Isaiah · chapter 49 · verse 20
Isaiah 49:20 in Telugu
నీవు సంతానహీనురాలవైనప్పుడు నీకు పుట్టిన కుమా రులు ఈ స్థలము మాకు ఇరుకుగా ఉన్నది. ఇంక విశాలమైన స్థలము మాకిమ్మని నీ చెవులలో చెప్పుదురు.
Neevu santaanaheenuraalavainappudu neeku puttina kumaa rulu ee sthalamu maaku irukugaa unnadi. Inka vishaalamaina sthalamu maakimmani nee chevulalo cheppuduru.
Isaiah 49:20 in English
- King James Version (KJV)
- The children which thou shalt have, after thou hast lost the other, shall say again in thine ears, The place [is] too strait for me: give place to me that I may dwell.
- World English Bible (WEB)
- The children of your bereavement will say in your ears, ‘This place is too small for me. Give me a place to live in.’
- American Standard Version (ASV)
- The children of thy bereavement shall yet say in thine ears, The place is too strait for me; give place to me that I may dwell.
- Bible in Basic English (BBE)
- The children to whom you gave birth in other lands will say in your ears, The place is not wide enough for me: make room for me to have a resting-place.
- Darby Translation (DBY)
- The children of thy bereavement shall yet say in thine ears, The place is too narrow for me: make room for me, that I may dwell.
- Webster's Bible (WBS)
- The children which thou shalt have, after thou hast lost the other, shall say again in thy ears, The place [is] too narrow for me: give place to me that I may dwell.
- Young's Literal Translation (YLT)
- Again do the sons of thy bereavement say in thine ears: 'The place is too strait for me, Come nigh to me — and I dwell.'
Read in context
- 18కన్నులెత్తి నలుదిశల చూడుము వీరందరు కూడుకొనుచు నీయొద్దకు వచ్చుచున్నారు నీవు వీరినందరిని ఆభరణముగా ధరించుకొందువు పెండ్లికుమార్తె ఒడ్డాణము ధరించుకొనునట్లు నీవు వారిని అలంకారముగా ధరించుకొందువు నా జీవముతోడని ప్రమాణము చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
- 19నివాసులు విస్తరించినందున పాడైన నీ చోట్లును బీటి స్థలములును నాశనము చేయబడిన నీ భూమియు వారికి ఇరుకుగా ఉండును నిన్ను మింగివేసినవారు దూరముగా ఉందురు.
- 20నీవు సంతానహీనురాలవైనప్పుడు నీకు పుట్టిన కుమా రులు ఈ స్థలము మాకు ఇరుకుగా ఉన్నది. ఇంక విశాలమైన స్థలము మాకిమ్మని నీ చెవులలో చెప్పుదురు.
- 21అప్పుడు నీవునేను నా పిల్లలను పోగొట్టుకొని, సంతానహీనురాలను, ఒంటరినై ఇటు అటు తిరుగులాడుచున్న పరదేశురాలనే గదా? వీరిని నాయందు కనినవాడెవడు? వీరిని పెంచినవా డెవడు? నేను ఒంటరికత్తెనై విడువబడితిని, వీరు ఎక్కడ ఉండిరి? అని నీ మనస్సులో నీవనుకొందువు.
- 22ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను జనములతట్టు నా చెయియెత్తుచున్నాను జనములతట్టు నా ధ్వజము ఎత్తుచున్నాను వారు నీ కుమారులను రొమ్ముననుంచుకొని వచ్చెదరు నీ కుమార్తెలు వారి భుజములమీద మోయబడెదరు
Cross references
- Joshua 17:14–16 యెహోషువ 17:14–16అప్పుడు యోసేపు పుత్రులు యెహోషువతోమా కేల ఒక్క చీటితో ఒక్క వంతునే స్వాస్థ్యముగా ఇచ్చితివి? మేము ఒక గొప్ప జనమేగదా? ఇదివరకు యెహోవా మమ్మును దీవించెనని మనవిచేయగా యెహోషువమీరు గొప్ప జనము గనుక ఎఫ్రాయిమీయులయొక్క మన్యము మీకు ఇరుకుగా నున్న యెడల మీరు అడవికి పోయి అక్కడ పెరిజ్జీయుల దేశములోను రెఫాయీయుల దేశములోను మీకు మీరే చెట్లు నరకుకొనుడని వారితో చెప్పెను. అందుకు యోసేపు పుత్రులుఆ మన్యము మాకుచాలదు; అదియుగాక పల్లపుచోటున నివసించు కనానీయుల కందరికి, అనగా బేత్షెయానులోనివారికిని దాని పురముల లోని వారికిని యెజ్రెయేలు లోయలోని వారికిని ఇనుప రథములున్నవనిరి.
- Isaiah 60:4 యెషయా 60:4కన్నులెత్తి చుట్టు చూడుము వీరందరు కూడుకొని నీయొద్దకు వచ్చుచున్నారు నీ కుమారులు దూరమునుండి వచ్చుచున్నారు నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు.
- Matthew 3:9 మత్తయి 3:9దేవుడు ఈ రాళ్లవలన అబ్రాహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను.
- 2 Kings 6:1 2 రాజులు 6:1అంతట ప్రవక్తల శిష్యులు ఎలీషాయొద్దకు వచ్చిఇదిగో నీయొద్ద మాకున్న స్థలము ఇరుకుగా నున్నది;
- Isaiah 54:1–3 యెషయా 54:1–3గొడ్రాలా, పిల్లలు కననిదానా, జయగీతమెత్తుము ప్రసవవేదన పడనిదానా, జయకీర్తన నెత్తి ఆనంద పడుము సంసారిపిల్లలకంటె విడువబడినదాని పిల్లలు విస్తార మగుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ గుడారపు స్థలమును విశాలపరచుము నీ నివాసస్థలముల తెరలు నిరాటంకముగ సాగనిమ్ము, నీ త్రాళ్లను పొడుగుచేయుము నీ మేకులను దిగగొట్టుము. కుడివైపునకును ఎడమవైపునకును నీవు వ్యాపించెదవు నీ సంతానము అన్యజనముల దేశమును స్వాధీనపరచు కొనును పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయును.
- Isaiah 51:3 యెషయా 51:3యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు దాని పాడైన స్థలములన్నిటిని ఆదరించి దాని అరణ్యస్థలములను ఏదెనువలె చేయుచున్నాడు దాని యెడారి భూములు యెహోవా తోటవలె నగు నట్లు చేయుచున్నాడు ఆనంద సంతోషములును కృతజ్ఞతాస్తుతియు సంగీతగానమును దానిలో వినబడును
- Galatians 4:26–28 గలతీయులకు 4:26–28అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది; అది మనకుతల్లి. ఇందుకుకనని గొడ్రాలా సంతోషించుము, ప్రసవవేదనపడని దానా, బిగ్గరగా కేకలువేయుము; ఏలయనగా పెనిమిటిగలదాని పిల్లలకంటె పెనిమిటి లేనిదాని పిల్లలు ఎక్కువమంది ఉన్నారు అని వ్రాయబడియున్నది. సహోదరులారా, మనమును ఇస్సాకువలె వాగ్దానమునుబట్టి పుట్టిన కుమారులమై యున్నాము.
- Hosea 1:10 హోషేయ 1:10ఇశ్రాయేలీయుల జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారమగును; ఏ స్థలమందుమీరు నా జనులు కారన్నమాట జనులు వారితో చెప్పుదురో ఆ స్థలముననేమీరు జీవముగల దేవుని కుమారులైయున్నా రని వారితో చెప్పుదురు.