Jeremiah · chapter 22 · verse 6
Jeremiah 22:6 in Telugu
యూదారాజు వంశస్థులనుగూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నా యెన్నికలో నీవు గిలాదువలెనున్నావు, లెబానోను శిఖరమువలె ఉన్నావు; అయినను నిశ్చయముగా ఎడారిగాను నివాసులు లేని పట్టణములుగాను నేను నిన్ను చేయుదును.
Yoodaaraaju vanshasthulanugoorchi yehovaa eelaagu selavichchuchunnaadu naa yennikalo neevu gilaaduvalenunnaavu, lebaanonu shikharamuvale unnaavu; ayinanu nishchayamugaa edaarigaanu nivaasulu leni pattanamulugaanu nenu ninnu cheyudunu.
Jeremiah 22:6 in English
- King James Version (KJV)
- For thus saith the LORD unto the king’s house of Judah; Thou [art] Gilead unto me, [and] the head of Lebanon: [yet] surely I will make thee a wilderness, [and] cities [which] are not inhabited.
- World English Bible (WEB)
- For the LORD says concerning the house of the king of Judah: “You are Gilead to me, the head of Lebanon. Yet surely I will make you a wilderness, cities which are not inhabited.
- American Standard Version (ASV)
- For thus saith Jehovah concerning the house of the king of Judah: Thou art Gilead unto me, [and] the head of Lebanon; [yet] surely I will make thee a wilderness, [and] cities which are not inhabited.
- Bible in Basic English (BBE)
- For this is what the Lord has said about the family of the king of Judah: You are Gilead to me, and the top of Lebanon: but, truly, I will make you waste, with towns unpeopled.
- Darby Translation (DBY)
- For thus saith Jehovah concerning the house of the king of Judah: Thou art a Gilead unto me, the summit of Lebanon: verily I will make thee a wilderness, cities not inhabited.
- Webster's Bible (WBS)
- For thus saith the LORD to the king's house of Judah; Thou [art] Gilead to me, [and] the head of Lebanon; [yet] surely I will make thee a wilderness, [and] cities [which] are not inhabited.
- Young's Literal Translation (YLT)
- For thus said Jehovah, Concerning the house of the king of Judah: Gilead [art] thou to Me — head of Lebanon, If not — I make thee a wilderness, Cities not inhabited.
Read in context
- 4మీరు నిశ్చయముగా ఈలాగున చేసినయెడల దావీదు సింహాసనముమీద కూర్చుండు రాజులు రథములను గుఱ్ఱములను ఎక్కి తిరుగుచు, ఉద్యోగస్థుల సమేతముగాను జనుల సమేతముగాను ఈ నగరు ద్వారములగుండ ప్రవేశింతురు.
- 5మీరు ఈ మాటలు విననియెడల ఈ నగరుపాడై పోవును, నా తోడని ప్రమాణము చేయుచున్నాను; ఇదే యెహోవా వాక్కు.
- 6యూదారాజు వంశస్థులనుగూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నా యెన్నికలో నీవు గిలాదువలెనున్నావు, లెబానోను శిఖరమువలె ఉన్నావు; అయినను నిశ్చయముగా ఎడారిగాను నివాసులు లేని పట్టణములుగాను నేను నిన్ను చేయుదును.
- 7నీమీదికి వచ్చుటకై యొక్కొక్కడు తన ఆయుధములను పట్టుకొను సంహారకులను నేను ప్రతిష్టించుచున్నాను, వారు నీ దేవదారు చెట్లలో శ్రేష్ఠమైనవాటిని నరికి అగ్నిలో పడవేతురు.
- 8అనేక జనులు ఈ పట్టణపు మార్గమున పోవుచు యెహోవా యెందు నిమిత్తము ఈ గొప్పపట్టణమును ఈలాగు చేసెనని యొకని నొకడు అడుగగా
Cross references
- Isaiah 6:11 యెషయా 6:11ప్రభువా, ఎన్నాళ్ల వరకని నేనడుగగా ఆయననివాసులు లేక పట్టణములును, మనుష్యులు లేక యిండ్లును పాడగు వరకును దేశము బొత్తిగా బీడగువరకును
- Psalm 107:34 కీర్తనలు 107:34ఆయన నదులను అడవిగాను నీటి బుగ్గలను ఎండిన నేలగాను సత్తువగల భూమిని చవిటిపఱ్ఱగాను మార్చెను.
