Isaiah · chapter 39 · verse 6
Isaiah 39:6 in Telugu
రాబోవు దినములలో ఏమియు మిగులకుండ నీ యింటనున్న సమస్తమును, నేటివరకు నీ పితరులు సమ కూర్చి దాచిపెట్టినది అంతయును బబులోను పట్టణమునకు ఎత్తికొని పోవుదురని సైన్యముల కధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.
Raabovu dinamulalo emiyu migulakunda nee yintanunna samastamunu, netivaraku nee pitarulu sama koorchi daachipettinadi antayunu babulonu pattanamunaku ettikoni povudurani sainyamula kadhipatiyagu yehovaa selavichchuchunnaadu.
Isaiah 39:6 in English
- King James Version (KJV)
- Behold, the days come, that all that [is] in thine house, and [that] which thy fathers have laid up in store until this day, shall be carried to Babylon: nothing shall be left, saith the LORD.
- World English Bible (WEB)
- ‘Behold, the days are coming when all that is in your house, and that which your fathers have stored up until today, will be carried to Babylon. Nothing will be left,’ says the LORD.
- American Standard Version (ASV)
- Behold, the days are coming, when all that is in thy house, and that which thy fathers have laid up in store until this day, shall be carried to Babylon: nothing shall be left, saith Jehovah.
- Bible in Basic English (BBE)
- Truly, the days are coming when everything in your house, and whatever your fathers have put in store till this day, will be taken away to Babylon: all will be gone.
- Darby Translation (DBY)
- Behold, days come when all that is in thy house, and that which thy fathers have laid up until this day, shall be carried to Babylon: nothing shall be left, saith Jehovah.
- Webster's Bible (WBS)
- Behold, the days come, that all that [is] in thy house, and [that] which thy fathers have laid up in store until this day, shall be carried to Babylon: nothing shall be left, saith the LORD.
- Young's Literal Translation (YLT)
- Lo, days are coming, and borne hath been all that [is] in thy house, and that thy fathers have treasured up till this day, to Babylon; there is not left a thing, said Jehovah;
Read in context
- 4నీ యింట వారేమేమి చూచిరని అతడడుగగా హిజ్కియా - నా పదార్థములలో దేనిని మరుగుచేయక నా యింటనున్న సమస్తమును నేను వారికి చూపించియున్నాననెను.
- 5అంతట యెషయా హిజ్కియాతో నిట్లనెనుయెహోవా సెలవిచ్చు మాట వినుము
- 6రాబోవు దినములలో ఏమియు మిగులకుండ నీ యింటనున్న సమస్తమును, నేటివరకు నీ పితరులు సమ కూర్చి దాచిపెట్టినది అంతయును బబులోను పట్టణమునకు ఎత్తికొని పోవుదురని సైన్యముల కధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.
- 7మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్రసంతును బబులోను రాజు నగరునందు నపుంసకులగా చేయుటకై వారు తీసికొనిపోవుదురు.
- 8అందుకు హిజ్కియా - నీవు తెలియజేసిన యెహోవాఆజ్ఞ చొప్పున జరుగుట మేలే; నా దినములలో సమాధాన సత్యములు కలుగునుగాక అని యెషయాతో అనెను.
Cross references
- 2 Kings 25:13–15 2 రాజులు 25:13–15మరియు యెహోవా మందిరమందున్న యిత్తిడి స్తంభములను మట్లను యెహోవా మందిరమందున్న యిత్తడి సముద్రమును కల్దీయులు తునకలుగా కొట్టి, ఆ యిత్తడిని బబులోను పట్టణమునకు ఎత్తికొనిపోయిరి. సేవకొరకై యుంచబడిన పాత్రలను చేటలను ముండ్లను ధూపార్తులను ఇత్తడి ఉపకరణములన్నిటిని వారు తీసికొని పోయిరి. అగ్నిపాత్రలు గిన్నెలు మొదలైన వెండి వస్తువులను బంగారు వస్తువులను రాజదేహసంరక్షకుల అధిపతి తీసికొనిపోయెను.
