలోనుండి బయలుదేరుదురు; సైన్య ములకధిపతియగు యెహోవా ఆసక్తి దీని నెర వేర్చును.
- 33కాబట్టి అష్షూరురాజునుగూర్చి యెహోవా సెలవిచ్చున దేమనగా అతడు ఈ పట్టణములోనికి రాడు; దానిమీద ఒక బాణమైన ప్రయోగింపడు; ఒక కేడెము నైన దానికి కనుపరచడు; దానియెదుట ముట్టడి దిబ్బ కట్టడు.
Cross references
- Isaiah 27:6 యెషయా 27:6రాబోవు దినములలోయాకోబు వేరుపారును ఇశ్రా యేలు చిగిర్చి పూయును. వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు.
- 2 Kings 19:30–31 2 రాజులు 19:30–31యూదా వంశములో తప్పించుకొనిన శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. శేషించు వారు యెరూషలేములోనుండి బయలుదేరుదురు;తప్పించు కొనినవారు సీయోను కొండలోనుండి బయలుదేరుదురు; సైన్యముల కధిపతియగు యెహోవా ఆసక్తి దీని నెర వేర్చును.
- Psalm 80:9 కీర్తనలు 80:9దానికి తగిన స్థలము సిద్ధపరచితివి దాని వేరు లోతుగా పారి అది దేశమంతట వ్యాపిం చెను
- Isaiah 10:20–22 యెషయా 10:20–22ఆ దినమున ఇశ్రాయేలు శేషమును యాకోబు కుటుంబికులలో తప్పించుకొనినవారును తమ్మును హతము చేసినవానిని ఇకను ఆశ్రయింపక సత్యమునుబట్టి ఇశ్రాయేలీయుల పరిశుద్ధదేవుడైన యెహోవాను నిజముగా ఆశ్రయించెదరు. శేషము తిరుగును, యాకోబు శేషము బలవంతుడగు దేవునివైపు తిరుగును. నీ జనులైన ఇశ్రాయేలు సముద్రపు ఇసుకవలె ఉండి నను దానిలో శేషమే తిరుగును, సమూలనాశనము నిర్ణయింపబడెను. నీతి ప్రవాహమువలె వచ్చును
- Romans 11:5 రోమీయులకు 11:5ఆలాగుననే అప్పటికాలమందు సయితము కృపయొక్క యేర్పాటుచొప్పున శేషము మిగిలి యున్నది.
- Romans 9:27 రోమీయులకు 9:27మరియు ప్రభువు తన మాట సమాప్తము చేసి, క్లుప్తపరచి భూలోకమునందు దానిని నెరవేర్చును గనుక ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుకవలె ఉండినను శేషమే రక్షింపబడునని
- Jeremiah 44:28 యిర్మీయా 44:28ఖడ్గము తప్పించుకొనువారు కొద్దిమందియై ఐగుప్తుదేశములో నుండి యూదాదేశమునకు తిరిగి వచ్చెదరు, అప్పడు ఐగుప్తుదేశములో కాపురముండుటకు వెళ్లిన యూదా వారిలో శేషము ఎవరి మాట నిలకడగా నుండునో, నాదో తమదో అది తెలిసికొందురు.
- Isaiah 1:9 యెషయా 1:9సైన్యములకధిపతియగు యెహోవా బహు కొద్దిపాటి శేషము మనకు నిలుపని యెడల మనము సొదొమవలె నుందుము గొమొఱ్ఱాతో సమానముగా ఉందుము.
- Isaiah 65:9 యెషయా 65:9యాకోబునుండి సంతానమును యూదానుండి నా పర్వతములను స్వాధీనపరచుకొనువారిని పుట్టించె దను నేను ఏర్పరచుకొనినవారు దాని స్వతంత్రించు కొందురు నా సేవకులు అక్కడ నివసించెదరు.
- Galatians 3:29 గలతీయులకు 3:29మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రాహాముయొక్క సంతానమైయుండి వాగ్దాన ప్రకారము వారసులైయున్నారు.
- Jeremiah 30:19 యిర్మీయా 30:19వాటిలో కృతజ్ఞతాస్తోత్రములను సంభ్రమ పడువారి స్వరమును వినబడును, జనులు తక్కువ మంది కాకుండ నేను వారిని విస్తరింపజేసెదను, అల్పులు కాకుండ నేను వారిని ఘనులుగా జేసెదను.