Isaiah · chapter 65 · verse 11
Isaiah 65:11 in Telugu
యెహోవాను విసర్జించి నా పరిశుద్ధపర్వతమును మరచి గాదునకు బల్లను సిద్ధపరచువారలారా, అదృష్టదేవికి పానీయార్పణము నర్పించువారలారా, నేను పిలువగా మీరు ఉత్తరమియ్యలేదు
Yehovaanu visarjinchi naa parishuddhaparvatamunu marachi gaadunaku ballanu siddhaparachuvaaralaaraa, adrushtadeviki paaneeyaarpanamu narpinchuvaaralaaraa, nenu piluvagaa meeru uttaramiyyaledu
Isaiah 65:11 in English
- King James Version (KJV)
- But ye [are] they that forsake the LORD, that forget my holy mountain, that prepare a table for that troop, and that furnish the drink offering unto that number.
- World English Bible (WEB)
- “But you who forsake the LORD, who forget my holy mountain, who prepare a table for Fortune, and who fill up mixed wine to Destiny;
- American Standard Version (ASV)
- But ye that forsake Jehovah, that forget my holy mountain, that prepare a table for Fortune, and that fill up mingled wine unto Destiny;
- Bible in Basic English (BBE)
- But as for you who have given up the Lord, who have no care for my holy mountain, who get ready a table for Chance, and make offerings of mixed wine to Fate;
- Darby Translation (DBY)
- But ye who forsake Jehovah, who forget my holy mountain, who prepare a table for Gad, and fill up mixed wine unto Meni:
- Webster's Bible (WBS)
- But ye [are] they that forsake the LORD, that forget my holy mountain, that prepare a table for that troop, and that furnish the drink-offering to that number.
- Young's Literal Translation (YLT)
- And ye [are] those forsaking Jehovah, Who are forgetting My holy mountain, Who are setting in array for Gad a table, And who are filling for Meni a mixture.
Read in context
- 9యాకోబునుండి సంతానమును యూదానుండి నా పర్వతములను స్వాధీనపరచుకొనువారిని పుట్టించె దను నేను ఏర్పరచుకొనినవారు దాని స్వతంత్రించు కొందురు నా సేవకులు అక్కడ నివసించెదరు.
- 10నన్నుగూర్చి విచారణచేసిన నా ప్రజలనిమిత్తము షారోను గొఱ్ఱెల మేతభూమియగును ఆకోరు లోయ పశువులు పరుండు స్థలముగా ఉండును.
- 11యెహోవాను విసర్జించి నా పరిశుద్ధపర్వతమును మరచి గాదునకు బల్లను సిద్ధపరచువారలారా, అదృష్టదేవికి పానీయార్పణము నర్పించువారలారా, నేను పిలువగా మీరు ఉత్తరమియ్యలేదు
- 12నేను మాటలాడగా మీరు ఆలకింపక నా దృష్టికి చెడ్డదైనదాని చేసితిరి నాకిష్టము కానిదాని కోరితిరి నేను ఖడ్గమును మీకు అదృష్టముగా నియమించుదును మీరందరు వధకు లోనగుదురు.
- 13కావున ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చు చున్నాడు ఆలకించుడి నా సేవకులు భోజనముచేయుదురు గాని మీరు ఆకలిగొనెదరు నా సేవకులు పానము చేసెదరు గాని మీరు దప్పిగొనెదరు. నా సేవకులు సంతోషించెదరు గాని మీరు సిగ్గుపడెదరు
Cross references
- Deuteronomy 32:17 ద్వితీయోపదేశకాండము 32:17వారు దేవత్వములేని దయ్యములకు తామెరుగని దేవతలకు క్రొత్తగా పుట్టిన దేవతలకు తమ పితరులు భయపడని దేవతలకు బలి అర్పించిరి.
- Isaiah 2:2 యెషయా 2:2అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటె ఎత్తుగా ఎత్తబడును ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు
- Isaiah 1:28 యెషయా 1:28అతిక్రమము చేయువారును పాపులును నిశ్శేషముగా నాశనమగుదురు యెహోవాను విసర్జించువారు లయమగుదురు.
- 1 Corinthians 10:20–21 1 కొరింథీయులకు 10:20–21లేదు గాని, అన్యజనులర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించు చున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలి వారవుట నాకిష్టము లేదు. మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడ త్రాగనేరరు; ప్రభువు బల్లమీద ఉన్నదానిలోను దయ్యముల బల్లమీదఉన్న దానిలోను కూడ పాలుపొందనేరరు.