- Isaiah 27:10 యెషయా 27:10ప్రాకారముగల పట్టణము నిర్జనమై అడవివలె విడువ బడును విసర్జింపబడిన నివాసస్థలముగా నుండును అక్కడదూడలు మేసి పండుకొని దాని చెట్లకొమ్మలను తినును.
- Micah 3:12 మీకా 3:12కాబట్టి చేనుదున్నబడునట్లు మిమ్మునుబట్టి సీయోను దున్నబడును, యెరూషలేము రాళ్ల కుప్పలగును, మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నతస్థలములవలె అగును.
- Jeremiah 9:11 యిర్మీయా 9:11యెరూషలేమును పాడు దిబ్బలుగాను నక్కలకు చోటుగాను నేను చేయున్నాను, యూదా పట్టణములను నివాసిలేని పాడు స్థలముగా చేయుచున్నాను.
- Jeremiah 26:18 యిర్మీయా 26:18యూదారాజైన హిజ్కియా దినములలో మోరష్తీయుడైన మీకా ప్రవచించుచుండెను. అతడు యూదా జనులందరితో ఇట్లు ప్రకటించుచు వచ్చెను సైన్యముల కధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు చేనుదున్నబడునట్లు మిమ్మునుబట్టి సీయోను దున్నబడును, యెరూషలేము రాళ్లకుప్పలగును, మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నతస్థలములవలె అగును.
- Jeremiah 7:34 యిర్మీయా 7:34ఉల్లాస ధ్వనియు ఆనందధ్వనియు పెండ్లికుమారుని స్వరమును పెండ్లికుమార్తె స్వరమును యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోను లేకుండచేసెదను; ఈ దేశము తప్పక పాడైపోవును.
- Genesis 37:25 ఆదికాండము 37:25వారు భోజనముచేయ కూర్చుండి, కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసికొని పోవుటకు గుగ్గిలము మస్తకియు బోళమును మోయుచున్న ఒంటెలతో ఇష్మాయేలీయులైన మార్గస్థులు గిలాదునుండి వచ్చుచుండిరి.
- Jeremiah 19:7–8 యిర్మీయా 19:7–8తమ శత్రువుల యెదుట ఖడ్గముచేతను, తమ ప్రాణములనుతీయ వెదకువారిచేతను వారిని కూలజేసి, ఆకాశ పక్షులకును భూజంతువులకును ఆహారముగా వారి కళే బరములను ఇచ్చి, ఈ స్థలములోనే యూదావారి ఆలోచనను యెరూషలేమువారి ఆలోచనను నేను వ్యర్థము చేసెదను. ఆ మార్గమున పోవు ప్రతివాడును ఆశ్చర్య పడి దానికి కలిగిన యిడుమలన్నిటిని చూచి అపహాస్యము చేయునంతగా ఈ పట్టణమును పాడు గాను అపహాస్యాస్పదముగాను నేను చేసెదను.
- Jeremiah 25:9–10 యిర్మీయా 25:9–10ఈ దేశముమీదికిని దీని నివాసుల మీదికిని చుట్టునున్న యీ జనులందరి మీదికిని వారిని రప్పించుచున్నాను; ఈ జనులను శాపగ్రస్తులగాను విస్మయాస్పదముగాను అపహాస్యాస్పదముగాను ఎప్పటికిని పాడుగాను ఉండజేసెదను. సంతోషనాదమును ఉల్లాస శబ్దమును, పెండ్లికుమారుని స్వరమును పెండ్లికుమార్తె స్వరమును తిరుగటిరాళ్ల ధ్వనిని దీపకాంతిని వారిలో ఉండకుండ చేసెదను.
- Jeremiah 22:24 యిర్మీయా 22:24యెహోవా సెలవిచ్చునదేమనగా యూదా రాజైన యెహోయాకీము కుమారుడగు కొన్యా నా కుడిచేతికి శిఖా ఉంగరముగా ఉండినను దానిమీద నుండియు నిన్ను ఊడదీసివేసెదనని నాతోడని ప్రమాణముచేయుచున్నాను.
- Jeremiah 21:14 యిర్మీయా 21:14మీ క్రియల ఫలములనుబట్టి మిమ్మును దండించెదను, నేను దాని అరణ్యములో అగ్ని రగుల బెట్టెదను, అది దాని చుట్టునున్న ప్రాంతములన్నిటిని కాల్చివేయును; ఇదే యెహోవా వాక్కు.