Jeremiah · chapter 1 · verse 6
Jeremiah 1:6 in Telugu
అందుకు అయ్యో ప్రభువగు యెహోవా, చిత్తగించుము నేను బాలుడనే; మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేననగా
Anduku ayyo prabhuvagu yehovaa, chittaginchumu nenu baaludane; maatalaadutaku naaku shakti chaaladani nenanagaa
Jeremiah 1:6 in English
- King James Version (KJV)
- Then said I, Ah, Lord GOD! behold, I cannot speak: for I [am] a child.
- World English Bible (WEB)
- Then I said, “Ah, Lord GOD! Behold, I don’t know how to speak; for I am a child.”
- American Standard Version (ASV)
- Then said I, Ah, Lord Jehovah! behold, I know not how to speak; for I am a child.
- Bible in Basic English (BBE)
- Then said I, O Lord God! see, I have no power of words, for I am a child.
- Darby Translation (DBY)
- And I said, Alas, Lord Jehovah! behold, I cannot speak; for I am a child.
- Webster's Bible (WBS)
- Then said I, Ah, Lord GOD! behold, I cannot speak: for I [am] a child.
- Young's Literal Translation (YLT)
- And I say, 'Ah, Lord Jehovah! lo, I have not known — to speak, for I [am] a youth.'
Read in context
- 4యెహోవావాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
- 5గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని, నీవు గర్భమునుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని.
- 6అందుకు అయ్యో ప్రభువగు యెహోవా, చిత్తగించుము నేను బాలుడనే; మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేననగా
- 7యెహోవా నాకీలాగు సెలవిచ్చెను - నేను బాలుడననవద్దు; నేను నిన్ను పంపువారందరియొద్దకు నీవు పోవలెను, నీకాజ్ఞాపించిన సంగతులన్నియు చెప్ప వలెను.
- 8వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైయున్నాను; ఇదే యెహోవా వాక్కు.
Cross references
- Exodus 4:10–16 నిర్గమకాండము 4:10–16అప్పుడు మోషే ప్రభువా, ఇంతకు మునుపైనను, నీవు నీ దాసునితో మాటలాడి నప్పటినుండి యైనను, నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా యెహోవా మానవునకు నోరిచ్చినవాడు ఎవడు? మూగ వానినేగాని చెవిటివానినేగాని దృష్టిగలవానినేగాని గ్రుడ్డివానినేగాని పుట్టించినవాడెవడు? యెహోవానైన నేనే గదా. కాబట్టి వెళ్లుము, నేను నీ నోటికి తోడైయుండి, నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించెదనని అతనితో చెప్పెను. అందుకతడు అయ్యో ప్రభువా, నీవు పంప తలంచిన వానినే పంపుమనగా ఆయన మోషే మీద కోపపడి లేవీయుడగు నీ అన్నయైన అహరోను లేడా? అతడు బాగుగా మాటలాడగలడని నేనెరుగుదును, ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొనవచ్చుచున్నాడు, అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును; నీవు అతనితో మాటలాడి అతని నోటికి మాటలు అందించవలెను, నేను నీ నోటికి అతని నోటికి తోడైయుండి, మీరు చేయవలసినదానిని మీకు బోధించెదను. అతడే నీకు బదులు జనులతో మాటలాడును, అతడే నీకు నోరుగానుండును, నీవు అతనికి దేవుడవుగా ఉందువు.
- Exodus 6:12 నిర్గమకాండము 6:12అప్పుడు మోషే చిత్తగించుము, ఇశ్రాయేలీయులే నా మాట వినలేదు; మాటమాంద్యము గలవాడనగు నా మాట ఫరో యెట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను.
- 1 Kings 3:7–9 1 రాజులు 3:7–9నా దేవా యెహోవా, నీవు నా తండ్రియైన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి యున్నావు; అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు; నీ దాసుడనైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను; వారు విస్తరించియున్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాలదేశమును తనకీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవ్వడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్లు నీ దాసుడనైన నాకు వివేకముగల హృదయము దయ చేయుము.
- Jeremiah 32:17 యిర్మీయా 32:17యెహోవా, ప్రభువా సైన్య ములకధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా, నీ యధికబలముచేతను చాచిన బాహువుచేతను భూమ్యాకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనదేదియు లేదు.
- Exodus 6:30 నిర్గమకాండము 6:30మోషే చిత్తగించుము; నేను మాట మాంద్యము గలవాడను, ఫరో నా మాట యెట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను.
- Jeremiah 14:13 యిర్మీయా 14:13అందుకు నేను అయ్యో, ప్రభువైన యెహోవామీరు ఖడ్గము చూడరు మీకు క్షామము కలుగదు, ఈ చోటను నేను స్థిరమైన సమాధానము మీకిచ్చెదనని ప్రవక్తలు వారితో చెప్పుచున్నారవి నేననగా
- Exodus 4:1 నిర్గమకాండము 4:1అందుకు మోషే - చిత్తగించుము; వారు నన్ను నమ్మరు నా మాట వినరు - యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని ఉత్తరమియ్యగా
- Jeremiah 4:10 యిర్మీయా 4:10అప్పుడు నేనిట్లంటిని కటకటా, యెహోవా ప్రభువా, ఖడ్గము హత్యచేయుచుండగా నీవుమీకు క్షేమము కలుగునని చెప్పి నిశ్చయముగా ఈ ప్రజలను యెరూషలేమును బహుగా మోసపుచ్చితివి.
- Isaiah 6:5 యెషయా 6:5నేను అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను; అపవిత్రమైన పెదవులుగల జనుల మధ్యను నివసించు వాడను; నేను నశించితిని; రాజును సైన్యములకధిపతియునగు యెహోవాను నేను కన్నులార చూచితిననుకొంటిని.