- Isaiah 65:25 యెషయా 65:25తోడేళ్లును గొఱ్ఱెపిల్లలును కలిసి మేయును సింహము ఎద్దువలె గడ్డి తినును సర్పమునకు మన్ను ఆహారమగును నా పరిశుద్ధపర్వతములో అవి హానియైనను నాశనమైనను చేయకుండును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
- 1 Chronicles 28:9 1 దినవృత్తాంతములు 28:9సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రియొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటిని సంకల్పములన్నిటిని ఎరిగినవాడునై యున్నాడు. నీవు ఆయనను తెలిసికొని హృదయపూర్వకముగాను మనః పూర్వకముగాను ఆయనను సేవించుము, ఆయనను వెదకినయెడల ఆయన నీకు ప్రత్యక్షమగును, నీవు ఆయనను విసర్జించినయెడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసి వేయును.
- Deuteronomy 29:24–25 ద్వితీయోపదేశకాండము 29:24–25యెహోవా దేని బట్టి యీ దేశమును ఇట్లు చేసెనో? యీ మహా కోపాగ్నికి హేతువేమో? అని చెప్పుకొందురు. మరియు వారువారి పితరుల దేవుడైన యెహోవా ఐగుప్తు దేశములోనుండి వారిని రప్పించిన తరువాత ఆయన తమతో చేసిన నిబంధనను వారు నిరాకరించిరి
- Isaiah 57:13 యెషయా 57:13నీవు మొఱ్ఱపెట్టునప్పుడు నీ విగ్రహముల గుంపు నిన్ను తప్పించునేమో గాలి వాటినన్నిటిని ఎగరగొట్టును గదా? ఒకడు ఊపిరి విడిచినమాత్రమున అవియన్నియు కొట్టుకొనిపోవును నన్ను నమ్ముకొనువారు దేశమును స్వతంత్రించు కొందురు నా పరిశుద్ధ పర్వతమును స్వాధీనపరచుకొందురు.
- Hebrews 12:22 హెబ్రీయులకు 12:22ఇప్పుడైతే సీయోనను కొండకును జీవముగల దేవుని పట్టణమునకు, అనగా పరలోకపు యెరూషలేమునకును, వేవేలకొలది దేవదూతలయొద్దకును,
- Isaiah 56:7 యెషయా 56:7నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసెదను నా బలిపీఠముమీద వారర్పించు దహనబలులును బలులును నాకు అంగీకారములగును నా మందిరము సమస్తజనులకు ప్రార్థనమందిరమన బడును.
- Isaiah 57:5–10 యెషయా 57:5–10మస్తచావృక్షములను చూచి పచ్చని ప్రతిచెట్టు క్రిందను కామము రేపుకొనువారలారా, లోయలలో రాతిసందులక్రింద పిల్లలను చంపువార లారా, నీ భాగ్యము లోయలోని రాళ్లలోనే యున్నది అవియే నీకు భాగ్యము, వాటికే పానీయార్పణము చేయుచున్నావు వాటికే నైవేద్యము నర్పించుచున్నావు. ఇవన్నియు జరుగగా నేను ఊరకుండదగునా? ఉన్నతమైన మహాపర్వతముమీద నీ పరుపు వేసి కొంటివి బలి అర్పించుటకు అక్కడికే యెక్కితివి తలుపువెనుకను ద్వారబంధము వెనుకను నీ జ్ఞాపకచిహ్నము ఉంచితివి నాకు మరుగై బట్టలు తీసి మంచమెక్కితివి నీ పరుపు వెడల్పుచేసికొని నీ పక్షముగా వారితో నిబంధన చేసితివి నీవు వారి మంచము కనబడిన చోట దాని ప్రేమిం చితివి. నీవు తైలము తీసికొని రాజునొద్దకు పోతివి పరిమళ ద్రవ్యములను విస్తారముగా తీసికొని నీ రాయబారులను దూరమునకు పంపితివి పాతాళమంత లోతుగా నీవు లొంగితివి నీ దూరప్రయాణముచేత నీవు ప్రయాసపడినను అది అసాధ్యమని నీవనుకొనలేదు నీవు బలము తెచ్చుకొంటిని గనుక నీవు సొమ్మసిల్లలేదు.
- Psalm 132:13 కీర్తనలు 132:13యెహోవా సీయోనును ఏర్పరచుకొని యున్నాడు. తనకు నివాసస్థలముగా దానిని కోరుకొని యున్నాడు.