Isaiah · chapter 47 · verse 14
Isaiah 47:14 in Telugu
వారు కొయ్యకాలువలెనైరి అగ్ని వారిని కాల్చివేయుచున్నది జ్వాలయొక్క బలమునుండి తమ్ముతాము తప్పించుకొన లేక యున్నారు అది కాచుకొనుటకు నిప్పుకాదు ఎదుట కూర్చుండి కాచుకొనదగినది కాదు.
Vaaru koyyakaaluvalenairi agni vaarini kaalchiveyuchunnadi jvaalayokka balamunundi tammutaamu tappinchukona leka yunnaaru adi kaachukonutaku nippukaadu eduta koorchundi kaachukonadaginadi kaadu.
Isaiah 47:14 in English
- King James Version (KJV)
- Behold, they shall be as stubble; the fire shall burn them; they shall not deliver themselves from the power of the flame: [there shall] not [be] a coal to warm at, [nor] fire to sit before it.
- World English Bible (WEB)
- Behold, they are like stubble. The fire will burn them. They won’t deliver themselves from the power of the flame. It won’t be a coal to warm at or a fire to sit by.
- American Standard Version (ASV)
- Behold, they shall be as stubble; the fire shall burn them; they shall not deliver themselves from the power of the flame: it shall not be a coal to warm at, nor a fire to sit before.
- Bible in Basic English (BBE)
- Truly, they have become like dry stems, they have been burned in the fire; they are not able to keep themselves safe from the power of the flame: it is not a coal for warming them, or a fire by which a man may be seated.
- Darby Translation (DBY)
- Behold, they shall be as stubble, the fire shall burn them; they shall not deliver themselves from the power of the flame: there shall not be a coal to warm at, [nor] fire to sit before it.
- Webster's Bible (WBS)
- Behold, they shall be as stubble; the fire shall burn them; they shall not deliver themselves from the power of the flame: [there shall] not [be] a coal to warm at, [nor] fire to sit before it.
- Young's Literal Translation (YLT)
- Lo, they have been as stubble! Fire hath burned them, They deliver not themselves from the power of the flame, There is not a coal to warm them, a light to sit before it.
Read in context
- 12నీ బాల్యమునుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణపిశాచ తంత్రములను నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువుము ఒకవేళ అవి నీకు ప్రయోజనములగునేమో ఒకవేళ నీవు మనుష్యులను బెదరింతువేమో
- 13నీ విస్తారమైన యోచనలవలన నీవు అలసియున్నావు జ్యోతిష్కులు నక్షత్రసూచకులు మాసచర్య చెప్పు వారు నిలువబడి నీమీదికి వచ్చునవి రాకుండ నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించుము.
- 14వారు కొయ్యకాలువలెనైరి అగ్ని వారిని కాల్చివేయుచున్నది జ్వాలయొక్క బలమునుండి తమ్ముతాము తప్పించుకొన లేక యున్నారు అది కాచుకొనుటకు నిప్పుకాదు ఎదుట కూర్చుండి కాచుకొనదగినది కాదు.
- 15నీవు ఎవరికొరకు ప్రయాసపడి అలసితివో వారికి ఆలాగే జరుగుచున్నది నీ బాల్యము మొదలుకొని నీతో వ్యాపారము చేయు వారు తమ తమ చోట్లకు వెళ్లిపోవుచున్నారు నిన్ను రక్షించువాడొకడైన నుండడు.
Cross references
- Malachi 4:1 మలాకీ 4:1ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును;గర్విష్ఠులందరును దుర్మార్గు లందరును కొయ్యకాలువలె ఉందురు, వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండ, రాబోవు దినము అందరిని కాల్చివేయునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.
- Nahum 1:10 నహూము 1:10ముండ్లకంపవలె శత్రువులు కూడినను వారు ద్రాక్షారసము త్రాగి మత్తులైనను ఎండి పోయిన చెత్తవలె కాలిపోవుదురు.
- Isaiah 10:17 యెషయా 10:17ఇశ్రాయేలుయొక్క వెలుగు అగ్నియును అతని పరిశుద్ధ దేవుడు జ్వాలయునగును; అది అష్షూరుయొక్క బలురక్కసిచెట్లకును గచ్చ పొదలకును అంటుకొని ఒక్కదినమున వాటిని మింగివేయును.
- Ezekiel 15:7 యెహెజ్కేలు 15:7నేను వారిమీద కఠిన దృష్టి నిలుపుదును, వారు అగ్నిని తప్పించుకొనినను అగ్నియే వారిని దహించును; వారి యెడల నేను కఠిన దృష్టిగలవాడనై యుండగా నేనే యెహోవానని మీరు తెలిసికొందురు.
- Isaiah 41:2 యెషయా 41:2తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించువానిని తూర్పు నుండి రేపి పిలిచినవాడెవడు? ఆయన అతనికి జనములను అప్పగించుచున్నాడు రాజులను లోపరచుచున్నాడు ధూళివలెవారిని అతని ఖడ్గమునకు అప్పగించుచున్నాడు ఎగిరిపోవు పొట్టువలె అతని వింటికి వారిని అప్పగించు చున్నాడు.
- Matthew 10:28 మత్తయి 10:28మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని, ఆత్మను దేహమునుకూడ నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి.
- Isaiah 5:24 యెషయా 5:24సైన్యములకధిపతియగు యెహోవాయొక్క ధర్మ శాస్త్రమును నిర్లక్ష్యపెట్టుదురు ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుని వాక్కును తృణీక రించుదురు. కాబట్టి అగ్నిజ్వాల కొయ్యకాలును కాల్చివేయు నట్లు ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారి వేరు కుళ్లి పోవును వారి పువ్వు ధూళివలె పైకి ఎగిరిపోవును.
- Isaiah 30:14 యెషయా 30:14కుమ్మరి కుండ పగులగొట్టబడునట్లు ఆయన ఏమియు విడిచిపెట్టక దాని పగులగొట్టును పొయిలోనుండి నిప్పు తీయుటకు గాని గుంటలోనుండి నీళ్లు తీయుటకు గాని దానిలో ఒక్క పెంకైనను దొరకదు.
- Revelation 18:21 ప్రకటన 18:21తరువాత బలిష్ఠుడైన యొక దూత గొప్ప తిరుగటి రాతివంటి రాయి యెత్తి సముద్రములో పడవేసి ఈలాగు మహాపట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడి ఇక ఎన్నటికిని కనబడకపోవును.
- Joel 2:5 యోవేలు 2:5రథములు ధ్వని చేయునట్లు కొయ్యకాలు అగ్నిలో కాలుచు ధ్వని చేయునట్లు యుద్ధమునకు సిద్ధమైన శూరులు ధ్వని చేయునట్లు అవి పర్వతశిఖరములమీద గంతులు వేయుచున్నవి.
- Isaiah 40:24 యెషయా 40:24వారు నాటబడగనే విత్తబడగనే వారి మొదలు భూమిలో వేరు తన్నకమునుపే ఆయన వారిమీద ఊదగా వారు వాడిపోవుదురు సుడిగాలి పొట్టును ఎగరగొట్టునట్లు ఆయన వారిని ఎగరగొట్టును.
- Psalm 83:13–15 కీర్తనలు 83:13–15నా దేవా, సుడి తిరుగు ధూళివలెను గాలి యెదుటి వగుడాకులవలెను వారిని చేయుము అగ్ని అడవిని కాల్చునట్లు కారుచిచ్చు కొండలను తగుల పెట్టునట్లు నీ తుపానుచేత వారిని తరుముము నీ సుడిగాలిచేత వారికి భీతి పుట్టించుము.