- Jeremiah 20:5 యిర్మీయా 20:5ఈ పట్టణములోని ఐశ్వర్యమంతయు దానికి వచ్చిన లాభ మంతయు దాని అమూల్యవస్తువులన్నియు యూదా రాజుల నిధులన్నియు నేనప్పగింతును, వారి శత్రువుల చేతికే వాటి నప్పగింతును, శత్రువులు వాటిని దోచుకొని పట్టుకొని బబులోనునకు తీసికొనిపోవుదురు.
- 2 Kings 24:13 2 రాజులు 24:13మరియు అతడు యెహోవా మందిరపు ధననిధిలోనున్న పదార్థములను, రాజు ఖజానాలోనున్న సొమ్మును, పట్టుకొని ఇశ్రాయేలు రాజైన సొలొమోను యెహోవా ఆలయమునకు చేయించిన బంగారపు ఉపకరణములన్నిటిని యెహోవా సెలవిచ్చిన మాటచొప్పున తునకలుగా చేయించి యెత్తికొని పోయెను.
- Daniel 1:2 దానియేలు 1:2ప్రభువు యూదారాజగు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను, ఆ రాజుచేతి కప్పగించెను గనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశము లోని తన దేవతాలయమునకు తీసికొనిపోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను.
- 2 Kings 20:17–19 2 రాజులు 20:17–19వచ్చు దినములలో ఏమియు మిగులకుండ నీ నగరునందున్న సమస్తమును, నేటివరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టిన దంతయును బబులోను పట్టణమునకు ఎత్తికొని పోబడునని యెహోవా సెలవిచ్చు చున్నాడు. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్రసంతును బబులోనురాజు నగరునందు నపుంసకులగా చేయుటకై వారు తీసికొని పోవుదురు. అందుకు హిజ్కియానీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే; నా దినములలో సమాధానము సత్యము కలిగిన యెడల మేలేగదా అని యెషయాతో అనెను.
- 2 Chronicles 36:18 2 దినవృత్తాంతములు 36:18మరియు బబులోనురాజు పెద్దవేమి చిన్నవేమి దేవుని మందిరపు ఉపకరణములన్నిటిని, యెహోవా మంది రపు నిధులలోనిదేమి రాజు నిధులలోనిదేమి అధిపతుల నిధులలోనిదేమి, దొరకిన ద్రవ్యమంతయు బబులోనునకు తీసికొనిపోయెను.
- Jeremiah 27:21–22 యిర్మీయా 27:21–22యెహోవా మందిరములోను యూదారాజు నగరులోను యెరూషలేములోను శేషించిన ఉపకరణములనుగూర్చి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునైన యెహోవా ఈలాగుననే సెలవిచ్చుచున్నాడు అవి బబులోనునకు తేబడును, నేను ఆ ఉపకరణములను దర్శించి తెప్పించి యీ స్థలములో వాటిని మరల నుంచు కాలము వరకు అవి అక్కడ నుండవలెను; ఇదే యెహోవా వాక్కు.
- Jeremiah 52:17–19 యిర్మీయా 52:17–19మరియు యెహోవా మందిరములోనుండిన ఇత్తడి స్తంభ ములను మందిరములోనుండిన మట్లను ఇత్తడి సముద్రమును కల్దీయులు తునకలుగా కొట్టి ఆ ఇత్తడి అంతయు బబు లోనునకు గొనిపోయిరి. అదియుగాక వారు బిందెలను కుండలను కత్తెరలను గిన్నెలను గరిటెలను యాజకులు సేవ చేయు ఇత్తడి ఉపకరణములన్నిటిని గొనిపోయిరి. మరియు పళ్లెములను ధూపార్తులను గిన్నెలను పాత్రలను, బంగారు వాటిని బంగారునకును వెండివాటిని వెండికిని చేర్చుకొని రాజదేహసంరక్షకుల యధిపతి గొనిపోయెను.
- 2 Chronicles 36:10 2 దినవృత్తాంతములు 36:10ఏడాదినాటికి, రాజైన నెబుకద్నెజరు దూతలను పంపి యెహోయాకీనును బబులోనునకు రప్పించి, అతని సహో దరుడైన సిద్కియాను యూదామీదను యెరూషలేము మీదను రాజుగా నియమించెను. మరియు అతడు రాజు వెంట యెహోవా మందిరములోని ప్రశస్తమైన ఉపకరణ ములను తెప్పించెను.